శివజ్యోతికి ఓటు వేయండంటూ దండోరా వేస్తోన్న హిమజ
బిగ్‌బాస్ హౌస్‌లో డిఫరెంట్ క్యారెక్టర్‌తో ఎవ్వరికీ అర్థం కాని కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకుంది హిమజ. హౌస్‌లో ఉన్నంత కాలం శ్రీముఖి పక్కన ఉన్న హిమజ.. బయటకు వచ్చాక ఆమెపై సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా శివజ్యోతికి మాత్రమే టైటిల్ గెలిచే అర్హత ఉందంటూ కామెంట్లు చేస్తూ హల్‌చల్ చేస్తోంది.
ఎలిమినేట్ అయిన అనంతరం హిమజ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో శ్రీముఖి గురించి నెగెటివ్‌గా చెప్పుకుంటూ వచ్చింది. పునర్నవి అంటే తనకు నచ్చదనే విషయాన్ని చెప్పడమే కాకుండా.. ఆమె ఎలిమినేట్ అయిందని చెప్పగానే టీవీ ముందుకు వచ్చి మీర డ్యాన్సులు వేసింది. ఇదే విషయాన్ని పునర్నవి వద్ద ప్రస్థావిస్తే.. తను అలా చేస్తుందని ముందే ఊహించానని సున్నితంగా చెప్పేసింది.

శివజ్యోతి చాలా మంచిదని, టాస్క్‌లు బాగా ఆడుంతుందని, ఎవరైనా బాధలో ఉంటే.. వచ్చి ఓదారుస్తుందని అందుకే తనను సపోర్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఓట్లు వేయండి అని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొస్తోంది. నామినేషన్ ప్రక్రియ అనంతరం.. శివజ్యోతి నామినేట్ అయిన క్షణం నుంచే ఆమెకు మద్దతుగా నిలిచింది. ఓట్లు వేయమని కోరుతూ వస్తోంది.
అయితే ఇప్పటి వరకు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం వితికా డేంజర్ జోన్‌లో ఉంది. గత కొన్ని వారాలుగా నామినేషన్‌లోకి రాకుండా ఉన్న వితికా, శివజ్యోతి ఎట్టకేలకు వచ్చేశారు. తమ నిర్ణయానికి విరుద్దంగా అలీని రీఎంట్రీలో తీసుకొచ్చారని కొందరు ఆగ్రహంతో ఉండటంతో అతనికి సైతం ఓటింగ్‌లో తేడా కొడుతోంది. ఈ ముగ్గురే కొంచెం తక్కువలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఒక్క రోజు గడువు ఉండటంతో అందరూ తమ అభిమాన కంటెస్టెంట్లకు ఓట్లు గుద్దుతున్నారు.


Click it and Unblock the Notifications











