శ్రీముఖి బ్రేకప్.. నెటిజన్ల ఆరా.. అతనే అంటూ కామెంట్లు
డార్క్ సీక్రెట్ అంటూ హౌస్మేట్స్ గుట్టు విప్పాడు బిగ్‌బాస్. హౌస్ నుంచి పరిశుద్దమైన వ్యక్తిగా బయటకు వెళ్లండి.. మీ జీవితంలో ఉన్న రహస్యాలను పంచుకోండి అంటూ ఇచ్చిన డార్క్ సీక్రెట్ అనే టాస్క్ సోషల్ మీడియాలో పెద్ద రచ్చగా మారింది.

వరుణ్ గోవా ట్రిప్...
సినిమాటిక్‌గా మారిన వరుణ్ సందేశ్ గోవా ట్రిప్. తన గర్ల్ ఫ్రెండ్‌తో గోవాకు వెళ్లానని, అక్కడి బీచ్‌లో తన ఫ్రెండ్‌ను ఏడ్పించారని, అది చివరకు పెద్ద గొడవలా మారిందని, అందర్నీ చితక్కొట్టాని తన లైఫ్‌లోని సీక్రెట్ చెప్పుకొచ్చాడు. అదంతా బాగానే ఉన్నా.. ఆపై శివజ్యోతి ఆరా తీయడం.. వరుణ్‌కు ముగ్గురు హీరోయిన్లతో ఎఫైర్ ఉందంటూ రాహుల్‌తో చెప్పడం హైలెట్‌గా నిలిచింది.

సెలబ్రెటీతో బ్రేకప్
ఇంతవరకు తన లైఫ్‌లోని ఈ సంఘటనను ఎవరితోనూ పంచుకోలేదని, తానూ ఓ రిలేషన్ షిప్‌లో ఉండేదాన్ని అని.. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండు బాగానే సాగుతున్నాయని అనుకున్నాను.. అకస్మాత్తుగా బ్రేకప్ మెసెజ్ వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ వార్త విన్నాక మెకప్ రూమ్‌లోకి వెళ్లి ఏడుస్తూనే ఉన్నానని.. చచ్చిపోవాలనుకున్నానంటూ తెలిపింది. అయితే అతను కూడా సెలెబ్రెటీనే అంటూ.. పేరు చెప్పి మళ్లీ కొత్త న్యూస్‌ను సృష్టించదలచుకోలేదంటూ వివరించింది.

నెటిజన్ల ఆరా...
అయితే నెటిజన్లు ఊరుకుంటారా? శ్రీముఖి బ్రేకప్ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది. ఎక్కడ చూసినా శ్రీముఖి బ్రేకప్‌కి సంబందించిన వార్తలే కనపడుతున్నాయి. శ్రీముఖితో రిలేషన్‌లో ఉన్నది ఎవరు? ఎందుకు బ్రేకప్ జరిగింది? అంటూ నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

అతడే అంటూ కామెంట్లు..
శ్రీముఖి ప్రేమించింది బుల్లితెరకు సంబంధించిన ఓ వ్యక్తేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రముఖ చానెళ్లలో డైరెక్టర్‌గా పనిచేసిన వ్యక్తినే శ్రీముఖి ప్రేమించిందని, అటుపై బ్రేకప్ కూడా జరిగిందని తెలుస్తోంది.

శివజ్యోతి ఆత్రుత..
శ్రీముఖి తన బ్రేకప్‌కు సంబంధించిన విషయాన్ని బయటపెట్టిన తరువాత శివజ్యోతికి ఆత్రుత పెరిగింది. ఆ వ్యక్తి ఎవరు? అంటూ అడగా సాగింది. మొత్తం పూస గుచ్చినట్టు చెబుతాను అంటూ శ్రీముఖి చెప్పినా.. ఆమెకు ఆత్రం ఆగలేదు. మరి ఆ వ్యక్తి ఎవరా? అన్నది శివజ్యోతి తెలుసుకుందో లేదో.


Click it and Unblock the Notifications











