సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నావ్.. నీకు సపోర్ట్ చేసినవారు తల ఎక్కడ పెట్టుకోవాలంటూ పునర్నవిపై ఫైర్

Recommended Video

Bigg Boss Telugu 3 : Episode 54 Highlights || పునర్నవి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడికి పోయింది?

తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ షో.. ప్రస్థుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తమ అభిమాన కంటెస్టెంట్లకు మద్దతుగా ఆర్మీ లను, మాఫియాలను నడుపుతున్నారు. అయితే ఇది ప్రతిసారి ప్రతిచోటా జరిగే ప్రక్రియే. ఈ సారి మన దగ్గర గతంలో మాదిరి కాకుండా.. కొంచెం తీరు మారింది. ఎవరి గురించి వారు మాత్రమే ప్రచారం చేసుకుంటున్నారు.

సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ తరుపున నడుపుతున్న పేజీలు

సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ తరుపున నడుపుతున్న పేజీలు

వేటికైనా ప్రచారం అవసరం. ఎంత శ్రమపడి చేసినా తగినంత ప్రచారం లేకపోతే అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ప్రచారం అనేది ఏ లెవెల్లో చేసుకోవాలి.. ఎలా చేస్తే మనకు కలిసి వస్తుంది అనేది గత సీజన్లో చూశాం. అయితే రెండో సీజన్ లో మిగతా కంటెస్టెంట్లపై చేసినట్టుగా దుష్ప్రచారం మాత్రం జరగడం లేదు. అధికారికంగా ఉన్న పీఆర్ టీం వారి కంటెస్టెంట్ల తరుపున.. కేవలం వారి గురించే ప్రచారం చేసుకుంటున్నారు. ఏ నేపధ్యంలో శ్రీముఖి, వరుణ్, వితిక, పునర్నవి, రవి, హిమజలకు సోషల్ మీడియా లో భారీ మద్దతు లభిస్తోంది.

రెచ్చిపోతున్న ఫాలోవర్స్..

రెచ్చిపోతున్న ఫాలోవర్స్..

అయితే తమకు ఇష్టమైన కంటెస్టెంట్ల తరుపున మాట్లాడుతు ఉండే నెటిజెన్స్.. ఇతర సభ్యుల గురించి కించపరుస్తూ కామెంట్స్ చేస్తుంటారు. ఏ నేపథ్యంలో సోషల్ మీడియాలో మాటల యుద్ధం నెలకుంటోంది. శ్రీముఖిపై కాస్త నెగెటివ్ ట్రోల్స్ జరుగుతుండగా.. ఎపిసోడ్ను బట్టి మిగతా వారి ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. ఇక వీరిపై వచ్చే మీమ్స్ కు కొదవే లేదు.

బిగ్ బాస్ ను ఎదిరించిన పునర్నవి..

బిగ్ బాస్ ను ఎదిరించిన పునర్నవి..

మొన్నటి దెయ్యాల టాస్క్ లో.. చెత్త పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వారిగా శ్రీముఖి, మహేష్, పునర్నవి లను ప్రకటించాడు. షూ పాలిష్ చేయాలనే పనిష్మెంట్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే షూ పాలిష్ చేయడమేంటి అంటూ మహేష్, పునర్నవి ఎదురు తిరిగారు. శివ జ్యోతి బుజ్జగింపుతో మహేష్ వెనక్కు తగ్గినా.. పునర్నవి మాత్రం లేడీ మోనార్క్ లా ఎవరి మాట వినలేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ పోతది.. నేను ఈ టాస్క్ చెయ్యను.. నన్ను ఎలిమినేట్ చేసినా పర్లేదు అంటూ పెద్ద పెద్ద డైలాగులు కొట్టి బిగ్ బాస్ నే ఎదిరించింది. ఇక దీoతో పునర్నవి వైరల్ అయింది. పునర్నవి ఫాన్స్ కాలర్ ఎగిరేసుకుంటూ.. సెల్ఫ్ రెస్పెక్ట్కు బ్రాండ్ అంబాసిడర్ అంటూ రెచ్చిపోయారు. ఇక మరి కొంతమంది ఆమెకు సపోర్ట్ చేస్తూ ఓట్లు గుద్దారు. కానీ ఒక్క రోజుకే సీన్ రివర్స్ అయింది.

వరుణ్ బుజ్జగింపుతో దిగొచ్చిన పునర్నవి

వరుణ్ బుజ్జగింపుతో దిగొచ్చిన పునర్నవి

మహేష్, శ్రీముఖి తమకు ఇచ్చిన పనిష్మెంట్ ను శ్రద్ధగా పూర్తి చేస్తున్నారు. ఇక పునర్నవిని బుజ్జగించే ప్రయత్నాలు వరుణ్ చేస్తున్నాడు. కనీసం నా గురించి ఏ టాస్క్ చేస్తున్నా అని అనుకో.. అంటూ బతిమిలాడగా చివరకు ఒప్పుకుంది. చకా చక్ పాలిష్ చేసేసింది. బిగ్ బాస్ కు వేలు చూపిస్తూ.. ఇదిగో చేశానంటూ చూపించసాగింది. అనంతరం ఈ టాస్క్ పూర్తయినట్టు బిగ్ బాస్ ప్రకటించాడు.

సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడికి పోయింది.. నీకు కావాల్సిన ఫుటేజ్ దొరికిందిగా..

సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడికి పోయింది.. నీకు కావాల్సిన ఫుటేజ్ దొరికిందిగా..

సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ పెద్ద స్పీచ్ ఇచ్చింది, కావాల్సిన స్క్రీన్ స్పేస్ దొరికింది.. అందుకే మళ్ళీ టాస్క్ ను చేసింది.. ఇప్పుడు ఆమెకు ఓట్స్ వేసిన వాళ్ళ పరిస్ధితి ఏంటి?, బిగ్ బాస్ ను తిడితే ఓట్లు పడతాయని బాగానే పసిగట్టింది అంటూ ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేస్తున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్లో వితిక కెప్టెన్సీ టాస్క్ లో విజేతగా నిలిచి.. కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టింది. ఇక నేటి ఎపిసోడ్లో ఏం జరుగనుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X