శ్రీముఖి వ్యాఖ్యలపై కౌంటర్లు.. వాళ్లు చేసిన ట్వీట్‌ను చూపిస్తూ ఏకిపారేస్తోన్న నెటిజన్లు

Recommended Video

Bigg Boss Telugu 3 : Netizens Fires On Sreemukhi PR Team || Filmibeat Telugu

బిగ్‌బాస్ షో ముగిసేందుకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. ఉత్కంఠ పెరిగిపోతూ ఉంది. తమ అభిమాను కంటెస్టెంట్లను గెలిచిపించుకోవడానికి అందరూ శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు ర్యాలీలు, ప్లెక్సీలు కట్టి ప్రచారం చేస్తున్నారు. టైటిల్ గెలిచేది ఎవరంటూ ఎన్నో ప్రైవేట్ సంస్థలు సర్వేలు చేస్తున్నాయి.

 ఫ్యాన్స్ లేఖలు బిగ్‌బాస్‌లోకి

ఫ్యాన్స్ లేఖలు బిగ్‌బాస్‌లోకి

బయట ఏం జరుగుతున్నది లోపల ఉన్న కంటెస్టెంట్లకు తెలియదు. కంటెస్టెంట్ల గురించి ఏం అనుకుంటున్నారో హౌస్‌మేట్స్‌కు తెలిసే అవకాశం ఉండదు. ఒక్క అలీకి తప్పా.. టాప్5లో ఉన్న మిగతా వారెవరికి బయట నడుస్తున్న ట్రెండ్ గురించి తెలీదు. అయితే వారి గురించి అందరూ ఏమనుకుంటున్నారో తెలియజేశాడు. అభిమానులు రాసిన లేఖలను బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు అందజేశాడు.

కన్నింగ్ శ్రీముఖి..

శ్రీముఖి అందిన లేఖలో తన గురించి రాసిని వాటిపై స్పందించింది. ఆ లేఖలో ఆమె కన్నింగ్ అని, మహిళ అనే సాకును చూపుతుందని, జెండర్ కార్డ్‌ను ఉపయోగిస్తుందని ఉంది. అయితే తానెప్పుడు అలా జెండర్ కార్డ్‌ను ఉపయోగించలేదని, అలాంటి వాటికి తాను వ్యతిరేకమని చెప్పుకొచ్చింది.

గత టాస్క్‌లను ఎత్తి చూపిస్తున్న నెటిజన్లు

దొంగల రాణి టాస్క్‌లో రవి తన చేయిను పట్టుకున్నాడని జైలుకు పంపించిన సంగతి, కెప్టెన్ అయ్యేందుకు మహిళలందరికీ అవకాశమిచ్చిన టాస్క్‌లో పరిగెత్తకుండా వదిలేసిందని ఇలా గడిచిన విషయాలను మళ్లీ గుర్తు చేస్తున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే శ్రీముఖి తరుపును ప్రచారం చేస్తోన్న ఆమె పీఆర్ టీమ్ చేసిన ట్వీట్ పెద్ద రచ్చగా మారింది.

 ఈ సారి ఆడవారికి..

ఈ సారి ఆడవారికి..

గత రెండు సీజన్లలో మగవారే గెలిచారు.. ఈ సారి ఆడవారికి అవకాశం ఇవ్వాలి.. మీరంతా శ్రీముఖికే ఓటు వేయండి అని ట్వీట్ సారాంశం. దీంతో నెటిజన్లు ఆ ట్వీట్‌పై భగ్గుమంటున్నారు. లోపల శ్రీముఖేమో జెండర్ కార్డ్ నచ్చదంటోంది.. మీరేమో ఇక్కడ వుమెన్ కార్డ్ చెప్పుకుని ఓట్టు అడుగుతున్నారంటూ ఫైర్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X