అలీరెజా రీఎంట్రీ?.. BringBack ట్రెండింగ్‌తో బిగ్‌బాస్‌లోకి.. ఇది షోనేనా నెటిజన్ల ఫైర్

Recommended Video

Housemates ki surprise twist...Wait and watch!!

బిగ్ బాస్ అనేదే విచిత్రమైన ఆట. అందరూ మన చుట్టూనే ఉంటారు. సరైన సమయానికి వారే ముంచేస్తారు. అందరూ మంచి వారిలానే కనిపిస్తారు. కానీ పరిస్థితులను బిగ్ బాస్ మార్చేస్తుంటారు. నామినేషన్ అంటూ కంటెస్టెంట్ల మధ్య గొడవలు పెడుతూ ఉంటాడు. ఎలిమినేషన్ అయ్యాక మళ్లీ వాళ్లే ఫీల్ అవుతూ ఉంటారు.

 ఇప్పటివరకు ఎనిమిది ఎలిమినేషన్లు..

ఇప్పటివరకు ఎనిమిది ఎలిమినేషన్లు..

ఇంట్లోకి పదిహేను మంది ఎంటర్ కాగా.. మొదటి వారాంతానికి హేమ ఎలిమినేట్ అయింది. వెనువెంటనే.. తమన్నా సింహాద్రిని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తెచ్చాడు. తరువాత వరుసగా జాఫర్, తమన్నా, అషూ, రోహిణి, శిల్పా, అలీ రెజా ఎలిమినేట్ అయ్యారు. ఈ ఎలిమినేషన్‌లో రోహిణి అన్యాయంగానే ఎలిమినేట్ అయిందని కొందరు భావిస్తున్నారు. అలీరెజా ఎలిమినేట్ కాకుండా ఉంటే బాగుండని చాలా మంది భావించారు. కానీ అనూహ్యంగా ఇంటి బాట పట్టాడు.

 అలీరెజా ఎలిమినేషన్‌లో.. ఉప్పొంగిన పాతాళగంగ

అలీరెజా ఎలిమినేషన్‌లో.. ఉప్పొంగిన పాతాళగంగ

అలీరెజా ఎలిమినేషన్‌లో హౌస్ మేట్స్ ఒకింత షాక్ కు గురయ్యారు. ఇక శివజ్యోతి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చావు ఇంటి ఏడుపుల్లా ఏడ్చేసి.. ప్రేక్షకులకు విసుగు పుట్టించింది. శ్రీముఖి సైతం కంటనీరు పెట్టంది. అయితే అలీరెజా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ కాదని చాలా మంది అభిప్రాయం.

అలీని మళ్లీ తీసుకురావాలని సోషల్ మీడియాలో ప్రచారం..

అలీని మళ్లీ తీసుకురావాలని సోషల్ మీడియాలో ప్రచారం..

అలీ ఎలిమినేట్ అయిను మరసటి రోజు నుంచే సోషల్ మీడియాలో మద్దతు తెలిపారు. అలీ రెజా తిరిగి ఇంట్లోకి తీసుకురావాలి, స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను మేము వదులుకోదలచుకోలేదని విస్తృత ప్రచారం చేశారు. బ్రింగ్ బ్యాక్ అలీ రెజా అంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేశారు. అయితే వీరి మొర బిగ్ బాస్ ఆలకించినట్టు కనిపిస్తోంది.

నేటి ఎపిసోడ్లో ప్రత్యక్షమవనున్న అలీ..

నేటి ఎపిసోడ్లో ప్రత్యక్షమవనున్న అలీ..


అసలే టాస్క్ యమా రంజుగా ఉన్న సమయంలో అలీ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే ఇది అతిథిగానా?, పర్మినెంట్‌గానా? అన్నది తెలియాలి. ఎందుకంటే ఎలాంటి ఓటింగ్ ప్రక్రియ చేపట్టకుండా.. ఇలా చేయలేరు. వారి ఇష్టానిగానూ చేస్తే.. చూసే ప్రేక్షకుల పాత్ర లేనట్టు కనిపిస్తుంది.

సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్న నెటిజన్లు

సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్న నెటిజన్లు

అలీ రీ ఎంట్రీనా? అదేలా జరుగుతుంది? ఇష్టమున్న వారిని ఇలా తీసుకొచ్చేయొచ్చా? అంటూ ఇలా పలు రకాలుగా మండిపడుతున్నారు. చూసే ప్రేక్షకులకు ఏం ప్రాముఖ్యత ఇచ్చినట్టు, ఓటింగ్ చేపట్టకుండా అలీని ఎలా తీసుకొస్తారు? అయితే ఎలిమినేట్ చేయడం ఎందుకు? అంటూ ఫైర్ అవుతున్నారు. ఈ మాత్రం దానికి షో పెట్టడం ఎందుకు మీకు నచ్చింది చేసుకోవచ్చు.. మేము ఓట్లు ఎందుకు వేయడం అంటూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే ప్రేక్షకుల ప్రమేయం లేకుండా.. అలీ రీఎంట్రీ ఇచ్చాడంటే.. బిగ్ బాస్ షోకు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X