మహేష్ విట్టాను అంత దారుణంగా పంపిస్తారా? శ్రీముఖిపై బిగ్ బాంబ్..

Recommended Video

Bigg Boss Telugu 3 : Episode 85 Highlights || శ్రీముఖిపై బిగ్ బాంబ్

బిగ్‌బాస్ చివరి అంకానికి చేరుకొన్న సమయంలో మరో ఎలిమినేషన్ జరిగింది. పన్నెండో వారానికి గానూ వరుణ్, మహేష్ నామినేషన్ అయిన సంగతి తెలిసిందే. ట్రాలీ టాస్క్‌లో భాగంగా సరైన చోట పార్కింగ్ చేయలేక నలుగురు నామినేట్ కాగా.. మెడాలియన్ ఉండటం వల్ల వితికా ఎలిమినేషన్‌లోంచి బయటపడగా.. మహేష్ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.అయితే మహేష్ నుంచి ఇంటి నుంచి వెళ్తుంటే కనీసం ఎవరూ కూడా పెద్దగా స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. సండే ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

తనను టార్గెట్ చేస్తున్నారని ఎమోషనల్ అయిన బాబా

తనను టార్గెట్ చేస్తున్నారని ఎమోషనల్ అయిన బాబా

అన్ని టాస్క్‌ల్లో తననే టార్గెట్ చేస్తున్నారని, ఊసరవెళ్లి, జోకర్ అని తనకే ఇస్తున్నారని, తాను అంతగా సీరియస్‌గా తీసుకోనని అందుకోసమే తనకు అలా ఇస్తున్నారంటూ బాబా తెగ ఫీలయ్యారు. ఇదే విషయాన్ని నాగ్ వద్ద ప్రస్థావించి.. తాను కేవలం టాస్క్‌లు ఆడటానికే వచ్చానని, స్ట్రాటజీలు తెలీవని, టైటిల్ గెలవాలని తనకు లేదంటూ కంటతడిపెట్టాడు.

బొమ్మలు గీసే టాస్క్...

బొమ్మలు గీసే టాస్క్...


హౌస్‌మేట్స్ చేత నాగార్జున ఓ ఆట ఆడించాడు. ఇంటి సభ్యులను రెండు టీమ్ మేట్స్‌గా విడగొట్టిన నాగార్జున.. వారితో మంచి ఎంటర్టైన్ క్రియేట్ అయ్యేలా చేశాడు. ఒక టీమ్‌లోని మెంబర్.. వారికిచ్చిన మూవీ టైటిల్‌కి సంబంధించి.. బొమ్మను గీసి.. గుర్తుపట్టేలా చేయాలని తెలిపాడు. ఈ టాస్క్‌లో శ్రీముఖి టీమ్ చురుకుగా వ్యవహరించి.. టీమ్ మేట్స్ గీసిన బొమ్మలను గుర్తించింది.

బొమ్మలను గీయడంలో వెనుకబడిన మహేష్ టీమ్..

బొమ్మలను గీయడంలో వెనుకబడిన మహేష్ టీమ్..

ఎఫ్2, బలుపు, సరైనోడులాంటి సినిమా పేర్లను ఇంటి సభ్యులకు నాగార్జున ఇవ్వగా.. వారంతా చాలా కష్టపడి గీసారు. దీంట్లో వితికాకు ఎఫ్2 చిత్రం రాగా.. ఆమె గీసిన చిత్రాన్ని వారు గుర్తించలేకపోయారు. శివజ్యోతికి వచ్చిన అన్నయ్య టైటిల్‌కు సంబంధించి గీసిన బొమ్మను ఎవ్వరూ గుర్తుపట్టలేకపోయారు. మహేష్‌కు వచ్చిన నాన్నకు ప్రేమతో టైటిల్‌ను సైతం ఎవ్వరూ గుర్తు పట్టలేకపోయారు. ఈ టాస్క్‌లో చురుకుగా వ్యవహరించిన శ్రీముఖి టీమ్ గెలిచినట్లు నాగ్ ప్రకటించాడు.

మహేష్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించిన నాగ్...

మహేష్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించిన నాగ్...

అనుకున్నట్లే.. ప్రచారం జరిగినట్లే.. పన్నెండో వారంలో మహేష్ ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. మహేష్ బయటకు వచ్చే సమయంలో బాబా భాస్కర్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. బయటకు వచ్చిన మహేష్‌కు బిగ్ బాస్ జర్నీకి సంబంధించి వీడియోను చూపించాడు. అనంతరం మహేష్‌కు ఓ టాస్క్ ఇచ్చాడు. తాను నెం. 1 అనుకునే కంటెస్టెంట్లను బొమ్మలను మినహా.. మిగిలిన వారి కంటెస్టెంట్ల పోస్టర్‌లను చించేయాలని తెలిపాడు. దీంతో బాబా భాస్కర్ పోస్టర్ మినహా.. మిగతా హౌస్‌మేట్స్ అందరి పోస్టర్‌లను చించేశాడు.

శ్రీముఖిపై బిగ్ బాంబ్..

శ్రీముఖిపై బిగ్ బాంబ్..

కిచెన్ హౌస్‌లో ఉండే బోళ్లలన్నింటిని కడగాలనే బిగ్ బాంబ్‌ను మహేష్.. శ్రీముఖిపై వేశాడు. బాబా భాస్కర్ చేత అన్ని పనులు చేయిస్తూ ఉంటుందని.. ఆ విషయం తనకు నచ్చదని.. అందుకే ఈ బిగ్‌బాంబ్ తనపై వేస్తున్నట్లు తెలిపాడు. ఇక పదమూడో వారంలో నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో.. నామినేషన్‌లోకి ఎవరు వస్తారో.. ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

మహేష్ విట్టా బయటకు వెళ్తే

మహేష్ విట్టా బయటకు వెళ్తే

బిగ్‌బాస్ హౌస్‌లో మహేష్ విట్టా ప్రయాణం దాదాపు 10 వారాలు సాగింది. ఇంటి సభ్యులతో మంచి అనుబంధాన్ని ఏర్పరుచుకొన్నాడు. కొన్నిసార్లు వివాదాస్పదంగా వ్యవహరించిన ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌గా మారాడు. బాబాకు అనుచరుడిగా మారిన మహేష్ చివరి అంకంలో ఎలిమినేట్ అయ్యారు. అయితే మహేష్ విట్టా బయటకు వెళ్తుంటే ఎవరి ముఖంలో సానుభూతి, ప్రేమ కనపించకపోవడం చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X