పునర్నవి ఇష్టమని ప్రత్యేకంగా చెప్పాలా: రాహుల్.. ప్రేమగా మార్చుకుంటాడేమోనన్న వరుణ్
బిగ్ బాస్లో దాదాపు 76 రోజులు ఓ గ్రూప్ గా కలిసి ఉన్న రాహుల్, వరుణ్, వితికా, పునర్నవి పదకొండో వారంలో విడిపోయారు. ఇంతవరకు వారి గ్యాంగ్లో ఎవ్వరూ ఎలిమినేట్ కాకపోయేసరికి అంతగా ఫీలవ్వలేదు. అయితే రాహుల్ ది ఫేక్ ఎలిమినేషన్ అని తెలియక వరుణ్, పున్ను కాస్త ఎమోషనల్ అయ్యారు. మళ్లీ రాహుల్ హస్లోకి తిరిగొచ్చే సరికి ఆనందంతో ఎప్పటిలానే సరదాగా నవ్వుతూ గడిపేశారు.
అయితే పునర్నవి ఎలిమినేషన్తో ఆ ముగ్గురు కాస్త డీలా పడ్డట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా రాహుల్ ఒంటరి వాడయ్యాడు. పునర్నవి లేని లోటు అతనికి స్పష్టంగా తెలుస్తోంది. ఆదివారం రాత్రి ఎలిమినేషన్ అనంతరం వారు ముగ్గురు పునర్నవి విషయం గురించి మాట్లాడుకున్నారు. ఎమోషనల్ అవుతున్న రాహుల్ను ఓదార్చేందుకు ప్రయత్నించారు. పునర్నవిని రెండ్రోజుల క్రితమే హర్ట్ చేశానని రాహుల్ తెగ బాధపడ్డాడు.

పునర్నవి ఎలిమినేట్ అవుతుందని అస్సలు ఊహించలేదంటూ ముగ్గురూ బాధపడ్డారు. అయితే ఉదయం పూట మళ్లీ పునర్నవి గురించి మాట్లాడుకుంటూ.. బయటకు వెళ్లాక తనను మర్చిపోతుందేమోనని రాహుల్ ఫన్నీగా అన్నాడు. పాత ఫ్రెండ్స్, తన బాయ్ ఫ్రెండ్ మార్చేస్తారేమోనని రాహుల్ బయపడినట్లు కనిపిస్తోంది. వీడెవడు అని అనేస్తదేమోనని వరుణ్, వితికాలతో చెప్పుకొచ్చాడు.. పునర్నవి అంటే అంత ఇష్టమా అని వరుణ్ ప్రశ్నించగా.. ప్రత్యేకంగా చెప్పాలా?
అంటూ తిరిగి సమాధానం చెప్పాడు. అయితే బయటకు వెళ్లాక ప్రేమగా మార్చుకుంటాడేమోనని సరదాగా వరుణ్ అన్నాడు. అన్ని ఇక్కడ మాట్లాడుకోలేం.. అంటూ బయటకు వెళ్లాక చూద్దామంటూ రాహుల్ చెప్పుకొచ్చాడు. మరి నిజంగానే బయటకు వచ్చాక వరుణ్ మాటలను రాహుల్ నిజం చేస్తాడేమో చూడాలి.


Click it and Unblock the Notifications











