మహేష్ ను చూసి ఉలిక్కిపడ్డ అలీ.. బెల్లీ డ్యాన్స్తో ఊపేస్తోన్న శ్రీముఖి
బిగ్‌బాస్ ఇంట్లో నాగార్జున ఎంట్రీతో కొత్త సందడి వచ్చింది. దసరా బుల్లోడు గెటప్ లో నాగ్ ఎంట్రీ అదిరిపోగా.. నేటి ఎపిసోడ్లో ఇంట సభ్యులందర్నీ ఓ ఆట ఆడించనున్నట్లు తెలుస్తోంది. నిన్నటి ఎపిసోడ్లో కష్టపడి వంటకాలు చేసిన హౌస్మేట్స్కు స్వీట్స్, గిఫ్ట్స్ పట్టుకొచ్చాడు నాగ్.
నిన్నటి ఫుడ్ మేళాలో కంటెస్టెంట్లు రెండు గ్రూపులుగా విడిపోయి చాలా కష్ట పడి రకారకాల వంటలు చేశారు. ఈ ప్రాసెస్లో శ్రీముఖి చేతికి గాయం కాగా.. బాబా అలీల మధ్య చిన్న పాటి గొడవైంది. బిగ్ బాస్ ఇచ్చిన మూడు ఆర్డర్లో మొదటిది ఫెయిల్ కాగా, రెండో ఆర్డర్లో రెండు టీమ్స్ పాసయ్యాయి. ఇక మూడో ఆర్డర్కు నాగ్ ఎంట్రీ ఇచ్చి..ఫలితాన్ని తేల్చేశాడు. శ్రీముఖి, వితికా, శివజ్యోతి, రాహుల్ టీమ్ గెలిచినట్లు తెలిపారు.

ఇక నేటి ఎపిసోడ్లో హౌస్ మేట్స్ అందర్నీ ఆటపట్టించినట్లు తెలుస్తోంది. వరుణ్ ఫ్రూట్ అంటూ అతనిచేత అరటిపండును తినిపిస్తున్నారు. మహేష్కు మేకప్ వేసిన అలీ.. అది చూసి భయపడ్డాడు. బాబా చేస్తున్న టాస్క్.. భయానకానికి సీక్వెల్ గా ఉందంటూ పంచ్ వేశాడు. ఐదు రకాల పచ్చి కూరగాయలను తినాలని శివజ్యోతికి టాస్క్ ఇచ్చాడు. బెల్లీ డ్యాన్స్ చేయాలని శ్రీముఖికి చెప్పగా.. తన స్టైల్లో ఓ ఊపు ఊపేసింది. మరి ఇదంతా పూర్తిగా చూడాలంటే.. ఎపిసోడ్ ప్రసారమయ్యేవరకు ఆగాలి.


Click it and Unblock the Notifications











