ఏ ముహుర్తాన లైవ్ టెలికాస్ట్ అన్నారో... ఆడేసుకుంటోన్న నెటిజన్లు.. చెప్పలేక తలపట్టుకున్న యాజమాన్యం
జూలై 21న మొదలైన బిగ్‌బాస్ మూడో సీజన్ నవంబర్ 3న ముగిసేందుకు వచ్చింది. పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఎవ్వరూ ఊహించని రీ ఎంట్రీ, ఈ మూడో సీజన్‌కు హైలెట్‌గా నిలిచిన స్పెషల్ హోస్ట్ రమ్యకృష్ణ, తనస్టైల్లో సీజన్‌ను విజయవంతం చేసిన నాగార్జున ఇలా ఎన్నో విశిష్టతలతో కూడిన బిగ్‌బాస్ మూడో సీజన్‌కు వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది.
గత రెండు సీజన్లలో లేని బంపర్ ఆఫర్ అన్నట్లుగా ఫినాలె ఎపిసోడ్‌ను లైవ్ టెలికాస్ట్ అంటూ ప్రకటించేసింది యాజమాన్యం. అయితే అంతవరకు ఓకే అనుకున్నా.. ప్రోమోలు వదలడంతో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. అదేలా సాధ్యమవుతుంది.. లైవ్ టెలికాస్ట్ అన్నారుగా ప్రోమోలు ఎక్కడి నుంచి వచ్చాయంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. దీంతో యాజమాన్యం అందరికీ సమాధానం చెప్పలేక తలపట్టుకుంటోంది.

తాజాగా విడుదల చేసిన ప్రోమో తెగ వైరల్ అవుతోండగా.. నెటిజన్ల కామెంట్లు అదే రేంజ్‌లో హల్ చల్ చేస్తున్నాయి. రాశీ ఖన్నా డ్యాన్సుల, నిధి అందాలు, మారుతి స్టెప్పులు, శ్రీకాంత్ మాటలు, వరుణ్ బామ్మ చేస్తోన్న కామెడీ, కంటెస్టెంట్లు వేస్తున్న స్టెప్పులు ఇలా ఫుల్ మీల్స్‌లా కనిపిస్తోన్న ప్రోమోను చూస్తుంటూనే కడుపు నిండిపోతోంది. అయితే లైవ్ టెలికాస్ట్ అన్నారుగా ఇవన్నీ ఎలా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. విన్నర్‌ను మాత్రమే లైవ్‌గా ప్రకటిస్తామని కొందరికి యాజమాన్య రిప్లై ఇచ్చింది.


Click it and Unblock the Notifications











