గాలి దేవుడు ఎవరిని కరుణిస్తాడు.. అంతలో వానదేవుడు వస్తే.. డిఫరెంట్ టాస్క్ ఇచ్చిన బిగ్‌బాస్
Recommended Video
ఫైనల్ టికెట్ అంటూ హౌస్మేట్స్‌లో ఆశలను చిగురించేలా చేశాడు బిగ్‌బాస్. పద్నాలుగో వారంలో నామినేషన్ ప్రక్రియను డిఫరెంట్‌గా ప్లాన్ చేసిన బిగ్‌బాస్.. అందర్నీ అదిదిపోయా చాన్స్ ఇచ్చాడు. ఫైనల్ టికెట్ గెలుచుకుంటే..నేరుగా ఫైనల్‌కు వెళ్లే అవకాశముంటుందని తెలిపాడు.

ఓడిపోయిన శివజ్యోతి, వరుణ్, శ్రీముఖి
దీనికోసం ఇంటి సభ్యులందరూ బాగానే కష్టపడుతున్నారు. వారికిచ్చిన పర్సెంటేజ్‌ను పెంచేకునేందుకు రీఫిల్ చేసుకునేందుకు అవస్థలు పడుతున్నారు. పది హేను అరిట పళ్లు తిని శివజ్యోతి 21 అరటి పళ్లు తిన్న అలీ చేతిలో ఓడిపోయింది. దీంతీ అలీ బ్యాటరీ శాతం పెరగ్గా.. శివజ్యోతితి తగ్గిపోయింది. ఇలా డిఫరెంట్ టాస్కుల్లో రాహుల్ చేతిలో వరుణ్.. బాబా చేతిలో శ్రీముఖి ఓడిపోయారు.

అలీ, బాబా మధ్య పోరు
నేటి ఎపిసోడ్‌లో కూడా ఇలాంటి విభిన్న టాస్క్‌లనే ఇచ్చినట్లు కనిపిస్తోంది. అలీ, బాబాకు మల్లయుద్దం చేసినట్టుగా కొట్టుకుంటూ ఉన్న టాస్క్ కూడా కాస్త హద్దులు దాటేట్టు కనిపిస్తూ ఉండగా.. మరో కొత్త టాస్క్‌ను ఇచ్చినట్టు కనిపిస్తోంది. డామినోస్‌ను ఇచ్చి.. చిన్నపిల్లలు ఆడుకున్నట్లుగా వాటిని ఒక క్రమంలో నిలబెట్టాలని తెలిపాడు.

గాలి దేవుడు చేతిలో..
అయితే గాలి దేవుడు ఎవరినీ కనుకరిస్తారో వారే చివరకు విజేతలు అవుతారని తెలిపాడు. చివరి వరకు ఎక్కువగా ఎవరి డామినోస్ నిలబడి ఉంటే వారే ఆ టాస్క్ విజేతలువుతారని తెలిపాడు. ఇంటి సభ్యుల భవిష్యత్తును గాలికొదొలేశాడు, అయితే గాలి దేవుడు ఒకే మరి ఇంతలో వరుణ దేవుడు వస్తే ఎలా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











