బిగ్ షాక్.. పునర్నవి పోయింది.. డబుల్ ధమాకానా?
బిగ్ పదకొండో వారానికి చేపట్టిన నామినేషన్ ప్రక్రియే కొత్తగా ఉందంటే.. వీకెండ్ లో ఇవ్వబోతోన్న ట్విస్ట్ మరోలా ఉండబోతోంది. డబుల్ ఎలిమినేషనా? సింగిల్ ఎలిమినేషనా? అని తెలీక నెటిజన్లు తలలు గోక్కుంటున్నారు. శనివారం సాయంత్రానికే.. ఎలిమినేషన్ కు సంబంధించిన వివరాలను లీకువీరులు సోషల్ మీడియాలో దండోరా వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వారానికి కూడా అలాగే జరగింది. అయితే చివర్లో బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

మహేష్ ఎలిమినేషన్ అంటూ ప్రచారం..
పదకొండో వారంలో రాహుల్, మహేష్, పునర్నవి, వరుణ్ లు రాళ్లే రత్నాలు అనే టాస్క్లో వెనకబడిపోయి.. ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు నామినేషన్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీరందరిలోమహేష్ కు కొంచెం తక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉందని అందరికీ తెలిసిందే. వారి ముగ్గురికి విడివిడిగా ఫ్యాన్స్ ఉండగా.. వారి నలుగురిని ఇష్టపడే ఓ వర్గం కూడా ఉండటంతో ఓట్లు కలిసే వచ్చే అవకాశం ఉంది. అయితే అందరి ఊహాగానాలకు తగ్గట్లే మహేష్ ఎలిమినేట్ అయినట్లు నిన్న సాయంత్రమే ట్రెండ్ అయింది.

నేడు అనూహ్యంగా మరో షాకింగ్ న్యూస్..
‘నాగార్జున గారు' అంటూ వీకెండ్ లో ప్రత్యేకంగా సంభోదించే పునర్నవి ఎలిమినేట్ అయిందనే వార్త వైరల్ అవుతోంది. పీవీవీఆర్ బ్యాచ్ పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరైందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నిజంగానే పున్ను ఎలిమినేట్ అయితే రాహుల్ పరిస్థితి ఏంటని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇంతకి ఈ వార్త మరి నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి.

టాస్కులు ఆడదంటూ కంప్లైంట్..
మొదట్నుంచీ పునర్నవి టాస్కులకు దూరంగా ఉంటూ వస్తోంది. సరిగ్గా పర్ఫామెన్స్ చేసిన ఒక్క టాస్క్ కూడా ఇప్పటి వరకు ఆమె ఖాతాలో లేదు. దెయ్యాల టాస్కులో ఆమెను స్విమ్మింగ్ పూల్ లో పడేయడంతో బిగ్ బాస్ పైనే రివర్స్ కావడం.. మినహా ఇంతవరకు చేసిందేమీ లేదు. మొన్నటి అత్త రాజ్యంతో కోడళ్ల పాట్లు టాస్కులో కూడా వరుణ్ రాహుల్ గొడవ పడుతుంటేచూస్తూ ఉంది కానీ, సర్ది చెప్పి ఇటుకలు పేర్చి టాస్క్ ను మాత్రం పూర్తి చేయలేకపోయింది.

రాహుల్ పునర్నవి డిప్లమసి రిలేషన్..
వీరిద్దరి మధ్య ఉన్నది ఏంటో ఎవరికీ తెలీదు. వారు మంచి స్నేహితులే అని బయటకు వచ్చిన హౌస్ మేట్స్ చెబుతున్నారు. వాళ్ల జంటను, ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారని వాళ్లకు తెలుసు అందుకు వారు దాన్ని వాడుకుంటున్నారు.. ఏదీ బయటకు ఓపెన్ చెప్పడం లేదంటూ హిమజ చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై నాగార్జున ఎన్నిసార్లు ప్రశ్నించినా స్నేహితులమేనంటూ దాటవేస్తారు. ఫ్రెండ్సా? లవర్సా? అని అడిగితే రెండు కాదు.. కాంప్లికేటెడ్ ఫ్రెండ్స్ అంటూ తన స్లైల్లో వింత సమాధానం చెప్పుకొస్తుంది.

డబుల్ ఎలిమినేషనా..?
నిన్నంతా మహేష్ ఎలిమినేట్ అయినట్లు వార్తలు రాగా.. నేటి ఉదయం నుంచి పునర్నవి ఎలిమినేట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కన్ఫ్యూజ్ అవుతున్న నెటిజన్లు.. డబుల్ ఎలిమినేషన్ ఉందా ? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి నిజంగానే డబుల్ ఎలిమినేషన్లో భాగంగానే.. మహేష్, పునర్నవి ఎలిమినేట్ అయినట్లు లీకులు బయటకు వచ్చాయా? లేక లీకు వీరులు ఈ సారి తమ సోర్సెస్ ను సరిగా ఉపయోగించలేదా? అన్నది చూడాలి. ఈ ఇద్దరూ బయటకు వెళ్లారా? లేక ఒక్కరే బయటకు వెళ్లారా? ఒక్కరే అయితే.. ఎవరు ఎలిమినేట్ అయి ఉంటారన్నది అధికారికంగా తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











