బాబా భాస్కర్ తెలిసే చేస్తున్నాడా.. అలా అనడం మైనస్ అవుతుందా..?

బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లతో పాటు ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు బాబా భాస్కర్. అయితే ఈయన చేసే అల్లరి ఒక్కోసారి హద్దులు దాటుతూ ఉంటుంది. ప్రతీ విషయాన్ని కామెడీ చేసేస్తూ ఉంటాడు. అయితే సరదాగానే చేసే కామెంట్లు అయినా.. అది కావాలనే అన్నట్లు కనిపిస్తూ ఉంటుంది.

నామినేషన్ గురించి, ఎలిమినేషన్ గురించి మాట్లాడుతూ.. పదో వారంలో నువ్వు.. పన్నెండో వారంలో అతడు.. చివర్లో ఆమె అంటూ అందరి గురించి లెక్కలేసి చెబుతూ ఉంటాడు. హోస్ట్ తో కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. నాగార్జున ఎంత సీరియస్ గా చెబుతున్నా.. వాటిని సైతం కామెడీ చేసేస్తుంటాడు. అందుకే బాబా భాస్కర్ కాదు.. బాబా మాస్కర్ అని నాగ్ అంటూ ఉంటాడు. ఒకరి దగ్గర ఒకలా.. మరొకరి దగ్గర ఇంకోలా మాట్లాడుతున్నాడని గత వీకెండ్లో వీడియో ప్లే చేసి చూపించాడు. అప్పటి నుంచి బాబా వ్యవహారంపై ఇంటి సభ్యులు కూడా ఓ కన్నేసినట్టు కనిపిస్తోంది. ఈ వారంలో బాబా భాస్కర్ గురించి ఎక్కువగా గుసగుసలు పెట్టుకున్నారు.

Bigg Boss 3 Telugu Is Baba Bhaskar Playing Smart Game

అయితే ఈ మధ్య బాబా భాస్కర్ ఓ మాటను పదేపదే వాడేస్తున్నాడు. నా ఫ్యాన్స్ చూస్తున్నారు, నా ఫ్యాన్స్ ఉన్నారు.. మిమ్మల్ని చూసుకుంటారు.. ప్రతీసారి ఫ్యాన్స్ గురించి చెబుతూ ఉన్నాడు. అయితే ఇది కామెడీగానే కనిపిస్తున్నా.. ప్రతీసారి ఇలానే అనడం వెనక కూడా ఓ స్ట్రాటజీ ఉందేమోనని నెటిజన్లు అంటున్నారు.

మొన్నటి టాస్క్లో గెలిచాక.. ఈ నా విజయం నా ఫ్యాన్స్కు అంకితం అని చెప్పడం.. దానిపై మిగతా హౌస్మేట్స్ చర్చించడం అందరం చూశాం. అక్కడి డిస్కషన్లో అలీ రెజా ఓ విషయాన్న బయటపెట్టాడు. అక్కడి నుంచి నేను.. ఇక్కడ గెలిచి చూపిస్తా అని బాబా అన్నట్లు చెప్పాడు.

ఇదంతా బాబా కామెడీగానే బయటకి చెప్పినట్లు ఉన్నా.. లోపల మాత్రం పక్కా ప్లాన్ ఉందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. నిన్నటి టాస్క్లో బాబాను తోయడం కరెక్టా కాదా? అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. మరి హోస్ట్ నాగార్జున వచ్చి ఈ విషయాన్ని తేల్చుతాడు లేక నాన్చుతాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X