twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్ టైటిల్ ఎవరు గెలిచినా.. రియల్ హీరో మాత్రం అతనే

    |

    బిగ్‌బాస్ షో వందరోజులకు పైగా దిగ్విజయంగా కొనసాగి.. చివరి అంకానికి చేరుకుంది. రేపటి నుంచి ఇక బిగ్‌బాస్ మాటలను మనం వినలేము. ఆ హౌస్‌లో జరిగే అల్లరి, ప్రేమ, గొడవ, కోపతాపాలు ఇక చూడలేము. ప్రతీ రోజూ మన ఇంట్లో మనుషులుగా మారిన కంటెస్టెంట్లు రేపట నుంచి బుల్లితెరపై కనబడరు. నేటితో విజేత ఎవరన్నది ప్రకటిస్తారు. టాప్ 5లో నిలిచిన కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేసేసి.. చివరకు విన్నర్, రన్నర్‌ను తేల్చేస్తారు. అంతటితో షోకు శుభం కార్డు పడుతుంది.

    ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న కంటెస్టెంట్లు.

    ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న కంటెస్టెంట్లు.

    అయితే ఈ వంద రోజుల ప్రయాణంలో ఎంతో మంది కంటెస్టెంట్లు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. మరి కొంత మంది హౌస్‌మేట్స్ మాత్రం ఆడియెన్స్ కోపానికి బలయ్యారు. ఏది ఏమైనా బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నంత వరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. తెరపై చూడటమే కాని నిజ జీవితంలో వారు ఎలా ఉంటారో తెలియని ఆడియెన్స్‌కు వారి రియల్ క్యారెక్టర్‌ను చూపించేందుకు బిగ్‌బాస్‌కు వస్తారు. అయితే అందులోనూ కొందరు నటిస్తూనే ఉంటారు. కానీ బిగ్‌బాస్ సామాన్యుడు కాదు కాబట్టి అందరి నిజస్వరూపాలను బట్టబయలు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాడు.

    నవ్వుతూ, నవ్వించిన బాబా భాస్కర్..

    నవ్వుతూ, నవ్వించిన బాబా భాస్కర్..

    ఈ సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లందరిలోనూ ఎంతో ఎనర్జీగా ఉన్న బాబా భాస్కర్ మాత్రం రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. అందర్నీ నవ్విస్తూ, నవ్వుతూ ఉండే బాబా కొన్ని సార్లు మాస్కర్‌గా కూడా నిందలు మోశాడు. అయితే అవన్నీ పట్టించుకోకుండా ఉండే బాబా.. అందరితోనే ఇట్టే కలిసిపోతుంటాడు. టాస్క్‌లో వంద శాతం ప్రయత్నిస్తాడని.. టాస్కులంటే ఎంతో ఉత్సాహంగా పాల్గొంటాడు. ఇదంతా బాగానే ఉన్నా బాబా భాస్కర్‌పై సైతం కొన్ని నెగెటివ్ కామెంట్లు వచ్చాయి.

     బాబా చేసిన కొన్ని తప్పిదాలు..

    బాబా చేసిన కొన్ని తప్పిదాలు..

    నామినేట్ చేస్తే తట్టుకోలేడని, అనాల్సినవి అనేసి.. మళ్లీ సరదాగ అన్నానంటూ కవర్ చేసుకుంటాడని హౌస్‌మేట్స్ అందరూ కామెంట్లు చేశారు. ఆడవాళ్ల డ్రెస్సింగ్‌పై కూడా కామెంట్లు చేయడం అదే విషయమై పునర్నవి, అషూ సీరియస్ అయిన సంగతి కూడా తెలిసిందే. బిగ్‌బాస్ హోటల్ టాస్క్‌లో శ్రీ ముఖి వాళ్ల అమ్మ వచ్చినప్పుడు బాబా చేసిన అతిపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అవి చూడటానికి సరదాగానే ఉన్నా.. బాబా లాంటి వ్యక్తికి అది సరిపడదని కామెంట్లు చేశారు. దీంతో బాబాపై కాస్త నెగెటివిటీ పెరిగింది.

    రియల్ హీరో అంటూ కామెంట్లు..

    రియల్ హీరో అంటూ కామెంట్లు..

    ఎటువంటి పీఆర్ టీమ్ లేకుండా, ముందస్తుగా ఎలాంటివి అమర్చుకోకుండా ఒకే ఒక్కడిగా ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్.. తన నిజాయితీ, మంచితనం, కలుపుగోలుతనం, నవ్వించే మనస్తత్వంతో టాప్5 వరకు చేరుకున్నాడని అతనే రియల్ హీరో అంటూ ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. భాష రాకపోయినా పక్క రాష్ట్రం నుంచి ఇంత దూరం ప్రయణించాడు.. ఎటువంటి ప్రచారం లేకుండా టాప్3లో నిలిచాడని బాబానే గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. బిగ్‌బాస్ విన్నర్ రాహుల్, రన్నర్ శ్రీముఖి అంటూ అందరూ కామెంట్లు పెడుతుండగా.. బాబా భాస్కరే తమకు నిజమైన విజేత అని ఆయన ఫాలోవర్స్ నమ్ముతున్నారు.

    English summary
    Bigg Boss 3 Telugu Finale Episode Highlates. Anjali, Nidhi Aggarwal, Raashi Khanna, Maruthi, Srikanth Are Attending This Grand event.It Is Going To Most Prestigious Event. Lets see Who Is Going To Won Bigg Boss 3 Telugu Title. Chiranjeevi Chief Guest For Finale Episode. Netizens Says That Baba Bhaskar Is Real Winner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X