శివజ్యోతి ఎలిమినేషన్.. పబ్‌లో ఎంజాయ్ చేస్తోన్న బిగ్‌బాస్ కంటెస్టెంట్లు
బిగ్‌బాస్ చివరి దశకు చేరుకుంది. పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఒక రీఎంట్రీ ఇలా ఎన్నో ట్విస్ట్‌లతో కొనసాగుతూ వస్తోన్న బిగ్‌బాస్ షో తుది పోరుకు సిద్ధమైంది. టైటిల్ గెలిచి యాభై లక్షలను చేజిక్కించుకునేందుకు టాప్ 5 కంటెస్టెంట్లుగా రాహుల్, శ్రీముఖి, బాబా, వరుణ్, అలీ రంగంలోకి దిగారు. టాప్5లో ఉంటానని ఎంతో నమ్మకంగా చెప్పుకున్న శివజ్యోతికి ఎదురుదెబ్బ తగిలింది.

మెల్లి మెల్లిగా మొదలైన ప్రయాణం..
బిగ్‌బాస్ షో ప్రారంభమైన మొదట్లో శివజ్యోతి పేరు అంతగా వినిపించకపోయినా.. కాలం గడుస్తున్న కొద్దీ.. హౌస్‌లో కంటెస్టెంట్లు తగ్గుతున్న కొద్దీ శివజ్యోతి లైమ్‌లైట్‌లోకి రావడం ప్రారంభం అయింది. చాపకింద నీరులా శివజ్యోతి మారుతోందని ఒకానొక దశలో నాగార్జున కూడా అందర్నీ హెచ్చరించాడు.

నామినేషన్‌లోకి రాకుండా దాగుడు మూతలు..
మొదట్లో ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా, ఏ విషయంలోనూ దూరకుండా అంటి అంటన్నట్లున్న శివజ్యోతిని ఎవ్వరూ నామినేట్ చేయలేదు. ఒకసారి బిగ్‌బాస్ నేరుగా నామినేట్ చేశాడు. మిగతా కంటెస్టెంట్ల మాదిరి ఎవరి కూడా ఆమెను నామినేట్ చేయలేదు. దీంతో మెల్లిమెల్లిగా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారుతూ వచ్చింది.

టాస్క్‌లో పట్టు వదలకుండా..
బిగ్‌బాస్ ఎలాంటి టాస్క్ ఇచ్చినా.. వెనకడుగు వేయలేదు. మగవారితో సమానంగా పోటీ పడింది. కింగ్ టాస్క్‌లో శివజ్యోతిని అలీ అమాంతంగా తోసేయడం నుంచి ఆమె పేరు ఎక్కువగా వినిపించసాగింది. అలా తోసేసినా గొడవ చేయకుండా స్పోర్టీవ్‌గా తీసుకోవడంతో అందరూ ప్రశంసించారు.
Recommended Video

ఏడుపుతో విసుగెత్తిస్తూ...
ప్రతీ చిన్న ఎమోషన్‌కు ఏడుస్తూ చూసే ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. అయితే అది తన ఎమోషన్ అని, దాని వల్ల టాస్క్‌లకు గానీ, బిగ్‌బాస్ హౌస్‌కు గానీ ఎలాంటి నష్టం వాటిల్లదలేదని, మళ్లీ కొంతసేపటికే నార్మల్ అవుతానని చెప్పుకున్నా.. ఏడుపును మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయింది.

పద్నాలుగో వారంలో ఎలిమినేట్...
టికెట్ టు ఫినాలే టాస్క్‌లో ఓడిపోయిన నామినేషన్‌లోకి వచ్చిన శివజ్యోతి.. ఊహించినట్టుగానే ఎలిమినేట్ అయింది. అయితే అంతకుముందే ఇదే విషయాన్ని బాబా భాస్కర్‌తో చర్చిస్తూ.. అలీ, తాను వెళ్లాకే బాబా వెళ్తాడని, తామిద్దరమే డేంజర్ జోన్‌లో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. అనుకున్నట్లే శివజ్యోతి ఎలిమినేట్ అయింది.

పబ్‌లో ఎంజాయ్ చేస్తోన్న కంటెస్టెంట్లు..
బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన శివజ్యోతి అందరితో కలిసి బాగానే ఎంజాయ్ చేస్తోంది. హౌస్‌లో క్లోజ్ ఫ్రెండ్స్‌గా మారిన హిమజ, అషూ, శివజ్యోతి, మహేష్, రవి అందరూ కలిసి పబ్‌లో ఎంజాయ్ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మేరకు హిమజ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











