twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రంగంలోకి రాహుల్ అమ్మ.. ఇక మిగిలింది రెండు రోజులే అంటూ వీడియో

    |

    Recommended Video

    Rahul Sipligunj Vs Sreemukhi | Rahul Sipligunj's Mother & Sreemukhi's Father Video Bytes

    బిగ్‌బాస్ షో ముగిసేందుకు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ అందరిలోనే ఉత్కంఠ పెరిగిపోతుంది. బిగ్‌బాస్ టైటిల్ విన్నర్‌గా ఎవరు నిలుస్తారో అని చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే వీటిపై జరుగుతున్న ప్రచారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమాన కంటెస్టెంట్ల తరుపున ర్యాలీ, ప్లెక్సీలు కట్టి మరి ఓట్లు అడుగుతున్నారు. బిగ్‌బాస్ ఓటింగ్ ప్రక్రియ పొలిటికల్ ఎలక్షన్స్‌ను తలపిస్తోంది. చివరకు ఈ టైటిల్‌ను ఎవరు గెలుస్తారో కానీ.. ప్రస్తుతం ప్రచారంలో మాత్రం టాప్5లో ఉన్న ఐదుగురు దూసుకుపోతున్నారు.

    రాహుల్, శ్రీముఖి మధ్య పోటీ..

    రాహుల్, శ్రీముఖి మధ్య పోటీ..

    టాప్5లోకి మొదటగా చేరుకున్న రాహుల్.. ప్రస్తుతం ఓటింగ్ శాతంలో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానమైన పోటీ రాహుల్, శ్రీముఖి మధ్యే జరుగుతోందని సమాచారం. బయట వారి పీఆర్ టీమ్‌లు చాలా కష్టపడుతుండగా.. వరుణ్, బాబా, అలీ రెజాలు కూడా బాగానే పుంజుకుంటున్నారు.

    పీఆర్ టీమ్ లేకుండానే దూసుకుపోతున్న బాబా..

    పీఆర్ టీమ్ లేకుండానే దూసుకుపోతున్న బాబా..

    పక్క రాష్ట్రం నుంచి.. భాష రాకపోయిన ఇంత కాలం నెట్టుక వస్తూ.. పీఆర్ టీమ్‌లను పెట్టుకోకపోయినా అందరికీ గట్టి పోటీ ఇస్తున్నాడని బాబా భాస్కర్ అభిమానులు కామెంట్లు చేస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో బాబా తరువాతే ఎవ్వరైనా.. ప్రతీ క్షణం నవ్వించేందుకే ప్రయత్నిస్తాడని, అందరిలా వెనుక చెడుగా మాట్లాడడని, నిజాయితీ ఉన్న కంటెస్టెంట్ అంటూ బాబా తరుపున ఆయన ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు.

    వెనుకబడ్డ అలీ, వరుణ్..

    ఎలిమినేట్ అయి రీఎంట్రీ ఇచ్చిన అలీకి ఓట్లు తక్కువగానే వస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే అతని తరుపున సీరియల్ నటీమణులు జోరుగా ప్రచారం చేయడం.. హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో అలీకి మద్దతు లభిస్తుండటంతో ఓటింగ్ సరళిలో మార్పు వస్తున్నట్ల తెలుస్తోంది. చివరి వరకు ఎవరు టాప్‌లోకి వస్తారో చెప్పడం కష్టమని టాక్ వినిపిస్తోంది. మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకున్న వరుణ్ సందేశ్.. ఓటింగ్‌లో బాగానే దూసుకుపోయినట్లు కనిపిస్తున్నా టాప్ ప్లేస్‌లో లేనట్టు కనిపిస్తోంది. అందరి మనసులు గెలుచుకున్న వరుణ్.. ఓట్లను కొల్లగొట్టి విన్నర్ అవ్వాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.

    రంగంలోకి రాహుల్ అమ్మ..

    రంగంలోకి రాహుల్ అమ్మ..

    తన కొడుకును చూసేందుకు బిగ్‌బాస్ హౌస్‌లోకి గెస్ట్‌గా వచ్చి.. ఓ స్టార్ ఇచ్చి.. కంటెస్టెంట్లతో మంచిగా మాట్లాడి అందరి మనసులను గెలుచుకున్న రాహుల్ అమ్మ రంగంలోకి దిగింది. తన కుమారుడు రాహుల్‌కు ఓట్లు వేయమని.. ఇక మిగిలింది రెండు రోజులో ఓట్లు వేసి రాహుల్‌ను గెలిపించాలని కోరింది. సింగర్ నోయల్ కూడా రాహుల్‌ తరుపున విపరీతమైన ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే.

    English summary
    Bigg Boss 3 Telugu Updates. Top 5 Contestants Rahul, Sreemukhi, Baba Bhaskar, Varun Sandesh, Ali Reza Are Doing Well In Voting. Rahul's Mother request To Vote Rahul.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X