సింగిల్ ఎలిమినేషనా? డబుల్ ఎలిమినేషనా?.. నాగ్ భలే ట్విస్ట్ ఇచ్చాడే
పదమూడో వారంలో ఇంటి సభ్యులందరూ నామినేషన్‌లో ఉండటం.. మిగిలింది ఇంకా రెండు వారాలే కావడంతో.. అందరూ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ఊహించారు. అయితే మరి ఇప్పటి వరకు అందించిన సమాచారం మేరకు వితికా షెరు మాత్రమే ఎలిమినేట్ అయిందని తెలుస్తోంది.
అయితే హౌస్‌లో కూడా కొంతమంది ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? అని శివజ్యోతి రాహుల్‌ను ప్రశ్నించింది కూడా. బయట కొంతమంది ప్రేక్షకులు కూడా ఇదే అనుమానాన్ని వెలిబుచ్చారు. మరి నాగ్ ఈ అనుమానాన్ని మరింత పెద్దది చేశాడు. అయితే గతంలో కూడా ఓసారి ఇలానే ప్రేక్షకులను బురిడీ కొట్టించిన సంగతి తెలిసిందే.

డబుల్ ఎలిమినేషన్ అంటూ రాహుల్‌ను బయటకు పంపిచేసి.. ఫేక్ ఎలిమినేషన్ అని ట్విస్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం కూడా అలాంటిదే ఓ ట్రిక్ ప్లే చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో హౌస్‌మేట్స్‌కు మరో అనుమానాన్ని రేకెత్తించాడు. ఈ వారం సింగిల్ ఎలిమినేషనా? డబుల్ ఎలిమినేషనా? అంటూ అనుమానంగా ప్రశ్నించాడు.
అయితే సోషల్ మీడియా శనివారం సాయంత్రమే దండోరా వేసేసింది. వితిక ఎలిమినేట్ అయినట్లు లీకువీరులు దండోరా వేసేశారు. ప్రతీవారం కొనసాగించినట్లే ఈ వారం కూడా ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరన్నది లీకైపోయింది. మరి నాగ్ లేవనెత్తిన ఈ అనుమానం వెనుక ఉన్న ట్విస్ట్ ఏంటన్నది తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాలి.


Click it and Unblock the Notifications











