ఆ పాట వింటే రవికి తమన్నా గుర్తొస్తుందట.. శ్రీముఖిపై మహేష్ అదిరిపోయే కౌంటర్
బిగ్‌బాస్ కంటెస్టెంట్లు బయటకు వచ్చాక తమ అభిప్రాయాలను మరింత సూటిగా చెప్పేస్తున్నారు. హౌస్‌లోనూ కొంతమేరకు చెప్పినా.. ఎలిమినేట్ అయి బయటకు వచ్చాక మనసులో అనుకున్న వాటి గురించి ఓపెన్ అవుతున్నారు. తాజాగా సుమ హోస్ట్ చేస్తోన్న ఎఫ్3 ప్రోగ్రామ్‌లో రవికృష్ణ, మహేష్ తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని అందర్నీ ఎంటర్టైన్ చేశారు.
ఈ క్రమంలో షోలో ప్లే చేసిన సాంగ్స్‌కు తమకు గుర్తొచ్చే బిగ్‌బాస్ కంటెస్టెంట్ల పేర్లను చెప్పమని టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా కంత్రీ సినిమాలోని టైటిల్ సాంగ్‌ను ప్లే చేయగా వితికా అని రవి చెప్పగా.. అతని ఇంటి సభ్యులు ఓ కౌంటర్ వేశారు. రాములో రాముల సాంగ్ వింటే తమన్నా గుర్తొస్తుందంటూ చెప్పుకొచ్చాడు.

నేనున్నాను సినిమాలోని ఎమోషనల్ సాంగ్ (నేనున్నానని..) అనే పాటను ప్లే చేయగా.. శ్రీముఖి అంటూ మహేష్ చెప్పుకొచ్చాడు. ఎవ్వరు బాధలో ఉన్న శ్రీముఖి ఓదార్చుతుందని.. మీరు(సుమ) కాలు జారి పడిపోయిన వచ్చి ఓదారుస్తుందని శ్రీముఖిపై కౌంటర్ వేశాడు. దీంతో తనది కాలు జారే వయసా అంటూ సుమ మరో పంచ్‌ను పేల్చేసింది. మరి ఈ షోలో బిగ్‌బాస్ హౌస్ గురించి ఇంకెన్ని విషయాలు చెప్పారో చూడాలి.


Click it and Unblock the Notifications











