బిగ్‌బాస్ నుంచి పునర్నవి అవుట్, గుండె పగిలేలా ఏడ్చిన రాహుల్, ఏరా పిచ్చి అంటూ..
Recommended Video
బిగ్ బాస్ హౌస్లోంచి పదకొండో వారంలో పునర్నవి ఎలిమినేట్ అయింది. సోషల్ మీడియా లీకులు ఈసారి కూడా నిజమయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి పునర్నవి ఎలిమినేట్ అయిందనే వార్తలు హల్ చల్ చేయగా.. చివరకు అదే నిజమైంది. ఇన్ని వారాల తరువాత నలుగురు స్నేహితుల్లో ఒకరు ఎలిమినేట్ అయిపోయారు. దీన్ని వారు తట్టుకోలేకపోయారు. ఆదివారం ఎపిసోడ్ వివరాలు ఓ సారి చూద్దాం..

ఫన్‌గా ఎపిసోడ్
బిగ్ బాస్ హౌస్లో సండే ఫండేగా గడిచిపోయింది. నవరాత్రి సందర్భంగా.. కంటెస్టెంట్ల చేత.. నవరసాలు పండించాడు నాగార్జున. ఈ మేరకు అందరికీ ఒక్కో రసాన్ని ప్రదర్శించాలని తెలిపాడు. హౌస్మేట్స్ పది మార్కులు, నాగార్జున 20 మార్కులు వేస్తానని తెలిపాడు. దీంతో టాస్క్ను వరుణ్ చేత ప్రారంభించాడు. శాంతం అనే రసాన్ని వరుణ్కు ఇవ్వగా.. అందుకోసం అమ`త సినిమాలో ఏ దేవీ వరము నీవో.. అనే పాటను ప్లే చేశాడు. అయితే పాటకు, వరుణ్ చేసిన దానికి సంబంధం లేకపోయే సరికి అందరూ తక్కువ మార్కులు వేశారు.

కుర్రాళ్ల గుండెలను పిండేసిన పునర్నవి..
శృంగార రసం పునర్నవి పండించగా.. కుర్ర హ`దయాలను పిండేసింది. ఈ టాస్క్లో పునర్నవి ఇచ్చిన హావాభావాలు అదిరిపోయాయి. సీతయ్య సినిమాలోని సిగ్గేస్తోంది నిను చూస్తుంటే.. అనే పాటకు పునర్నవి చేసిన పర్ఫామెన్స్ అందర్నీ ఆకట్టుకుంది. అయితే బాబా భాస్కర్ ను చూసి ఆ పర్ఫామెన్స్ చేసిందని, అదే వేరే వారిని (రాహుల్) చూసుంటే ఇంకా బాగుండేదని శ్రీముఖి చెప్పుకొచ్చింది.

రాహుల్ పర్ఫామెన్స్ కు పగలబడి నవ్విన హౌస్మేట్స్..
శివజ్యోతికి కరుణ రసాన్ని ఇచ్చిన నాగ్.. ఆడజన్మకు ఎన్నిశోకాలో అన్న పాటను ప్లే చేశాడు. రవి ఫోటోను పట్టుకుని చేసిన ఆ పర్ఫామెన్స్ అందరికీ నచ్చింది. రాహుల్ కు భయానక రసాన్ని ఇచ్చాడు.. కానీ అది పర్ఫామ్ చేస్తున్నంత సేపు అందరూ పగలబడి నవ్వారు. ఏం చేయమంటే ఏంచేశావంటూ నాగ్ కూడా సెటైర్ వేశాడు.

అదరగొట్టిన శ్రీముఖి, బాబా, మహేష్
శ్రీముఖి రౌద్ర ప్రదర్శన, బాబా భాస్కర్ బీభత్సం, మహేష్ హాస్య ప్రదర్శన అదిరిపోయింది. వీరందరికీ వందకు వంద మార్కులు వచ్చాయి. హరిగిరి నందిని..పాటకు శ్రీముఖి, కాంచన పాటకు బాబా, ముత్యాలు వస్తావా అనే పాటకు మహేష్ అదిరిపోయేలా నటించి చూపించారు. ఈ టాస్క్లో వీరి నటనే హైలెట్ గా నిలిచింది.

ఎలిమినేట్ అయిన పునర్నవి..
చివరగా ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా పునర్నవి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. బయటకు వచ్చిన పునర్నవి..తన జర్నీకి సంబంధించిన వీడియోను చూసి.. ఎమోషనల్ అయింది. హౌస్ మేట్స్కు పంచ్ లేదా హగ్ అనే టాస్క్ ను పునర్నవికి ఇవ్వగా.. సరిగా స్టాండ్ తీసుకోడంటూ.. మహేష్ కు పంచ్, తనలా తాను ఉండాలని బాబాకు లిటిల్ పంచ్..మిగతా వారందరికీ పునర్నవి హగ్ ఇచ్చింది. వరుణ్ కు హగ్ తో పాటు కిస్ కూడా ఇచ్చింది. అందరినీ ఈజీగా నమ్మొద్దని సలహా ఇచ్చింది.

గుండె పగిలేలా ఏడ్చిన రాహుల్..
రాహుల్ పునర్నవి కోసం రాహుల్ ఒక పాట పాడాలంటూ నాగార్జున అడగ్గా.. పాడేందుకు ప్రయత్నించాడు. అయితే లోపలి నంచి వచ్చే దుఖాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చాడు. అయినా మళ్లీ పాడేందుకు ప్రయత్నించాడు కానీ పాడలేకపోయాడు. చివరకు బిగ్ బాసే వెళ్లిపోమాకే.. అనే పాటను ప్లే చేశాడు. అలీ మాష్టర్.. బాబా భాస్కర్ సేవకుడే అనే బిగ్ బాంబ్ ను వేసింది. దీంతో వచ్చే వారం అంతా.. అలీ చెప్పినట్టుగా బాబాను వింటాడని తెలిపాడు.


Click it and Unblock the Notifications











