బిగ్‌బాస్ 3 తెలుగు ఫినాలె : బామ్మకు ఐ లవ్యూ చెప్పిన నాగ్
జూలై 21న మొదలైన బిగ్‌బాస్ మూడో సీజన్ నవంబర్ 3న ముగిసేందుకు వచ్చింది. పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఎవ్వరూ ఊహించని రీ ఎంట్రీ, ఈ మూడో సీజన్‌కు హైలెట్‌గా నిలిచిన స్పెషల్ హోస్ట్ రమ్యకృష్ణ, తనస్టైల్లో సీజన్‌ను విజయవంతం చేసిన నాగార్జున ఇలా ఎన్నో విశిష్టతలతో కూడిన బిగ్‌బాస్ మూడో సీజన్‌కు వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది.
ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ ఫినాలే ఎపిసోడ్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎంతో మంది వెండితెర తారలు, బుల్లితెర నటీనటులు తమ ఆటపాటలతో అలరిస్తున్నారు. ఈసీజన్‌కు విన్నర్‌గా నిలిచే కంటెస్టెంట్‌కు ఓ ప్రత్యేకమైన అతిథి చేతుల మీదుగా టైటిల్, కప్పును అందజేయనున్నారు. అంతకంటే ముందు బిగ్‌బాస్ వీక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు అతిరథమహారథులు వారి ఆటపాటలతో అందర్నీ మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ ఫినాలె ఎపిసోడ్ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

బామ్మకు ఐ లవ్యూ చెప్పిన నాగ్
కంటెస్టెంట్లందరితో మాట్లాడుకొచ్చిన నాగ్ .. వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. అలీ రెజా ఫ్యామిలీ మెంబర్స్, వరుణ్ సందేశ్ బామ్మ, రాహుల్ అమ్మ, శ్రీముఖి తమ్ముడు, బాబా ఫ్యామిలీ ఇలా అందరినీ టచ్ చేశాడు. ఇక అందరిలో బామ్మ చేసిన కామెడీ భలే ఆకట్టుకుంది. మనం సినిమాలోని నాగ్ డైలాగ్ తనకు ఇష్టమని చెప్పింది. ఇాలా ఇవ్వు (ఐ లవ్యూ) అంటూ బామ్మకు ఐ లవ్యూ అని చెప్పాడు. గతంలో బిగ్‌బాస్ హోటల్ టాస్క్‌లో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బామ్మ ఎంతగా ఫేమస్ అయిందో తెలిసిందే. బిగ్‌బాస్‌ను ఇంటికి పిలిచి అందర్నీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











