హిమజ చేసిన పనికి నెటిజన్ల ప్రశంసలు.. ఆ కోరిక తీరకపోయినా.. అలా జరిగిందంటూ కామెంట్లు
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నంత సేపు ఎవ్వరికీ అర్థంకాని మనస్తత్వంతో ఉన్న హిమజ.. బయటకు వచ్చాక ఫుల్ బిజీ అయింది. హిమజ చేసిన టాస్క్‌లతో ఫుల్ ఫేమస్ కాగా.. అదే తనకు ఎక్కడా లేనీ క్రేజ్‌ను తీసుకొచ్చింది. గురు సినిమాలోని ఓ సక్కనోడా సాంగ్‌ను పాడిన విధానం, మనోహరా అంటూ రాహుల్‌తో డ్యూయట్ పర్ఫామెన్స్, ట్రైన్ టాస్క్‌లో మహేష్, హిమజలు భార్యాభర్తలుగా నటించిన తీరు ఇలా అన్నింటిలో తన మార్క్ చూపెట్టి ఎంతో మందిని తన అభిమానులుగా మార్చుకుంది.

బిగ్‌బాస్ హౌస్‌లో పుట్టినరోజు..
నవంబర్ 2న తన పుట్టిన రోజు.. అని ఆ రోజు వరకు బిగ్‌బాస్‌లోనే ఉండాలని, తన బర్త్‌డే బిగ్‌బాస్ హౌస్‌లో సెలబ్రేట్ చేసుకోవాలిని కోరుకున్న సంగతి తెలిసిందే. అలా అనుకున్నవి, కోరుకున్నవి జరిగితే అది బిగ్‌బాస్ అనిపించుకోదు కదా.. అనూహ్యంగా హిమజ ఎలిమినేట్ అయింది.

బయట ఫుల్ ఫాలోయింగ్..
బయటకు వచ్చాక పలు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్‌లో పాల్గొంటు తెగ హల్‌చల్ చేసింది. హౌస్‌లో ఉండి సంపాదించుకున్న క్రేజ్ హిమజకు బాగానే ఉపయోగపడింది. మిగతా అందరి కంటెస్టెంట్ల కంటే ఫుల్ ఫేమస్ అయింది. బయటకు వచ్చిన హిమజ.. శ్రీముఖిపై నెగెటివ్ కామెంట్స్ చేయడం, శివజ్యోతిని సపోర్ట్ చేయడం లాంటివి చేస్తూ వచ్చింది.
క్యాన్సర్ బారిన పడిన పిల్లలతో..
తాజాగా తన పుట్టిన రోజును క్యాన్సర్ బారిన పడిన పిల్లలతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. దీంతో హిమజపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి మంచి పనులు అందరూ చేయాలని హిమజకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రవికృష్ణ, శివజ్యోతి, రోహిణి.. హిమజ బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్ చేసినట్లు తెలుస్తోంది.

మళ్లీ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు..
తన బర్త్‌డేను బిగ్‌బాస్ హౌస్‌లో జరుపుకోవాలని కోరుకున్న హిమజకు ఆ కోరిక తీరకపోయినా.. నిన్నటి ఎపిసోడ్‌లో హౌస్‌లోకి ఆమె మళ్లీ ఎంట్రీ ఇవ్వడం.. అది పుట్టిన రోజునే టెలికాస్ట్ అయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక నేటి ఎపిసోడ్‌లో హౌస్ అంతా సందడిగా మారనున్నట్లు కనిపిస్తోంది. అందరికీ అవార్డులు, టైటిల్స్ అందనున్నాయి. మరి ఎవరికి ఏ ఏ బిరుదులను అంటగడతారో చూడాలి.


Click it and Unblock the Notifications











