స్టార్ ఆఫ్ ది హౌస్.. వరుణ్, శివజ్యోతిలకు స్పెషల్ గిఫ్ట్

Recommended Video

Bigg Boss Telugu 3 : Episode 81 Highlights || వరుణ్, శివజ్యోతిలకు స్పెషల్ గిఫ్ట్

బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు దసరా సంబరాలను పంచేందుకు కింగ్ నాగార్జున హౌస్‌లోకి వెళ్లాడు. అందరితో ఆటలు ఆడించి ఫన్ క్రియేట్ అయ్యేలా చేశాడు. కంటెస్టెంట్లందరి చేత ఆటలు ఆడించి ఎంటర్‌టైన్ చేశాడు. బిగ్‌బాస్ పాటలు ప్లే చేస్తున్నంతసేపు.. బాక్స్‌ను ఒకరి నుంచి మరొకరి మారుస్తూ ఉండాలని, పాట ఆగినప్పుడు బాక్స్ ఎవరి దగ్గర ఉంటుందో వారు దాంట్లోంచి ఓ చీటీ తీయాలని అందులో ఏం రాసి ఉంటే అది చేయాలని తెలిపాడు. అలా చేసిన వారికి గిఫ్ట్ ఇస్తానని పేర్కొన్నాడు.

 మహేష్‌కు వేసిన మేకప్ చూసి భయపడిన అలీ

మహేష్‌కు వేసిన మేకప్ చూసి భయపడిన అలీ

ఇక ఈ ఆటలో భాగంగా మొదటి పాటగా అలవైకుంఠపురములో పాటను ప్లే చేశాడు.అయితే మొదటగా అలీ వంతు వచ్చింది. కళ్లకు గంతలు కట్టుకుని ఒకరికి మేకప్ వేయాలనే టాస్క్ వచ్చింది. దీంతో మహేష్‌కు మేకప్ వేయనున్నట్లు ఎంచుకున్నాడు. చివరకు తాను వేసిన మేకప్‌ను చూసి అలీ భయపడ్డాడు. రెండో చాన్స్‌లో వరుణ్ వంతు రాగా.. తనవెనకాల ఒకరు ఉండి.. తినిపించాలనే టాస్క్ వచ్చింది. దీంతో శ్రీముఖి సహాయం తీసుకుని పూర్తి చేసేశాడు.

బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టిన శ్రీముఖి..

బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టిన శ్రీముఖి..

పిండిలో ఉన్న కాయిన్స్‌ను నోటితో తీయాలనే టాస్క్ బాబాకు, ఐదు రకాల పచ్చి కూరగాయలను తినాలని శివజ్యోతికి, బెలూన్ గాలిని పీల్చి పాట పాడాలని వితికాకు టాస్క్ వచ్చింది. దీంతో హౌస్‌మేట్స్ అందరూ.. గాలిని పీల్చి పాటలు పాడారు. అందరి కంటే రాహుల్ చేత పాడించిన పాటకు అందరూ పగలబడి నవ్వారు. మహేష్‌కు చీటీలో బెల్లీ డ్యాన్స్ రాగా..అది శ్రీముఖి చేయాల్సిందిగా అందరూ కోరారు. దీంతో బెల్లీ డ్యాన్స్‌తో శ్రీముఖి అదరగొట్టింది. వేరే కంటెస్టెంట్‌ను కేక్‌తో కొట్టాలని రాగా.. శివజ్యోతి మొహానికి మెల్లగా కొట్టాడు.

స్టార్ ఆఫ్ ది హౌస్...

స్టార్ ఆఫ్ ది హౌస్...

ఈ ఇంట్లో తమకు నచ్చిన కంటెస్టెంట్‌కు స్టార్ ఇవ్వాలని, అలా ఎవరికి ఎక్కువగా వస్తాయో వారే ఈ ఇంటికి స్టార్ అంటూ తెలిపాడు. అలా స్టార్ అయిన వారికి ప్రత్యేక బహుమతిని ఇస్తానని తెలిపాడు. దీంతో అలీ, మహేష్‌లు శివజ్యోతికి.. రాహుల్, వితికాలు వరుణ్ సందేశ్‌కు స్టార్‌ను ఇచ్చారు. బాబా, శ్రీముఖి ఒకరికొకరు ఇచ్చుకున్నారు. శివజ్యోతి అలీకి, వరుణ్.. వితికాకు ఇచ్చాడు. దీంతో రెండు స్టార్లతో వరుణ్, శివజ్యోతిలు టాప్‌లో నిలవగా..వారిద్దరికి ఈ వారం అంతా ఇష్టమున్న ఫుడ్‌ను తినొచ్చని తెలిపాడు.

 అందరి విజయగాథలు..

అందరి విజయగాథలు..

విజయ దశమి రోజున మీ జీవితంలో విజయం సాధించిన సంఘటనలు చెప్పమని నాగార్జున తెలపగా.. కంటెస్టెంట్లందరూ తమ తమ జీవితాల్లోని ముఖ్య ఘట్టాలను పంచుకున్నారు. వరుణ్, అలీ, శివజ్యోతిలకు తమ వివాహాం నాటి సంగతులను విజయంగా చెప్పుకొచ్చారు. అందరూ తమను గుర్తు పట్టాలనే ఆశ అంటూ మహేష్, రాహుల్ చెప్పుకొచ్చారు. తనకు వచ్చిన ఫిల్మ్‌ఫేర్ అవార్డును తన తండ్రి తీసుకోవడం విజయంలా అనిపించిందని బాబా తెలిపాడు. తను తెరపై కనబడాలనేది అమ్మ కోరిక అని శ్రీముఖి చెప్పుకొచ్చింది. ఇక్కడి వరకు రావడం తన విజయమని వితికా చెప్పుకొచ్చింది. అనంతరం హౌస్‌మేట్స్ అందరి నుంచి నాగార్జున వీడ్కోలు తీసుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X