రాహుల్‌తో రిలేషన్ వ్యక్తిగత జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపదు.. పునర్నవి సెన్సేషనల్ కామెంట్స్
బిగ్‌బాస్ మూడో సీజన్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది రాహుల్ పునర్నవి ట్రాకే. వరుణ్, వితిక, రాహుల్, పునర్నవిలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగే వేరు. ఈ నలుగురు ఈ సీజన్‌కు అట్రాక్షన్‌గా మారారు. నలుగురికి విడివిడిగా ఫ్యాన్ బేస్ ఉన్నా.. ఈ నలుగురును కలిపి ఇష్టపడే మరో గ్రూప్ సపరేట్‌గా ఉండటం విశేషం. స్నేహానికి మారుపేరుగా ఈ నలుగురు కలిసి ఉండటం.. ఎన్ని గొడవలు వచ్చినా.. మళ్లీ కలిసిపోవడం ప్రేక్షకులకు నచ్చింది.

శ్రీముఖి ఓటమి..
మొదట్నుంచీ శ్రీముఖే విన్నర్‌గా నిలుస్తుందని అందరూ అనుకున్నారు.. ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా ఈజీగానే గెలిచే అవకాశమున్నా ప్రవర్తన వల్లే అంతా పోగొట్టుకుంది. రాహుల్‌ను టార్గెట్ చేయడం.. అతను ఏం చేసినా తప్పు అనడం.. పదే పదే నామినేట్ చేస్తూ ఉండటం వల్ల రాహుల్‌కు ఫాలోయింగ్ పెరుగుతూ వచ్చింది. శ్రీముఖి ఫాలోయింగ్ తగ్గుతూ వచ్చింది. పైగా రియాల్టీ షోలో స్ట్రాటజీస్ కంటే.. ఎమోషన్స్ ఎక్కువగా వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఈ విషయాన్నిఅర్థం చేసుకోని శ్రీముఖి.. కేవలం ఆట మీదే ఫోకస్ పెట్టింది.. ఎమోషన్స్ గురించి వదిలేసింది. శ్రీముఖి హౌస్‌లో ఏ పని చేసినా.. అది ప్రేక్షకులకు ఫేక్‌గా అనిపించడమే ఆమె ఓటమికి కారణమైంది. దీంతో విన్నర్‌గా నిలవాల్సిన శ్రీముఖి రన్నర్‌గా మిగిలిపోయింది.

గెలిపించిన ముక్కుసూటితనం, జెన్యూనిటి
బిగ్‌బాస్ టైటిల్ గెలిచినా కూడా ఎక్కడా ఆ పొగరు, గర్వం చూపించడం లేదు రాహుల్. తాను గేమ్ ఆడనేలేదని, తాను ఎలా ఉన్నానో అలానే ఉన్నానని, జెన్యూన్‌గా ఉన్నానని అందుకే గెలిచానని చెప్పుకొస్తున్నాడు. తాను టైటిల్ గెలుస్తానని కూడా అనుకోలేదని చెప్పుకొచ్చాడు. ముక్కుసూటితనంగా వ్యవహరించడం, ఏ మూలన గేమ్ ఆడుతున్నట్లు, ఫేక్ ఎమోషన్లు చూపించని కారణంగానే రాహుల్ అందరి మనసులను గెలుచుకుని విజేతగా నిలిచాడు.

గ్రూప్‌గా ఫామ్ అయిన ఆ నలుగురు
హౌస్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఒక గ్రూప్‌గా ఫామ్ అయిన వరుణ్, వితిక, రాహుల్, పునర్నవి చివరి వరకు అలాగే ఉన్నారు. మొదట్లో అందరూ ఈ గ్రూప్‌ను టార్గెట్ చేసి నామినేట్ చేయడంతో అందరి దృష్టి ఈ గ్రూప్‌పై పడింది. అకారణంగానే నామినేట్ చేస్తున్నారని భావించిన ప్రేక్షకులు.. వారిని సేవ్ చేస్తూనే వచ్చారు. ఇక రాహుల్, పునర్నవి ట్రాక్ వీక్షకులను ఎంతో ఆకర్షించింది. వారిద్దరి గొడవలు, అలకలు, ప్రేమలు, తిట్లు ఇలా ప్రతీది ప్రేక్షకుడిని ఆకట్టుకుంది.

పునర్నవితో రిలేషన్..
ఎన్నో సందర్భాల్లో నాగార్జున వీరిద్దరి రిలేషన్‌పై కామెంట్ చేసినా.. వారు మాత్రం దాన్ని కొట్టిపారేశారు. మధ్యలో తనకు బయట ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని పునర్నవి కూడా చెప్పింది. అయినా వీరిద్దరి కెమెస్ట్రీ మాత్రం అందరికీ ఏదో అనుమానాన్ని పుట్టిస్తూనే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్ సదరు యాంకర్ కూడా ఇదే ప్రశ్నను అడిగింది. తానొక మంచి ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు.

రాహుల్‌తో రిలేషన్.. పున్ను కామెంట్
మా ఇద్దరి మధ్య జరిగింది.. బిగ్‌బాస్ హౌస్‌లో జరిగింది.. బయట చూపించింది.. ఇలాంటి వాటితో తన వ్యక్తిగత జీవితంపై ఎలాంటి ప్రభావం చూపదు.. నేనేంటో నాతో ఉండే వారందరికీ తెలుసు.. మా ఇంట్లో వారికి కూడా నేనేంటో తెలుసు.. రాహుల్ నేను మంచి ఫ్రెండ్స్ అని మరోసారి కుండబద్దలు కొట్టేసింది.


Click it and Unblock the Notifications











