వితిక గిల్లుడు గొడవ పీక్స్.. వరుణ్, రాహుల్ మధ్య చిచ్చు.. పచ్చగడ్డి వస్తే భగ్గుమనేలా

Recommended Video

Bigg Boss Telugu Season 3 : Episode 67 Highlights

ప్రాణ స్నేహితులుగా కనిపించే వారి మధ్య ఉండే అనుబందం అసలైన సమయంలోనే బయటపడుతుంది. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు అందరూ బాగానే ఉంటారు. క్లిష్టమైన సమయంలో అసలు రంగు బహిర్గమవుతుంది. మొన్నటి వరకు మంచిగా ఉన్న రాహుల్, వరుణ్ లు ఒక్కసారిగా.. దూరమయ్యే పరిస్థితి వచ్చింది.

రాహుల్ ఎలిమినేషన్తో.. కంటతడి పెట్టిన వరుణ్

రాహుల్ ఎలిమినేషన్తో.. కంటతడి పెట్టిన వరుణ్

హౌస్లో మొదట్నుంచీ మంచి స్నేహితులుగా.. ఉంటూ బ్రొమాన్స్ ను పండించారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా వీరిద్దరు అలాగే ఉంటారని చాలా మంది విశ్వసించారు. అయితే అదంతా భ్రమే అని నిరూపించారు. రాహుల్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించిన వెంటనే.. వరుణ్ కంటతడి పెట్టడం.. తిరిగి రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు.. ఫేక్ ఎలిమినేషన్ అని తెలిసినప్పుడు ఎంత సంతోషించాడో అందరూ చూశారు.

ఒక్క మాటతో తలకిందులైన బందం..

ఒక్క మాటతో తలకిందులైన బందం..

టాస్క్లో భాగంగా ఇటుకలను వరుణ్ దగ్గరి నుంచి లాక్కుంటున్న రాహుల్ ను నిలువరించే వితికా ప్రయత్నించింది. అయితే ఆ క్రమంలో.. వితికా రాహుల్ ను గిచ్చింది. వితికా.. గిచ్చకు అంటూ రాహుల్ చెప్పగా.. నీవు చేస్తే లేదు.. మేము చేస్తే వచ్చిందా? అని వితికా అనడంతో.. ఇక గొడవకు అంతే లేకుండాపోయింది. ఆడవాళ్లకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అంటూ వరుణ్ ఫైర్ అయ్యాడు.

గత విషయాలను తవ్విన వరుణ్..

గత విషయాలను తవ్విన వరుణ్..

నన్ను ఎత్తి అవతల పారేస్టే ఏం లేదు కానీ.. వితికా గిచ్చితే ప్రాబ్లం వచ్చిందా? అంటూ వరుణ్ అసహనం వ్యక్తం చేశాడు. అయితే తానేం ఎత్తి అవతల పారేయలేదని చెప్పుకొచ్చాడు. ఇలా చెప్పడం నీకేం కొత్త కాదు? ఆ రోజు హిమజ విషయంలో కూడా ఇలానే తోయలేదంటూ బుకాయించావు.. తీరా వీడయో చూపించాక నిజం తెలిసిపోయిందంటూ.. ఎక్కడ లేనివి మాట్లాడుకుంటూ వచ్చాడు. నీ ప్రవర్తన గురించి అందరికీ తెలుసంటూ కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు.

వరుణ్ పై ఫర్ అవుతున్న రాహుల్ ఫ్యాన్స్

వరుణ్ పై ఫర్ అవుతున్న రాహుల్ ఫ్యాన్స్

రాహుల్ ను కించపరిచే విధంగా మాట్లాడిన వరుణ్ పై అతని అభిమానులు ఫైర్ అవుతున్నారు. రాహుల్ మంచోడు కాదని, అతని ప్రవర్తన గురించి తెలిసిన వరుణ్ ఇంతకాలం ఎందుకు స్నేహం చేశాడని ప్రశ్నిస్తున్నాడు. గత విషయాలను తవ్వి రాహుల్ను బ్యాడ్ చేయాలని చూసిన వరుణ్ సంగతి తేలుస్తామంటూ.. రాహుల్ ఫ్యాన్స్ సవాల్ విసురుతున్నారు. నామినేషన్లో ఉన్న వరుణ్కు తమ పవరేంటో చూపిస్తామని అంటున్నారు. మరి రాహుల్, వరుణ్ మధ్య జరిగిన ఈ ఘటన ఎంత వరకు దారి తీస్తుందో చూడాలి. ఇదంతా మరిచి పోయి మునుపటిలా కలిసిమెలిసి ఉంటారో లేదో అన్నది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X