రాహుల్,పునర్నవిలది మొరటు సరసం.. వరుణ్ కన్నా బాబా పెద్ద ఫ్రూట్
పదకొండో వీకెండ్లో వచ్చిన నాగార్జున ఇంటి సభ్యలతో కొత్త రకమైన ఆట ఆడించాడు. ఇంటికి బరువు అనే ఓ టాస్క్ ను హౌస్ మేట్స్ తో ఆడించాడు. ఈ టాస్క్లో భాగంగా బరువైన సంచిన స్టోర్ రూమ్ నుంచి శ్రీముఖి తీసుకొచ్చింది. ఒక్కొక్కరుగా వచ్చి.. ఇంటికి బరువు అనుకునే కంటెస్టెంట్ పేరు చెప్పాలని.. అందుకు తగిన కారణాలు చెప్పే వరకు ఆ బరువైన సంచిని మోస్తుండాలని తెలిపాడు. ఈ టాస్క్లో మొదటగా వచ్చిన అలీ.. మహేష్ బిగ్ బాస్ ఇంటికి బరువు అని పేర్కొన్నాడు. టాస్క్ సరిగా ఆడడు, స్టాండ్ తీసుకోడనే కారణాలను తెలిపాడు.

అనంతరం వితికా..
శివజ్యోతిని ఇంటికి బరువని పేర్కొనగా, శివజ్యోతి..వితికాను ఇంటికి బరువంటూ తెలిపింది.
బాబాను తోయడంలో నాగార్జునను పాయింట్ అవుట్ చేశాడు. అదే ఒకవేళ బాబా తోసి ఉంటే రియాక్ట్ అయ్యేదానివా? అంటూ నాగ్ ప్రశ్నించాడు. రియాక్ట్ అయ్యేదాన్నంటూ చెప్పుకొచ్చింది. అయితే శివజ్యోతి మాత్రం బరువును మోయలేకపోయింది. తన బరువును తీసి అలీ చేతిలో పెట్టింది. అలా కుదరదంటూ శివజ్యోతితోనే మోయించాడు. టాస్కుల్లో సరిగా ఆడడు, అది నిర్లక్ష్యమో ఏమో తెలీదంటూ రాహుల్ ను ఇంటికి బరువని.. శ్రీముఖి తెలిపింది. అయితే ఇవే కారణాలతో బాబాకు రాహులే ఇంటికి బరువని పేర్కొన్నాడు. అయితే బాబానుద్దేశించి.. వరుణ్ కంటే బాబా పెద్ద ఫ్రూట్ అయిపోయాడంటూ నాగ్ అన్నాడు. వితికా అలా తోసేస్తే.. ఎలా పడిపోయావంటూ ప్రశ్నించాడు.

మెడల్ గెల్చుకున్న వితికా..
టాస్క్లో సీరియస్ అవుతూ ఉంటాడంటూ మహేష్ ను బిగ్ బాస్ ఇంటికి బరువని వరుణ్, పునర్నవి పేర్కొన్నారు. తనకు శివజ్యోతి తినిపిస్తూ ఉంటే.. కామెంట్ చేశాడని మహేష్ ను బిగ్ బాస్ ఇంటికి బరువని రాహుల్ తెలిపాడు. టాస్క్ ముగిసిన అనంతరం బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్లో గెలిచిన వితికాకు మెడల్ ను ప్రధానం చేశారు. కెప్టెన్ అయిన శ్రీముఖి మెడల్ ను వితికా మెడలో వేసింది. ఆ మెడల్ ను ఒకసారే మాత్రమే నామినేషన్ నుంచి సేవ్ అవ్వడానికి వాడొచ్చని తెలిపాడు.

మొరటు సరసం అన్న నాగ్
అయితే ఇంటికి బరువు అనే టాస్క్ మధ్యలో రాహుల్, పునర్నవిల గురించి నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. వీరిద్దరిది మొరటు సరసం అని అనిపిస్తుందని అన్నాడు. రాహుల్ కు మాత్రమే డెటాల్ విషయంలో ఎందుకు చెప్పావ్? రాహుల్ కు మాత్రమే నరం ఎందుకు చిట్లింది.? రాహుల్ మాత్రమే బాత్రూమ్లో వెళ్లి ఎందుకు ఏడ్చాడంటూ పునర్నవిపై ప్రశ్నల వర్షం కురిపించాడు. మీ ఇద్దరిదీ మొరటు సరసంలా కనిపిస్తుందని అన్నాడు.

సేవ్ అయిన రాహుల్
మెడల్ గెలిచిన వేడుకల్లో భాగంగా బిగ్ బాస్ రుచికరమైన కేక పంపించాడు. అయితే ఆ కేక్ లో రాహుల్ బొమ్మ వచ్చింది. దీంతో రాహుల్ సేవ్ అయినట్లు హౌస్మేట్స్ కు అర్థమైంది. మిగిలిన వారిలోంచి రేపు వరుణ్, పునర్నవి సేవ్ అవుతారు.. మహేష్ ఎలిమినేట్ అవుతారని ఇప్పటికే సోషల్ మీడియాలో లీకులు వైరల్ అవుతున్నాయి. నేటి ఎపిసోడ్లో.. మహేష్ ను బిగ్ బాస్ ఇంటికి బరువుగా పేర్కొన్నారు.దీనికి తగ్గట్టే మహేష్ కూడా ఎలిమినేట్ కాబోతోన్నాడు. మరి రేపటి ఎపిసోడ్లో ఇంటి సభ్యులను ఎలాంటి ఆటలు ఆడిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











