అదిరిపోయే సీక్రెట్ లీక్.. మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చేది ఆ సమయానికే.. అటుపై విన్నర్‌ను ప్రకటించడమే

బిగ్‌బాస్ షో ముగిసేందుకు సమయం వచ్చింది. ఎంతో అట్టహాసంగా మొదలైన ఈ సీజన్ అంతే గ్రాండ్‌గా ముగియనుంది. ఈ ఫినాలె ఎపిసోడ్ ఎంతో కలర్‌ఫుల్‌గా ఉండబోతోన్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో అందరం చూస్తూనే ఉన్నాం. నిధి అదిరిపోయే అందాలు, రాశీ ఖన్నా, మారుతి, శ్రీకాంత్, అంజలి లాంటి తారాగణాల ఎంట్రీతో ఫినాలే స్టేజ్ దద్దరిల్లబోతోంది. బిగ్‌బాస్ కంటెస్టెంట్లందరూ ఫినాలే వేదికపై స్టెప్పులేసి అందర్నీ అలరించేందుకు సిద్దమయ్యారు.

 వెంటాడుతున్న లీకులు..

వెంటాడుతున్న లీకులు..

లీకులు ఎలాగూ బిగ్‌బాస్ షోను వదలడం లేదు.. కార్యక్రమం ప్రారంభం అయినప్పటి నుంచీ మొదలైన ఈ పర్వం నేటికి కొనసాగుతూనే ఉంది. కనీసం ఫినాలె ఎపిసోడ్‌ను అయినా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. కానీ ఈ ఈవెంట్‌కు సంబంధించిన ప్రతీ అప్‌డేట్ సోషల్ మీడియాలో లీకవుతూనే ఉంది. నిధి అగర్వాల్, రాశీ ఖన్నా, అంజలి లాంటి సెలెబ్రిటీలు ఎంట్రీ ఇస్తారని, వారు ఆటపాటలతో అందర్నీ ఎంటర్టైన్ చేస్తారని, వారి చేతే ఎలిమినేషన్ ప్రక్రియను కూడా ముందుకు తీసుకెళ్తారని లీకైంది.

రాహుల్ విన్నర్ అని ప్రచారం..

రాహుల్ విన్నర్ అని ప్రచారం..

ఇంతవరకు ఎలిమినేషన్ విషయమై లీకులు వస్తే.. ఈ సారి మాత్రం రాహుల్ టైటిల్ గెలిచేసాడనే వార్త బయటకు వచ్చింది. శనివారం రాత్రి నుంచే రాహుల్ విన్నర్ అంటూ సోషల్ మీడియా ట్రెండ్ అయింది. పైగా గూగుల్ కూడా ఫిక్స్ చేసేసేంది అంటూ హల్ చల్ అయింది. రాహుల్ విన్నర్ అని అందరూ అనుకుంటోన్న వేళ మరో షాక్ ఇచ్చాడు హోస్ట్ నాగార్జున. అవేవీ నమ్మొద్దు విజేత ఎవరన్నది లైవ్ టెలికాస్ట్ అవుతుందనే బాంబ్ వేశాడు.

అదిరిపోయే సీక్రెట్ లీక్

అదిరిపోయే సీక్రెట్ లీక్

అయితే తాజగా మరో ఇంట్రెస్టింగ్ సీక్రెట్ బయటకు వచ్చేసంది. అదే విజేత ఎవరని, ఎప్పుడు ప్రకటిస్తారని, ఎవరి చేతుల మీదుగా ప్రకటిస్తారని వార్తలు బయటక వచ్చేశాయి. దీనికి సంబంధించిన ఓ లీక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విన్నర్ ఎవరన్నది లైవ్ టెలికాస్ట్‌లో జరుగుతుందుని ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.. దానికి సంబంధించిన షూటింగ్ జరిగే సమయం, విన్నర్‌ను ప్రకటించే గెస్ట్ ఎవరన్నది తెలిసిపోయింది.

ఏడు గంటల నుంచి లైవ్ షూటింగ్..

ఏడు గంటల నుంచి లైవ్ షూటింగ్..

ఈ సాయంత్రం ఆరు గంటల నుంచి ఫినాలె ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుండగా.. ఏడు గంటలకు లైవ్ టెలికాస్ట్‌కు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్‌లో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చి విజేత ఎవరన్నది ప్రకటించనున్నట్లు సమాచారం. మరి ఇప్పటి వరకు వినిపిస్తున్న టాక్ ప్రకారం రాహుల్ విన్నర్‌గా నిలిచాడా? లేదా? అన్నది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X