రాహుల్‌కు సంబంధించిన ప్రశ్న.. సిగ్గుపడిన పునర్నవి.. అదిరిపోయే కౌంటర్
బిగ్‌బాస్ మూడో సీజన్‌లో రాహుల్, పునర్నవి పాపులర్ అయినంతగా ఇంకెవరూ కాలేదు. వీరిద్దరి జంటను చూస్తూ ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేశారు. పునర్నవి ఎలిమినేట్ అయి వెళ్లిపోతూ ఉంటే.. రాహుల్‌తో పాటు, ప్రేక్షకులు కూడా ఫీలయ్యారు. అంతగా వీరిద్దరికి ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు.
కొట్టుకోవడం, తిట్టుకోవడం..
హౌస్‌లో ఉన్నన్ని రోజులు వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడం, రాహుల్‌కు సేవలు చేయడం, ప్రేమగా తిట్టడం, కొట్టడం, కసురుకోవడం, గిల్లి కజ్జాలు పెట్టుకోవడం లాంటివి చేయడంతో ఈ జంట బాగా ఫేమస్ అయింది. వీరి మధ్య ఏదో నడుస్తోందని నాగార్జున హింట్లు ఇవ్వడం.. అలాంటిదేమీ లేదని వారిద్దరూ బుకాయించడం.. తమ బంధం డిప్లామేటిక్ అంటూ చెప్పుకుంటూ ఆ టాపిక్‌ను దాటవేసేవారు.

సపోర్ట్ చేసిన పునర్నవి..
పునర్నవి కోసం ఇరవై గ్లాసుల కాకరజ్యూస్‌ను తాగడం, ఆపై గట్టిగా హత్తుకోవడం, ముద్దు పెట్టడం ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. టాస్క్‌లో భాగంగా వరుణ్, రాహుల్‌కు గొడవలు జరిగితే.. రాహుల్‌కు సపోర్ట్ చేయడం అందరం చూశాం. బయటకు వచ్చాక కూడా నామినేషన్‌లో ఉన్న రాహుల్‌కు సపోర్ట్‌గా ఓట్లను కూడగట్టింది.

సుమ షోలో పాల్గొన్న పునర్నవి..
తాజాగా సుమ నిర్వహించే ఎఫ్3 షోలో పాల్గొన్న పునర్నవికి రాహుల్‌కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దీంతో సిగ్గుపడిన పునర్నవి.. మా ఫ్యామిలీ ఉంది, మా ఫాదర్ కూడా ఉన్నారు అంటూ తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకుంది. దీపావళి రోజున ప్రసారమయ్యే ఈ షోలో నాని గెస్ట్‌గా వచ్చి ఎంటర్టైన్ చేశాడు.


Click it and Unblock the Notifications











