శ్రీముఖి చేతికి గాయం, బాబాపై అరిచిన అలీ, ఆడవారి టీమ్ కే నాగ్ సపోర్ట్..
Recommended Video
దసరా రోజున ఇంటి సభ్యుల చేత రకరకాల వంటలు చేయించాడు. బిగ్ బాస్ ఇచ్చే మూడు ఆర్డర్లను ఇంటి సభ్యులు చేయాల్సి ఉంటుందని, ఈ టాస్క్లో హౌస్మేట్స్ ను రెండు టీమ్స్ గా విడగొట్టారు. శ్రీముఖి, శివజ్యోతి, వితికా, రాహుల్ ఒక టీమ్ కాగా.. బాబా, వరుణ్, మహేష్, అలీ మరో టీమ్ మేట్స్. ఈ రెండు టీమ్స్లో వితికా, వరుణ్ క్వాలిటీ మేనేజర్ గా వ్యవహరించాలని వారు చేసిన వంటకాలను రుచి చూసి ఫలితాన్ని చెప్పాలని తెలిపాడు. మూడో ఆర్డర్ ఫలితాన్ని ఓ అతిథి వచ్చి నిర్ణయిస్తాడని తెలిపాడు.
రెండు చైనీస్ వంటకాలన చేయాల్సిందిగా.. తన మొదటి ఆర్డర్ ను బిగ్ బాస్ ఇచ్చాడు. అయితే ఇవి రెండూ ఫెయిల్ అయ్యాయని తేల్చేశారు వరుణ్, వితికా. రెండో ఆర్డర్లో భాగంగా ఆంధ్రా వంటకాలను చేయాలని తెలిపాడు. దీంతో బాబా భాస్కర్ టీమ్ చాపల పులుసు, ఫ్రైచేయగా.. శ్రీముఖి టీమ్ రొయ్యల కూర చేశారు. ఇవి రెండూ బాగున్నాయని తెలిపారు. ఇక మూడో ఆర్డర్గా తీపి పదార్థాలను చేయాలని చివరి ఆర్డర్ ఇచ్చాడు.

రెండింటిలో సరిసమానంగా...
బిగ్ బాస్ ఇచ్చిన మొదటి, రెండో ఆర్డర్ ఇరు వర్గాలకు చెరి సమాన పాయింట్స్ వచ్చాయి. మొదటి ఆర్డర్ లో ఇద్దరూ ఫెయిల్ అయినట్లు క్వాలిటీ మేనేజర్స్ అయిన వితికా, వరుణ్ సందేశ్లు పేర్కొన్నారు. అయితే రెండో ఆర్డర్లో ఆంధ్ర వంటకాల్లో బాబా, శ్రీముఖి టీమ్ బాగా చేశాయని, బాబా అంత బాగా చేస్తాడని ఊహించలేదని చెబుతూ.. లొట్టలేసుకుని మరి వితికా చేపల పులుసును ఆరగించేసింది.

శ్రీముఖి చేతికి గాయం
ఆర్డర్ ఇచ్చిన ప్రతీసారి దానికి సంబంధించిన సామాన్లు స్టోర్ రూమ్లో ఉంటాయని, ఎవరు ముందుగా తీసుకుంటే అవి వారివే అవుతాయని, అయితే క్వాలిటీ మేనేజర్ సంప్రదింపులతో వాటిని ఇచ్చిపుచ్చుకోవచ్చని తెలిపాడు. దీంతో ఆర్డర్ ఇచ్చిన ప్రతీసారి స్టోర్ రూమ్లో తోపులాట జరిగేది. ఈ క్రమంలో మొదటి ఆర్డర్ ఇచ్చిన అనంతరం.. శ్రీముఖి త్వరగా వెళ్లి తొందరగా పూర్తి చేద్దామని ఆత్రుతలో.. చికెన్ కట్ చేసేప్పుడు వేలికి గాయమైంది.

బాబాపై అరిచిన అలీ
మొదటి ఆర్డర్లో భాగంగా బిగ్ బాస్ ఏవైనా రెండు చైనీస్ వంటకాలను చేయాల్సిందిగా తెలిపాడు. దీంతో శ్రీముఖి టీమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ తొందరగా రెడీ చేసేశారు. అయితే వాళ్లది అయిపోయిందంటూ బాబాను అలీ తొందరపెట్టసాగాడు. వారిది అయిపోయిందని మనకేం అవసరమంటూ, ఎందుకు చెబుతున్నావంటూ.. బాబా కూడా రివర్స్ అయ్యారు. ఇలా ఇద్దరూ కొంచెం గొడవ పెట్టుకున్నారు. అనంతరం మళ్లీ కలిసిపోయారు.

ఆడవాళ్లకు సపోర్ట్ చేసిన నాగ్..
మూడో ఆర్డర్లో భాగంగా శ్రీముఖి టీమ్ పరమాన్నం చేయగా.. బాబాభాస్కర్ టీమ్ పాయసం చేసింది. అయితే వీటిని టేస్ట్ చేయడానికి బిగ్ బాస్ హౌస్లోకి నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. నాగ్ ఎంట్రీతో హౌస్మేట్స్ ఆనందంలో మునిగితేలిపోయారు. తనకు పరమాన్నమే బాగా నచ్చిందని ప్రేమతో చేశారు.. బాగుందని మెచ్చుకున్నాడు.దీంతో బాబా కాస్త ఫీల్ అయినట్లు కనిపించింది. అనంతరం హౌస్మేట్స్ అందరికీ స్వీట్స్, గిఫ్ట్స్ ను ఇచ్చాడు. రేపటి ఎపిసోడ్లో కంటెస్టెంట్లతో మంచి ఆటలే ఆడించినట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











