twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముట్టుకోకు అంటూ పునర్నవి వార్నింగ్.. ఎక్కువగా చనువు ఇచ్చానన్న రాహుల్..

    |

    Recommended Video

    Bigg Boss 3 Telugu : Episode 76 Highlights || ముట్టుకోకు అంటూ పునర్నవి వార్నింగ్

    బిగ్ బాస్ హౌస్లో రాహుల్, పునర్నవి జంట హైలెట్ గా నిలుస్తోంది. వీరిద్దరూ ఏం చేసినా అది పెద్ద చర్చకే దారి తీస్తోంది. వీరిద్దరి వ్యవహారంపై నాగార్జున కూడా అప్పుడప్పుడు సెటైర్లు వేస్తూ ఉంటాడు. అయితే తమ మధ్య ఏమీ లేదంటూ టాపిక్ పక్కదారి పట్టేలా చేస్తారు.

    పునర్నవి సిక్స్ షేడ్స్..

    పునర్నవి సిక్స్ షేడ్స్..

    పునర్నవి ఎప్పుడెలా ఉంటుందో ఎవరికి అర్థం కాదని, తనకు సిక్స్ షేడ్స్ ఉంటాయని నాగార్జున ఏడిపిస్తూ ఉంటాడు. అయితే నిజంగానే పున్ను ఎప్పుడెలా ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలీదు. అప్పుడే తిడుతుంది, అప్పుడే నవ్వుతుంది. మాట్లాడకు అని రాహుల్ ను కోప్పడుతుంది.. మళ్లీ వచ్చి మాట్టాడుతుంది.

    ముట్టుకోకు అంటూ వార్నింగ్

    ముట్టుకోకు అంటూ వార్నింగ్

    నేటి ఎపిసోడ్లో పునర్నవి రాహుల్ మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఖాళీగానే ఉన్నావ్ గా సంత్ర ఒలిచివ్వు అని కిచెన్లో ఉన్న పునర్నవిని రాహుల్ అడిగాడు.దీంతో పునర్నవి సీరియస్ అయింది. తరువాత రాహుల్ బతిమిలాడినా మాట్లాడలేదు. నన్ను వదిలేయ్.. ముట్టుకోకు అంటూ వార్నింగ్ ఇచ్చింది. చూడు ఎలా సతాయిస్తున్నాడో అంటూ అలీకి కూడా ఫిర్యాదు చేసింది.

     ఇరిటేషన్ వస్తోందన్న రాహుల్

    ఇరిటేషన్ వస్తోందన్న రాహుల్

    కాసేపటికే మళ్లీ నవ్వుతూ వచ్చి రాహుల్తో మాట్టాడింది. అయితే రాహుల్ మాత్రం సీరియస్ అయ్యాడు. నిన్ను చూస్తే ఇరిటేషన్ వస్తోంది మాట్లాడకు పో అంటూ పునర్నవిపై ఫైర్ అయ్యాడు. ఎందుకు ఇరిటేషన్ వస్తుందంటూ పునర్నవి ఎదురు ప్రశ్నించింది.

    చనువు ఇచ్చానన్న రాహుల్

    చనువు ఇచ్చానన్న రాహుల్

    నన్ను వదిలేయ్.. ముట్టుకోకు అని అన్నావ్ కదా అని రాహుల్ అంటే.. నేనెప్పుడు అన్నానంటూ పునర్నవి దబాయించింది. ఎప్పుడు అన్నా? నాకేం గుర్తులేదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయాలన్నీ వరుణ్ తో చెప్పుకుంటూ రాహుల్ బాధపడ్డాడు. తనకు చనువు ఎక్కువ ఇచ్చానని, తప్పు నాదే అంటూ రాహుల్ చెప్పుకొచ్చాడు.

    మీరూమీరు చూసుకోండని సైడ్ అయిన వరుణ్

    మీరూమీరు చూసుకోండని సైడ్ అయిన వరుణ్

    పునర్నవి కూడా వరుణ్ తో ఈ విషయంపై మాట్లాడింది. ఇవి మీరూమీరు మాట్లాడుకోండి.. అంటూ వరుణ్ సైడ్ అయిపోయాడు. ఇలాంటి చిన్న చిన్న గొడవలు వీరిద్దరికి కామన్ అని అందరికీ తెలిసిందే. అయితే మరి ఈ వారం ఎలిమినేషన్లో భాగంగా వీరిద్దరి బిగ్ బాస్ దూరం చేస్తాడా? అన్నది చూడాలి.

    English summary
    Bigg Boss 3 Telugu Eleventh Week Updates. Rahul And Punarmnavi Fight Each Other. At End Of The Episode Also They Not Talks Each Other. Let see Who Will Be Eliminated Among Rahul, Punarnavi, Varun And mahesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X