రాళ్ల కోసం పాకులాట.. ఆడనంటూ ఫైర్.. అది ఇవ్వడానికి ఒప్పకోని పునర్నవి

By Kalyan

Recommended Video

Bigg Boss Telugu Season 3 : Episode 72 Highlights

పదకొండో వారంలోకి బిగ్ బాస్ ఎంటర్ అయింది. ఈ సందర్భంగా హౌస్ మేట్స్ అందరికీ బిగ్ బాస్ కంగ్రాట్స్ తెలిపాడు. అయితే ఇక నుంచి ఈ ఆట రెండో ఫేజ్లోకి వెళ్తుందని హెచ్చరించాడు. బిగ్ బాస్ చెప్పినట్టుగానే జరుగుతోంది. నిన్నటి నామినేషన్ ప్రక్రియలో భాగంగా చేపట్టిన టాస్క్ అదిరిపోయింది.

నామినేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. రాళ్లను సంపాదించాల్సిందే..

నామినేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. రాళ్లను సంపాదించాల్సిందే..

పదకొండో వారంలో నామినేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. ఓ పెద్ద యుద్దామే చేయాల్సి వచ్చింది. రాళ్లే రత్నాలు అనే టాస్క్లో భాగంగా పై నుంచి రాళ్ల వర్షం కురుస్తుందని.. ఆ రాళ్లను దాచుకోవాలని.. వేరే వారి దగ్గరి నుంచి దోచుకోవాల్సి కూడా రావొచ్చని తెలిపాడు. ఈ రాళ్ల విలువ 20, 50, 100, 200 ఉాంటాయని తెలిపాడు. బజర్ మోగేవరకు ఎవరి వద్ద తక్కువ విలువైన రాళ్లు ఉంటాయో వారు నామినేషన్ లోకి వెళ్తారని తెలిపాడు. అయితే ఈ టాస్క్ పూర్తయ్యే వరకు హౌస్లోకి ప్రవేశించడానికి వీల్లేదని తెలిపాడు.

రాళ్ల కోసం తోపులాట.. దాచుకోడానికి పాకులాట

రాళ్ల కోసం తోపులాట.. దాచుకోడానికి పాకులాట

అయితే బిగ్ బాస్ హౌస్లో కురిసిన రాళ్ల వర్షంతో హౌస్ మేట్స్ మధ్య తోపులాట కూడా జరిగింది. అయితే మొదటి సారి కురిసిన రాళ్ల వర్షంలో.. రాహుల్ కాస్త ఆలస్యంగా చేరడంతో.. అతనికి రాళ్లు దొరకలేదు. మిగతావారి దగ్గరి నుంచి లాక్కుందామని ప్రయత్నించినా అది కుదరలేదు. శివజ్యోతి, పునర్నవి దగ్గర ప్రయత్నించి విఫలమయ్యాడు. మహేష్ దగ్గరి నుంచి ఓ రాయిని తీసుకోగా.. అతను ఫైర్ అయ్యాడు.

అంతలోనే చల్లారి.. బతిమిలాడుకున్నాడు..

అంతలోనే చల్లారి.. బతిమిలాడుకున్నాడు..

రాళ్లను ఎవరి దగ్గరి నుంచైనా దోచుకోవచ్చనే నిబంధన ఉండగా.. మహేష్ వద్ద నుంచి చాకచక్యంగా లాక్కున్నాడు. అయితే మహేష్ మాత్రం తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. సంచాలకులైన శ్రీముఖి ఎంత వారించిన వినలేదు. టాస్క్ ఆడనంటూ.. తన వద్ద ఉన్న రాళ్లను పడేశాడు. మిగిలిన వాటిని కూడా తీసుకోండని చెప్పగా.. పునర్నవికి రెండు వందల విలువ గల రాయిని ఇచ్చేశాడు. అయితే కోపం తగ్గాక.. ఆలోచించుకున్న మహేష్ అందర్నీ తిరిగి ఇవ్వమని కోరాడు. పునర్నవి మినహా మిగతా అందరూ తిరిగివ్వడానికి ఒప్పుకున్నారు. ఆమెను ఎంత బతిమిలాడుకున్నా.. తిరిగి ఇవ్వడానికి ససేమిరా అంది.

తక్కువ రాళ్లలో రాహుల్ నామినేషన్లోకి..

తక్కువ రాళ్లలో రాహుల్ నామినేషన్లోకి..

ఫస్ట్ బజర్ మోగేసరికి అందరి వద్ద ఉన్న రాళ్ల విలువను శ్రీముఖి లెక్కించసాగింది. అయితే రాహుల్ కు తక్కువగా ఉండటంతో నామినేషన్లోకి వెళ్లాడు. నామినేట్ అయిన ఇంటి సభ్యుడు హౌస్ లోపలికి వెళ్లేందుకు అనుమతి లభిస్తుంది. అయితే మిగతా వారంతా బయటే వండుకోడం, పండుకోవడం చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ అమ్మే నిత్యావసర సరుకులను కొనాల్సి ఉంటుంది. వాటితో వారు వంట వండుకోవాలి. దీనిలో భాగంగా ఉప్పు ఐదు వేలు, ఉల్లి గడ్డ 500, పసుపు వెయ్యి రూపాయలని తెలిపాడు. దీంతో హౌస్ మేట్స్ ఖంగుతిన్నారు. ఇక నేటి ఎపిసోడ్ లో ఈ టాస్క్ లో మరిన్ని గొడవలు జరిగేలా కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X