బాబా భాస్కర్‌కు షాక్.. బంటు వెళ్లిపోయాడు.. బిగ్‌బాస్ ఎలిమినేషన్‌లో ఈసారి..
బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేషన్ ప్రక్రియ అన్నది ఎంత ఉత్కంఠగా సాగాలో అందుకు భిన్నంగా అంతకు మించిన నిరాసక్తితో జరుగుతోంది. ఎలిమినేషన్ కాబోయే వ్యక్తి వివరాలు ఎంత గోప్యంగా ఉంచాలో.. అంతకు మించి బహిరంగ పరుస్తున్నారు. అయితే ఇదెవరి తప్పిదం అన్నది చర్చిస్తే.. ఇప్పట్లో తేలే అంశం కూడా కాదు. ఎప్పటిలాగే ఎలిమినేషన్ కాబోయేది ఎవరన్నది శనివారం సాయంత్రానికి లీకై పోయింది.

నామినేషన్లోకి వచ్చిన నలుగురు..
రాళ్లే రత్నాలు అనే టాస్క్లో తక్కువ విలువైన రాళ్లను ఏరి మొదటగా నామినేషన్స్లోకి వెళ్లాడు రాహుల్.అనంతరం మహేష్, పునర్నవి, వరుణ్ వచ్చి చేరారు. అయితే వరుణ్ బ్యాచ్లో ఇలా ముగ్గురూ ఒకే సారి నామినేషన్స్లోకి రావడంతో వారి ఓట్లు చీలుతాయేమోనని అందరూ ఫీలయ్యారు. కానీ చివరకు ఆ ముగ్గురు సేవ్ అయిపోయినట్లు తెలుస్తోంది. మహేష్ ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో టాక్ విపిస్తోంది.

బాబా బంటుగా పేరు..
బిగ్ బాస్ హౌస్లో మొదట్లో డిఫరెంట్ మెంటాల్టీతో ఉన్న మహేష్ విట్టా.. రానురాను తన స్వభావాన్ని మార్చుకుంటూ వచ్చాడు. ఫస్ట్ వీక్లో ఫుల్ ఫైర్ మీదున్న మహేష్.. వారాలు గడుస్తున్న కొద్దీ శాంతమూర్తిలా తయారయ్యాడు. అయితే మధ్యలో కాస్త ఫైర్ అయినా.. మళ్లీ వెంటన్ కూల్ అయ్యేవాడు. బాబాకు బంటుగా ఉంటున్నాడని వచ్చిన ట్యాగ్ ను పోగొట్టుకునేందుకు బాగానే ట్రై చేశాడు. అందుకోసం వరుణ్ బ్యాచ్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు.

బాబా, మహేష్ మధ్య మనస్పర్థలు
వరుణ్ బ్యాచ్ కు దగ్గరయ్యే క్రమంలో బాబాతో పొరపచ్చాలు ఏర్పడ్డాయి. మధ్యలో శ్రీముఖి దూరిపోయిందని, తనకు బాబాకు మధ్య గొడవలు పెడుతుందని శ్రీముఖితో కూడా అంతగా కలవడం లేదు. అయితే వీరి మధ్య దూరం పెరిగిన ప్రతీసారి.. మళ్లీ కలిసిపోయేవారు. ఒకానొక సమయంలో బాబాను మహేష్ ప్రభావితం చేస్తున్నాడని, వారిద్దరిని వేరు చేయాలని శ్రీముఖి చెప్పిన సందర్భం కూడా ఉంది.

అక్కడివి ఇక్కడ.. ఇక్కడివి అక్కడ
హౌస్లో ఉన్న రెండు గ్రూపులకు వారధిలా ఉంటూ.. వాటితో సఖ్యతగా ఉందామని స్ట్రాటజీ ప్లే చేశాడు. అందుకే వారి ముందు వీరి గురించి.. వీరి ముందు వారి గురించి మాట్లాడుతూ ఉంటాడు. కానీ తాను మాత్రం బయటపడడు. వరుణ్ బ్యాచ్ కు శ్రీముఖి గురించి చెబుతాడు.. శ్రీముఖి వద్ద వీరి గురించి మాట్లాడుతూ ఉంటాడు.

బాస్ హౌస్లో మహేష్
75 రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉన్న మహేష్ ఈ పదకొండో వారంలో ఎలిమినేట్ అయ్యాడు. మరి మహేష్ ఎలిమినేట్ అయినట్లు వస్తున్న వార్త అధికారికమేనని తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. అంతకు మునుపే నాగార్జున వచ్చి.. ఈ వారం హౌస్ మేట్స్ లెక్కలన్నీ సరి చేస్తాడు. ఇక నేటి వీకెండ్ ఎపిసోడ్లో వితికాకు బాగానే క్లాస్ పీకుతున్నట్లు కనిపిస్తోంది. వితికా కూడా గట్టిగానే వాదిస్తున్నట్లు తెలుస్తోంది. మరి తరువాత ఏం జరిగిందో తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాలి.


Click it and Unblock the Notifications











