వాడో పెద్ద వేస్ట్ గాడు.. వెధవ: పునర్నవి నోటి దురుసు.. నెటిజన్ల ఫైర్
బిగ్ బాస్ హౌస్‌లో ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. స్నేహితులుగా ఉన్నవారు శత్రువులుగా మారుతారు. శత్రువులు స్నేహితులుగా అవుతారు. ఎప్పడు ఏం జరుగుతుందో చెప్పలేం. పరిస్థితులను బట్టి అక్కడి మనుషుల స్వభావాలు మారుతూ ఉంటాయి. తాజాగా పునర్నవి నోటి దురుసు అభ్యంతరకరంగా మారింది. దాంతో ఆమె తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే..
Recommended Video

మొదట నుంచి మంచిగానే ఉన్న రవి..
వరుణ్, వితికా, రాహుల్, పునర్నవిలతో కలిసి ఉన్న రవి రాను రానూ వారికి దూరంగా ఉండిపోయాడు. వితికాతో బాగా క్లోజ్ అని చెప్పుకున్న రవి.. ఇప్పుడు ఆమె పేరు చెబితేనే చిరాకు పడుతున్నట్లు కనిపిస్తోంది. వేరే వారి దగ్గరికెళ్లి.. ఇంకొకరి విషయాలు మాట్టాడుతుందని, ఇదే విషయమై పున్ను గురించి కూడా బ్యాడ్గా మాట్టాడిందని జైల్లో ఉన్న సమయంలో రాహుల్ తో రవి చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇలా వితికా ప్రవర్తన నచ్చక వారికి దూరంగా ఉన్నట్టు కనిపిస్తోంది.

మొన్నటి నామినేషన్ ప్రక్రియతో ఇంకాస్త పెరగిన దూరం..
బిగ్ బాస్ పదో వారినిగానూ చేపట్టిన నామినేషన్ ప్రక్రియలో రవి, వితికాలను ఒక జంటగా విడగొట్టి పోట్లాడుకోమన్నాడు. హౌస్లో ఉండేందుకు మీకున్న అర్హతలను చెప్పుకోమన్నాడు. ఈ ప్రక్రియలో భాగంగా రవి చెప్పిన కొన్ని పాయింట్లను లేవనెత్తాడు. తన వల్ల హౌస్లో ఇన్విరాన్మెంట్ చెడిపోలేదని, ఒకరి దగ్గర ఇంకొకరి విషయాలను మట్లాడనని చెప్పుకొచ్చాడు. ఇక వీరిమధ్య మాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే చివరగా.. ఇంటి సభ్యుల ఓట్లతో రవి నామినేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది.

రవిపై ఫైర్ అయిన పున్ను...
వరుణ్, పున్ను, రాహుల్ గార్డెన్ ఏరియాలో కూర్చొని ముచ్చటిస్తుండగా.. వితికా రావడంతో రవి టాపిక్ మొదలైంది. సొల్లు వెధవతో నీకు సొల్లేంటి? అంటూ వితికాను ప్రశ్నించసాగింది. రవితో మాట్లాడుతున్నావా? అంటూ వితికాను వరుణ్ ప్రశ్నిస్తుండగా.. వాడితే మాటలేంటి? అంటూ పున్ను, వితికా బదులిచ్చారు. వాడో యెధవా.. యెదవాలాగా.. అంటూ కంట్రోల్ తప్ప బోతోన్న పున్నును వితికా కూల్ చేసింది. ఒక్క పాయింట్ సరిగ్గా మాట్టాడటం రాదంటూ ఫైర్ అయింది. వితికా మాట్లాడుతుంటే వెకిలి నవ్వులు నవ్వుతున్నాడు. వాడి వయసు 31..దానికి తగ్గట్టు ప్రవర్తించాలి.. ఇంత వరకు వాడి వాయిస్ ను స్ట్రాంగ్గా వినిపించాడా? అంటూ ధ్వజమెత్తింది.

పున్ను భాషపై నెటిజన్లు ఫైర్
పునర్నవి అలా మాట్లాడటంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మొదట్నుంచీ ఆమె అలాగే మాట్లాుడతుందోని.. హోస్ట్ ఆమెకు ముందే గడ్డి పెడితే ఇలా మాట్లాడేది కాదంటూ కామెంట్లు పెడుతున్నారు. హిమజను ఆంటీ అని, మహేష్ ను విలేజ్ పీపుల్ అని, రాహుల్ ను అయితే ఎలా సంభోదిస్తుందనేది చెప్పనక్కర్లేదంటూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications










