రాయలసీమ బిడ్డకు అన్యాయం జరగుతోంది.. ఆ ముగ్గురిలో ఒకరిని పంపించేయాలి..
బిగ్ బాస్ షోలో ప్రతీవారం ఒకరు ఇంటి బాట పట్టేందుకు సిద్దంగా ఉండాల్సిందే. అయితే ఒక్కోసారి సడెన్ సర్ ప్రైజ్లు ఉంటాయి.. డబుల్ ఎలిమినేషన్స్ ఉండొచ్చు.. ఇంకోసారి అసలు ఎలిమినేషన్ అనేది ఉండకపోవచ్చు. అయితే నామినేషన్, ఎలిమినేషన్ అనేది అక్కడ నిరంతర ప్రక్రియ అన్నది అందులో ఉన్న హౌస్ మేట్స్ అందరికీ తెలిసిందే.

పదకొండో వారంలో ఎంట్రీ ఇచ్చిన షో..
బిగ్ బాస్ మూడో సీజన్ పదకొండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికీ ఏడు ఎలిమినేషన్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఒక రీఎంట్రీ జరిగిపోయింది. ఇక సీజన్ ముగియడానికి దగ్గర పడుతుండటంతో షో కూడా రసవత్తరంగా మారుతోంది. నామినేషన్ ప్రక్రియలో ఇచ్చిన టాస్కే ఇందుకు నిదర్శనం. రాళ్లే రత్నాలు అంటూ ఇంటి సభ్యులకు చుక్కలు చూపించాడు.

టాస్క్ పేరిట.. హౌస్ మేట్స్ ను ఆట ఆడుకున్న బిగ్ బాస్
రాళ్లే రత్నాలు అనే టాస్క్ పూర్తయ్యే వరకు ఇంటిలోపలికి ఎంట్రీ లేదనే కండీషన్ పెట్టాడు బిగ్ బాస్. కెప్టెన్ అయిన శ్రీముఖి మాత్రమే ఇంట్లోకి వెళ్తుందని, అన్ని సౌకర్యాలను వాడుకుంటుందని తెలిపాడు. నామినేషన్ లోకి వచ్చిన వారు.. ఇంటిలోపలికి ప్రవేశించవచ్చని తెలిపాడు. ఇక వండు కోవడానికి కావాల్సిన ఉప్పు, ఉల్లిగడ్డ లాంటివి కూడా బిగ్ బాస్ వద్ద కొనుక్కోవాలని తెలిపాడు. దీంతో హౌస్ మేట్స్ సరైన తిండి, గార్డెన్ ఏరియాలోనే ఉండి.. ఆ చలికి పడుకోలేక నానా అవస్థలు పడ్డారు.

నామినేట్ అయిన ఆ నలుగురు
ఈసారి నామినేషన్ లోకి వరుణ్ బ్యాచ్ వచ్చేసింది. అయితే వరుణ్, రాహుల్, పునర్నవి నామినేషన్ లో ఉండే సరికి ఓట్లుచీలిపోతాయని అంటున్నారు. ప్రతీసారి ఎవరో ఒక్కరే నామినేట్ అవ్వడం.. నలుగురు ఫాలోవర్స్ కలిసి ఓట్లు వేయడంతో ఈజీగా సేవ్ అవుతుూ వచ్చారు. ఆ ముగ్గురికి సమాన ఓట్లు వేయాలని.. అప్పుడు మహేష్ డేంజర్ జోన్ లోకి వెళ్లి.. వాళ్లు సేవ్ అవుతారని వీవీపీఆర్ బ్యాచ్ ఫాలోవర్స్ కామెంట్లు పెడుతున్నారు.
Recommended Video

రాయలసీమ బిడ్డకు అన్యాయం..
ఇలా ఆ ముగ్గురి ఫ్యాన్స్.. మహేష్ కు అన్యాయం చేస్తున్నారని..మన రాయలసీమ బిడ్డను కాపాడుకోవాలంటూ మహేష్ ఫ్యాన్స్ పిలుపునిస్తున్నారు. మరి నిజంగానే ఆ ముగ్గురి ఫాలోవర్స్ ఇదే స్ట్రాటజీ గనుక ఫాలో అయితే.. మహేష్ ఈ వారం ఎలిమినేట్ అవ్వడం ఖాయమనిపిస్తోంది. మరి చివరి వరకు ఏం జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











