బాబా భాస్కర్ కన్నింగ్.. శ్రీముఖి చీప్ ట్రిక్కులు.. బండారం బయటపెట్టిన హిమజ

బిగ్ బాస్ హౌస్ అనేదే విచిత్రమైనది. అక్కడ అవసరాల కోసం కొన్ని బంధాలు ఏర్పడుతాయి. మరి కొన్ని నిజమైన అనుబంధాలుగా మారుతాయి. అయితే ఎవరి ఆట వారిదే. కొన్ని సార్లు పక్కవారి ఆలోచనలు, మారే పరిస్థితులకు తగ్గట్టుగా ఆట ఆడే విధానాలు మార్చుకుంటారు. బయట జరిగే విషయాలు లోపల ఉన్న వారికి తెలీదు. ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన కంటెస్టెంట్లకు అప్పుడు తత్త్వం బోధపడుతుంది. అసలు ఇంతవరకు లోపల ఏం జరిగిందన్నది. అయితే చూసే ప్రేక్షకుడికి హౌస్లో జరిగే ప్రతి సంఘటనను చూపించలేరు. తాజాగా ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన హిమజ.. సంచలన నిజాలను బయటపెట్టింది.

రాహుల్ విషయంలో శ్రీముఖి భయపడింది..

రాహుల్ విషయంలో శ్రీముఖి భయపడింది..

ప్రతీ సీజన్ నామినేట్ చేస్తానని చెప్పిన శ్రీముఖి.. మధ్యలో వెనక్కి తగ్గింది. అయితే నామినేషన్లోకి వెళ్లిన ప్రతీసారి వెనక్కి రావడంతో బాబా భాస్కర్.. శ్రీముఖికి సలహా ఇచ్చాడు. మీ ఇద్దరి మధ్య ఉన్న శత్రుత్వం.. రాహుల్‌కు సింపతీ ఓట్లుగా మారుతున్నాయి. అందుకు ఎన్నిసార్లు నామినేట్ చేసిన సేవ్ అవుతూనే ఉన్నాడు. ఇలా ప్రతీసారి నామినేట్ చేయడం నీకే బ్యాడ్ అవుతుందని సలహా ఇవ్వడం.. రాహుల్ సేవ్ అవుతూ రావడం.. ఇలా అన్నీ ఆలోచించుకున్న శ్రీముఖి.. రాహుల్ విషయంలో వెనక్కి తగ్గిందని హిమజ తెలిపింది.

బాబా భాస్కర్ కాదు.. మాస్కర్

బాబా భాస్కర్ కాదు.. మాస్కర్

బిగ్ బాస్ హౌస్‌లో అందరి కంటే కన్నింగ్ బాబా భాస్కరేనట. బాబా.. ఓ సారి కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లి వచ్చాడట. అయితే ఏం జరిగిందని అడిగితే.. తాను మధ్యలోనే వెళ్లిపోతానని, తనకు ఏవో ప్రాజెక్ట్లు వచ్చాయని ఓ గేమ్ ప్లాన్ చేసినట్టు హిమజ పేర్కొంది. టైమ్ వచ్చినప్పుడు ఆయనే వెళ్లిపోతాడు కదా.. అని హౌస్‌లో అతన్ని ఎవరూ టార్గెట్ చేసేవారు కాదని చెప్పింది. అయితే నామినేషన్ విషయంలో మా అందరికీ సలహాలు ఇచ్చే బాబా.. తనను అలీ ఒక్కసారి నామినేట్ చేస్తేనే తట్టుకోలేకపోయాడు.

బయటకు వచ్చిన హిమజ..

బయటకు వచ్చిన హిమజ..

సోషల్ మీడియా ద్వారా కొన్ని నిజాలను బయటపెట్టింది. శ్రీముఖికి బిగ్‌బాస్ డైరెక్షన్ టీమ్‌లో అభిషేక్, శ్యామ్ అనే స్నేహితులున్నారని, శ్రీముఖి అప్పుడప్పుడు కెమెరాల ముందుకు వెళ్లి అభిప్రాయాలను చెప్పేదని తెలిపింది. శ్రీముఖి ఇంట్లో చీప్ ట్రిక్కులు ప్లే చేసేందని హిమజ పేర్కొన్నారు.

శ్రీముఖి తీరు నచ్చలేదని

శ్రీముఖి తీరు నచ్చలేదని

బిగ్‌బాస్ హౌస్‌లో స్నేహానికి విలువ ఇవ్వను. ఎవరో ఒక్కరే గెలుస్తారు. మిగిలిన వారందరూ వెళ్లాల్సిందేకదా అని చెప్పే శ్రీముఖి.. బాబా భాస్కర్ తనకు ఓటు వేయకపోయేసరికి తెగ బాధపడిపోవడం తనకు నచ్చలేదని తెలిపింది. ఇక ఈ షో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి. అలీ రీఎంట్రీతో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి అని హిమజ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X