శ్రీముఖికి మహేష్ కౌంటర్.. పిచ్చి కుక్క అంటూ అరిచిన రాములమ్మ
Recommended Video
బిగ్‌బాస్ హౌస్‌లో ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడా? లేదా వారి మధ్య దూరాన్ని తగ్గించేందుకు టాస్క్‌ను ఇచ్చాడా? అన్నది తెలియడం లేదు. డైలీహంట్ అంటూ బిగ్ బాస్ హౌస్ అప్‌డేట్స్ అని.. ఇంటి సభ్యులు మిగతా కంటెస్టెంట్ల గురించి మాట్లాడుకున్న వీడియోలను ప్లే చేసి చూపించాడు.. దీనిలో భాగంగా వీడియోలో చూపించించిన విషయాలపై క్లారిటీ తెచ్చుకున్న అనంతరం.. వారి మాస్క్‌ను కుండకు అతికించి.. కర్రతో పగలగొట్టాలని తెలిపాడు.

వింత టాస్క్‌ను ఆడించిన బిగ్‌బాస్
ఈ టాస్క్‌లో మొదటా బాబాకు తన గురించి వెనకాల మాట్లాడిన వీడియోలను ప్లే చేసి చూపించాడు. అలీ, రాహుల్ మాట్లాడిని వాటిని చూపించడంతో.. వారితో మాట్లాడిన అనంతరం అలీ మాస్క్‌ను కుండకు అతికించి.. పగలగొట్టాడు. శ్రీముఖికి మహేష్, అలీ, శివజ్యోతిలు మాట్లాడిన మాటలను వినిపించాడు. అవి విన్న శ్రీముఖి నీ అక్కా అనుకుంటూ కోపంగా వెళ్లి అలీ, శివజ్యోతిలతో మ్యాటర్ సెటిల్ చేసుకుంది. అయితే మహేష్ మాట్లాడిని మాటలకు హర్ట్ అయిన శ్రీముఖితో అతనితో డిస్కషన్ పెట్టకుండానే ఆల్ ది బెస్ట్ అని చెప్పి... కుండకు మహేష్ స్టిక్కర్‌ను అతికించి పగలగొట్టేసింది.

పాగల్ కుత్తి అంటూ అరిచిన శ్రీముఖి
శివజ్యోతికి రాహుల్ మాట్లాడిన మాటలను వినిపించాడు. ట్రాలీ టాస్క్‌లో జరిగిన ఘటన గురించి వారిద్దరు మాట్లాడుకున్నారు. అనంతరం రాహుల్ స్టిక్కర్‌ను అతికించి కుండను పగలగొట్టింది. రాహుల్‌కు మహేష్ మాట్లాడిన మాటలను వినిపించాడు. దీంతో మహేష్ స్టిక్కర్‌ను పెట్టి కుండను పగలగొట్టాడు. వితికాకు అలీ మాట్లాడిన మాటలను చూపించాడు. అలీతో మాట్లాడి వాటిపై క్లారిటీ ఇచ్చేసింది. అలీకి శ్రీముఖి మాట్లాడిన వీడియోను చూపించాడు.. అయితే అందరిలా కాకుండా కుండను చేత్తో పగలగొట్టాడు. అలా ఎందకు చేసావ్ పాగల్ కుత్తి అంటూ అలీని అనేసింది.

శ్రీముఖికి కౌంటర్ రియాక్షన్
మహేష్‌కు శ్రీముఖి మాట్లాడిన వీడియోను చూపించగా.. ఆమెతో డిస్కషన్ పెట్టకుండా.. ఆమె చేసిన విధంగానే మహేష్ కూడా కౌంటర్ రియాక్షన్ ఇచ్చాడు. శివజ్యోతితో అలీ మాట్లాడిన వీడియోను వరుణ్‌కు చూపించాడు. దీంతో అలీ స్టిక్కర్ పెట్టి కుండను పగలగొట్టాడు.

బిగ్‌బాస్ పుట్టిన రోజు...
బిగ్‌బాస్ పుట్టినరోజు అని.. ఇంటిసభ్యులకు ఓ టాస్క్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో ఉన్న సామాన్లను పెట్టుకుని పాట ప్లే అయ్యేవరకు డ్యాన్సులు చేయాలని, ఈరోజంతా తనను సంతోషంగా చూసుకోవడం తమ బాధ్యత అని, ఏ టాస్క్ ఇచ్చిన కాదనకూడదని, ఎవరూ ఏడ్వకూడదని తెలిపాడు. దీంతో హౌస్‌మేట్స్ అందరూ మొదట హుషారుగానే ఉన్నారు. అయితే బిగ్‌బాస్ పుట్టిన రోజు కాబట్టి కేక్‌ను పంపాడు. అందరూ మంచిగా లాగించేశారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. మళ్లీ కాసేపటికే మరో కేక్‌ను పంపించాడు. బాగుందంటూ దాన్నీ లాగించేశారు. కానీ మున్ముందు దాంట్లోనే ప్రమాదం పొంచి ఉందని వారు కనిపెట్టలేకపోయారు. ఇలా వరుసబెట్టి కేక్‌లను పంపిస్తూనే ఉన్నట్లు కనిపిస్తోంది. అవి తినలేక హౌస్‌మేట్స్ నానా తంటాలు పడుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











