రాహుల్, వరుణ్ దారుణమైన ఫైటింగ్.. బూతులు తిట్టుకొని.. ఇంట్రెస్టింగ్ కెప్టెన్సీ టాస్క్
Recommended Video
బిగ్ బాస్ ఈ వారం ఇచ్చిన టాస్క్ వరుణ్ బ్యాచ్లో చిచ్చుపెట్టేలానే కనిపిస్తోంది. ఇంతవరకు ఎన్ని గొడవలైనా.. మళ్లీ యథావిథిగా కలిసే ఉన్నారు. జైల్లో రాహుల్ ఉన్నప్పుడు వరుణ్ తో గొడవ అయింది. అయినా.. మళ్లీ మామూలుగా ఉన్నారు. వితికా, పునర్నవిలకు గొడవలు అయ్యాయి. అయిన మళ్లీ దగ్గరయ్యారు.

కొట్టుకుచచ్చే విధంగా టాస్క్
పదో వారంలో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చిన ఈ టాస్క్లో.. శివజ్యోతి మహా పిసినారి రాణి. ఆవిడకు కొడుకులుగా రవి, వరుణ్, రాహుల్.. కోడళ్లుగా శ్రీముఖి, వితికా, పునర్నవిలు నటించాలి. బాబా భాస్కర్ మేనేజర్ గా అతని అసిస్టెంట్ గా మహేష్ తమ పాత్రలను పోషించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా పిసినారి రాణి అయిన శివజ్యోతి తన ఇటుకల వ్యాపారాన్ని చూసుకుంటూ ఉంటుంది.

కెప్టెన్సీ టాస్క్ కోసం
శివజ్యోతి ఇటుకలను తీసుకుని గోడను నిర్మించాలి. దీనిలో భాగంగా ఇటుకలను ఎవరి దగ్గరి నుంచైనా దొంగిలించవచ్చు. ఇలా ఆ మూడు జంటల్లో గోడను ఎవరు ఎక్కువ ఎత్తు నిర్మిస్తారో వారో కెప్టెన్సీ టాస్క్‌కు అర్హులవుతారని చెప్పాడు. ఇక శివజ్యోతి దగ్గర ఉండే వీలునామాను చివరకు ఎవరు చేజిక్కించుకుంటారో.. వారు కూడా ఆ కెప్టెన్సీ టాస్క్ కు అర్హులని చెప్పాడు.

ఇటుకలను దొంగిలించే క్రమంలో పోట్లాట..
ఇటుకలను దొంగిలించే క్రమంలోనే వరుణ్ సందేశ్, రాహుల్ కు పోట్లాట జరిగినట్టు తెలుస్తోంది. కొడతావా? అంటూ వరుణ్ రాహుల్ పైకి వెళ్లడం.. కామ్ డౌన్ అంటూ వరున్,రాహుల్ ను కూల్ చేసేందుకు వితికా ప్రయత్నించడం లాంటివి ప్రోమోలో కనిపిస్తున్నాయి.. అయితే మరి వీరిద్దరి మధ్య నిజంగానే అంతటి గొడవ జరిగిందా? అన్నది చూడాలి.

గోడను కట్టేసిన రవి, శ్రీముఖి
ఒకవైపు వరుణ్, రాహుల్ గొడవ పడుతుంటే.. మరో వైపు తమ పని తాము చేసుకుపోయారు. సందట్లో సడేమియా అన్నట్లు ఎవరు ఎటు పోతే మాకేంటి అన్నట్లుగా ఇటుకలను పేర్చి.. గోడను కట్టేసి.. టాస్క్ గెలవాలని రవి, శ్రీముఖి ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. మరి నేటి టాస్క్లో నిజంగానే వారి మధ్య గొడవ జరిగిందా? టాస్క్లో గెలిచింది ఎవరు అన్నది తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి.


Click it and Unblock the Notifications











