Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాహుల్‌ను టార్గెట్ చేసిన శ్రీముఖి ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత
పదమూడో వారం నామినేషన్ ప్రక్రియ పెట్టిన చిచ్చు.. చినికి చినికి గాలి వానలా విస్తరించేట్టు కనిపిస్తోంది. రెండో నంబర్ కోసం రాహుల్, శ్రీముఖి మధ్యఎంతటి వాగ్వాదం జరిగిందో అందరం చూశాం. అయితే మళ్లీ నిన్నటి ఎపిసోడ్లో కూడా అలాంటి సంఘటనే జరిగింది.
ఒకరిపై ఒకరు ఫైర్
నామినేషన్ ప్రక్రియలో భాగంగా రాహుల్, శ్రీముఖిలు హద్దులు దాటి మాట్లాడుకున్నారు. గయ్యాలి గంప అంటూ రాహుల్ ఫైర్ కాగా.. శ్రీముఖి కూడా వెనక్కి తగ్గకుండా రెచ్చిపోయింది. బాబా భాస్కర్ ఎలాగో మొదటి నంబర్ ఇస్తాడని తెలిసినా.. కావాలనే తనను బ్లేమ్ చేయాలని, తనతో గొడవకు దిగాలనే కారణంతోనే తన వద్దకు వచ్చిందని అలీ, శివజ్యోతిలతో రాహుల్ చెప్పిన సంగతి తెలిసిందే.
రికమండ్ అంటూ పాత విషయాన్ని తీసిన రాహుల్..
అయితే నిన్నటి టాస్క్‌లో భాగంగా మళ్లీ ఇదే అంశం చర్చకు వచ్చింది. మాటల్లో మాట వచ్చి రాహుల్ పాత విషయాన్ని ఒకటి మళ్లీ ముందుకు తీసుకొచ్చాడు. తనను బిగ్‌బాస్ షోకు శ్రీముఖే రిఫర్ చేసిందంటూ.. అలా వరుణ్, వితికాలతో చెప్పుకుంది.. ఆ విషయాన్ని వారు తనతో చెప్పారని బయట పెట్టాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.
మాటలతోనే సర్ది చెప్పిన నాగ్..
అలా తాను అన్నానని నిరూపిస్తే.. వెంటనే బయటకు వెళ్తానని శ్రీముఖి చెప్పగా.. ఒకవేళ తాను రికమండ్ అనే పదాన్ని చెప్పలేదని నిరూపిస్తే తానూ బయటకు వెళ్తానని చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయాన్ని నాగార్జున అక్కడే క్లియర్ చేసే అవకాశమున్న ఆ పని చేయలేదు. పాత వీడియోలను ప్లే చేసి చూపించకుండా.. మాటలతో సరిపెట్టాడు.
|
వీడియోను వెతికిపట్టిన నెటిజన్లు..
సోషల్ మీడియాలో నెటిజన్లు ఊరుకుంటారా? వెతికి మరి పట్టుకొచ్చి రాహుల్‌ను టార్గెట్ చేస్తున్నారు. అప్పటి సంభాషణకు సంబంధించిన వీడియోను ట్యాగ్ చేస్తూ.. శ్రీముఖి అలా అనలేదంటూ నిరూపించారు. బయటకు వెళ్తా అన్నావ్ కదా మరి పో అంటూ చురకలంటిస్తున్నారు. ఏది ఏమైనా పాత విషయాలను తీయకుండా ఉంటే బాగుంటుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.