దెయ్యం కూడా అందంగా.. శ్రీముఖిపై సెటైర్.. రాహుల్, పున్ను అదే.. రవికృష్ణ ఔట్

Recommended Video

Bigg Boss Telugu Season 3 : Episode 71 Highlights

బిగ్‌బాస్ తెలుగు షో ప్రస్తుత వారాంతం చాలా సందడిగా సాగిపోయింది. పదివారాల్లో ఈ వారం చాలా సందడిగా ముగిసిపోయింది.ఇంటి సభ్యులందరూ తమ ప్రతిభను బయటపెట్టుకొనేందుకు స్కిట్లను ప్రదర్శించారు. అంతేకాకుండా కిస్ అండ్ కిల్ అనే గేమ్‌ను ఆడారు. ఇలా ఆటపాటల మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగించారు. చివర్లో బాబా భాస్కర్, రవికృష్ణ ఇద్దరు మిగలగా వారిలో ఒకరిని సేఫ్ చేసి మరొకరిని విజయవాడకు ఫ్లయిట్ టికెట్ వేసి బయటకు పంపించారు.

బిగ్‌బాస్ వీకెండ్ స్పెషల్‌లో

బిగ్‌బాస్ వీకెండ్ స్పెషల్‌లో

బిగ్‌బాస్ వీకెండ్ స్పెషల్‌లో ఇంటి సభ్యుల టాలెంట్ ప్రదర్శించుకొనేందుకు ఓ గేమ్‌ను ఆడించారు. ఇంటిలో యాంకర్లుగా వ్యవహరిస్తూ ఇంటి సభ్యుల గురించే మాట్లాడుతూ ఆకట్టుకోవాలి. అందుకోసం మహేష్-శివజ్యోతి ఒక జంటగా, వితిక-అలీ రెజా, రవికృష్ణ-వరుణ్ సందేశ్ మరో జంటగా, రాహుల్-పునర్నవి, బాబా భాస్కర్-శ్రీముఖి మరో జంటగా యాక్ట్ చేశారు.

యాంకర్, రిపోర్టర్‌గా

యాంకర్, రిపోర్టర్‌గా

మహేష్-శివజ్యోతి యాంకర్, రిపోర్టర్‌గా స్కిట్ చేయగా.. రాహుల్, పునర్నవి మధ్య ఏమి జరుగలేదు.. పైకి మాత్రమే అలా రొమాంటిక్‌గా ఉంటారు అని మహేష్ చెప్పాడు. ఇక అనుమానం భార్యగా వితిక, అవస్థలు పడే భర్తగా అలీ రెజా, ఎలిమినేటెడ్ కంటెస్టెంట్‌గా వరుణ్ సందేశ్, యాంకర్‌గా రసం రవికృష్ణ వినోదాన్ని పంచారు.

శ్రీముఖి-బాబా భాస్కర్

శ్రీముఖి-బాబా భాస్కర్

శ్రీముఖి-బాబా భాస్కర్ ప్రదర్శించిన స్కిట్ చాలా ఫన్నీగా సాగింది. అందంగా లేకపోవడం వల్ల పెళ్లి సంబంధాలు కుదరడం లేదని చెబితే.. వొప్పో రెనో ఫోన్‌తో ఫొటో దిగితే.. దెయ్యం కూడా అందంగా కనపడుతుంది. వెంటనే ఆ ఫోన్‌లో ఫోటో దిగు. వెంటనే పెళ్లి అయిపోతుందని సలహా ఇచ్చాడు. ఇంకా డ్యాన్సర్‌గా శ్రీముఖి, బాబా జడ్జీగా ప్రదర్శించిన మరో స్కిట్ ఆకట్టుకొన్నది.

ఇక పునర్నవి-రాహుల్

ఇక పునర్నవి-రాహుల్

ఇక పునర్నవి-రాహుల్ ప్రదర్శించిన స్కిట్ సూపర్‌గా అనిపించింది. రాహుల్ పాడిన ఆకట్టుకోగా.. పునర్నవి తన ఫెర్ఫార్మెన్స్‌తో ఇరుగ దీసింది. ఫిదా పాటకు పేరెడిగా పాడిన పాట అద్భుతంగా ఉంది. రాహుల్‌పై వేసిన సెటైర్‌తో కూడిన పాట ఆకట్టుకొంది

ఇక ఇంటిలో కిస్ అండ్ కిల్

ఇక ఇంటిలో కిస్ అండ్ కిల్

ఇక ఇంటిలో కిస్ అండ్ కిల్ గేమ్‌‌ను బిగ్‌బాస్ ఆడించారు. చివరగా మిగిలిన బాబా భాస్కర్, రవికృష్ణలో ఎలిమినేషన్ ప్రక్రిమ మొదలైంది. ఇద్దరిలో రవికృష్ణను ఎలిమినేట్ చేసి.. బాబా భాస్కర్‌ను సేఫ్ చేశారు. దాంతో ఇంటి సభ్యులతో రవికృష్ణ బిగ్‌బాస్ వేదికపై ప్రత్యక్షమయ్యాడు.

పునర్నవిపై బిగ్‌బాంబ్

పునర్నవిపై బిగ్‌బాంబ్

నాగార్జున ఉన్న వేదికపైకి వచ్చి రవికృష్ణ వచ్చారు. ఇంటిలోని 10 వారాల జర్నీ చూశారు. తన ఎమోషనల్ విషయాలన నాగ్‌తో, ఇంటి సభ్యులతో పంచుకొన్నారు. చివరగా ఇంటి సభ్యుల బట్టలు ఉతికే విధంగా పునర్నవి బిగ్‌బాంబ్‌ను రవికృష్ణ విసిరాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X