For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాహుల్‌ను టార్గెట్ చేసిన శ్రీముఖి ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత

    |

    పదమూడో వారం నామినేషన్ ప్రక్రియ పెట్టిన చిచ్చు.. చినికి చినికి గాలి వానలా విస్తరించేట్టు కనిపిస్తోంది. రెండో నంబర్ కోసం రాహుల్, శ్రీముఖి మధ్యఎంతటి వాగ్వాదం జరిగిందో అందరం చూశాం. అయితే మళ్లీ నిన్నటి ఎపిసోడ్‌లో కూడా అలాంటి సంఘటనే జరిగింది.

    ఒకరిపై ఒకరు ఫైర్

    ఒకరిపై ఒకరు ఫైర్

    నామినేషన్ ప్రక్రియలో భాగంగా రాహుల్, శ్రీముఖిలు హద్దులు దాటి మాట్లాడుకున్నారు. గయ్యాలి గంప అంటూ రాహుల్ ఫైర్ కాగా.. శ్రీముఖి కూడా వెనక్కి తగ్గకుండా రెచ్చిపోయింది. బాబా భాస్కర్ ఎలాగో మొదటి నంబర్ ఇస్తాడని తెలిసినా.. కావాలనే తనను బ్లేమ్ చేయాలని, తనతో గొడవకు దిగాలనే కారణంతోనే తన వద్దకు వచ్చిందని అలీ, శివజ్యోతిలతో రాహుల్ చెప్పిన సంగతి తెలిసిందే.

    రికమండ్ అంటూ పాత విషయాన్ని తీసిన రాహుల్..

    రికమండ్ అంటూ పాత విషయాన్ని తీసిన రాహుల్..

    అయితే నిన్నటి టాస్క్‌లో భాగంగా మళ్లీ ఇదే అంశం చర్చకు వచ్చింది. మాటల్లో మాట వచ్చి రాహుల్ పాత విషయాన్ని ఒకటి మళ్లీ ముందుకు తీసుకొచ్చాడు. తనను బిగ్‌బాస్ షోకు శ్రీముఖే రిఫర్ చేసిందంటూ.. అలా వరుణ్, వితికాలతో చెప్పుకుంది.. ఆ విషయాన్ని వారు తనతో చెప్పారని బయట పెట్టాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.

    మాటలతోనే సర్ది చెప్పిన నాగ్..

    మాటలతోనే సర్ది చెప్పిన నాగ్..

    అలా తాను అన్నానని నిరూపిస్తే.. వెంటనే బయటకు వెళ్తానని శ్రీముఖి చెప్పగా.. ఒకవేళ తాను రికమండ్ అనే పదాన్ని చెప్పలేదని నిరూపిస్తే తానూ బయటకు వెళ్తానని చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయాన్ని నాగార్జున అక్కడే క్లియర్ చేసే అవకాశమున్న ఆ పని చేయలేదు. పాత వీడియోలను ప్లే చేసి చూపించకుండా.. మాటలతో సరిపెట్టాడు.

    వీడియోను వెతికిపట్టిన నెటిజన్లు..

    సోషల్ మీడియాలో నెటిజన్లు ఊరుకుంటారా? వెతికి మరి పట్టుకొచ్చి రాహుల్‌ను టార్గెట్ చేస్తున్నారు. అప్పటి సంభాషణకు సంబంధించిన వీడియోను ట్యాగ్ చేస్తూ.. శ్రీముఖి అలా అనలేదంటూ నిరూపించారు. బయటకు వెళ్తా అన్నావ్ కదా మరి పో అంటూ చురకలంటిస్తున్నారు. ఏది ఏమైనా పాత విషయాలను తీయకుండా ఉంటే బాగుంటుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

    English summary
    Bigg Boss 3 Telugu Rahul Is Trolling On Recommend Word About Srimukhi. he Recalled Past incidents That Srimukhi Recommended Him To Bigg Boss. Now He Is Trolling In Social Media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X