For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వితికా షెరు ఆత్మహత్యాయత్నం అసలు కహాని అదే.. బయటపెట్టిన హీరోయిన్

  |

  బిగ్‌బాస్ మూడో సీజన్‌లో కొందరు ఫేమస్ అవ్వగా.. మరికొందరికి చేదు అనుభవమే మిగిలింది. ముఖ్యంగా రాహల్, పునర్నవి, వరుణ్, వితికలకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఈ నలుగురిలో వితికాపై కొంత నెగెటివిటీ పెరిగినా అది అంత ప్రభావం చూపించలేదు. వితికా తన ప్రవర్తనతో కొంత బ్యాడ్ అయిన మాట వాస్తవమే అయినా.. మొత్తంగా చూస్తే వితికా ధైర్యాన్ని, స్పోర్టీవ్‌నెస్‌ను, టాస్క్‌లో చురుగ్గా పాల్గొనే విధానానికి మంచి మార్కులే పడ్డాయి. ఈ నలుగురు ఓ గ్యాంగ్‌గా ఉండటం అందరికీ కలిసి వచ్చింది.

  సోషల్ మీడియాలో గ్యాంగ్ హల్‌చల్..

  సోషల్ మీడియాలో గ్యాంగ్ హల్‌చల్..

  బయటకు వచ్చాక కూడా ఈ గ్యాంగ్ హల్‌చల్ చేస్తూ వస్తోంది. పార్టీల మీద పార్టీలు చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియలో ఎక్కడ చూసినా వీరి హడావిడే కనబడుతోంది. యూట్యూబ్ చానెళ్లలో ఈ నలుగురి ఇంటర్వ్యూలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో వితికాకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది.

  ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు..

  ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు..

  ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత కారణాలతో వితికా షెరు ఆత్మహత్య చేసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి ఆసుపత్రిలో ఉన్న ఓ ఫోటో వైరల్ అయింది. దీనికి సంబంధించి వితిక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.

  అది ఆత్మ హత్య కాదు..

  అది ఆత్మ హత్య కాదు..

  తాను స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్న మాట వాస్తవమేనని చెప్పుకొచ్చింది. కానీ ఎందుకు తీసుకున్నాను అంటే.. తాను యూఎస్‌లో ఆర్నెళ్లు ఉన్నానని, ఆ తరువాత ఇండియాకి వచ్చానన తెలిపింది. అయితే అక్కడికి ఇక్కడికి వాతావరణ మార్పుల వల్ల నిద్ర పట్టేది కాదని పేర్కొంది. దీంతో మా అసిస్టెంట్‌ను పంపించి నిద్రమాత్రలు తెప్పించుకున్నానని తెలిపింది. వాటిని తీసుకోవడం నాకు అదే ఫస్ట్ టైమని, మొదట ఒక టాబ్లెట్ వేసుకుని ట్రై చేశా అయినా నిద్ర రాలేదని వెల్లడించింది.

  నాలుగు టాబ్లెట్స్ వేసుకోవడంతో..

  నాలుగు టాబ్లెట్స్ వేసుకోవడంతో..

  దీంతో వన్ అవర్ వెయిట్ చేసి మరో ట్యాబ్లెట్ వేసుకున్నానని తెలిపింది. నిజానికి అప్పుడు మేం హాలిడే ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నామని, అందుకే మనశాంతిగా పడుకుందామని స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నాని చెప్పుకొచ్చింది. రెండు ట్యాబ్లెట్స్ వేసుకున్నా నిద్రరాకపోవడంతో మరో రెండు వేసుకున్నానని, అది కూడా 0.5 ఎమ్. జీ పవర్ ఉన్నవని పేర్కొంది. అయితే నాలుగు టాబ్లెట్స్ వేసుకున్న గంట తరువాత నిద్ర పట్టిందని అలా రాత్రి 1 గంటకు నేను నిద్ర పోయానని చెప్పుకొచ్చింది.

  #CineBox : Balakrishna Suggestions To Boyapati Sreenu For Their Upcoming Film !
  అలా ఆ ఫోటో బయటకు..

  అలా ఆ ఫోటో బయటకు..

  ఉదయాన్నే 6 గంటలకు అమ్మ వచ్చి నన్ను లేపడానికి ట్రై చేసిందని, తాను నిద్ర మత్తులో ఉండిపోయి లేవలేకపోవడంతో తనను హాస్పటల్‌కి తీసుకుని వెళ్లారని అప్పటి విషయాలను గుర్తు చేసుకుంది. ఆ సందర్బంలో తన ఫోన్‌లోనే ఒక ఫొటో తీశారని, ఆ ఫొటో తన ఫ్రెండ్ ద్వారా బయటకు వెళ్లిందని తెలిపింది. తాను ట్రీట్ మెంట్ తీసుకుని సాయంత్రానికే డిస్చార్చ్ అయ్యి ఇంటికి వెళ్లానని అటుపై ఫ్రెండ్స్‌తో కలిసి డిన్నర్‌ పార్టీకి వెళ్లానని నాటి కహాని అంతా చెప్పింది.

  English summary
  Bigg Boss 3 Telugu Fame Vithika Sheru Suicide Story. She Revealed Unknown Facts Behind That Story. That Time She Is Taken Sleeping Tablets For Peaceful.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X