పునర్నవి చెంతకు రాహుల్.. సీక్రెట్ రూమ్‌లో ఏడ్చేసి.. మళ్లీ గ్రాండ్‌గా ఎంట్రీ
Recommended Video
బిగ్ బాస్ హౌస్లో తొమ్మిదో వారంలో గట్టి షాక్లు తగిలాయి. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లతో పాటు బయట చూస్తున్న ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాడు. డబుల్ ఎలిమినేషన్ అంటూ బాంబ్ పేల్చిన బిగ్ బాస్.. హౌస్ మేట్స్ గుండెలను దడదడలాడించాడు. అయితే అందులో ఒకటి ఫేక్ ఎలిమినేషన్ అంటూ ప్రేక్షకులు నోరెళ్లబెట్టేలా చేశాడు.

రాహుల్ ఎలిమినేషన్‌తో.. వరుణ్, పున్ను కంటతడి పెట్టడం
తన కోసం నామినే్ అయి ఎలిమినేట్ అవడంతో.. పునర్నవి తెగ బాధపడిపోయింది. అయితే రాహుల్ ఎలిమినేట్ కాడన్న గట్టి నమ్మకం తనకుందని చెప్పుకొచ్చింది. అయితే తననమ్మకం నిజమైందన్నది వేరే విషయం. అది షో చూస్తున్న ప్రేక్షకులకు తెలుసుగానీ, లోపలున్న ప్రేక్షకులకు తెలీదు. ఇక రాహుల్ ఎలిమినేషన్తో హౌస్ ఎన్నడూ ఏడ్వని వరుణ్ సందేశ్ కూడా ఏడ్చేశాడు. ఇక తాను ఎవరితో పోట్లాడాలి, ఎవరిని ఏడ్పించాలని అంటూ నాగార్జునతో చెప్పుకుని కన్నీరుపెట్టుకుంది.

ఫేక్ ఎలిమినేషన్ అంటూ షాక్..
ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుందో.. అచ్చం అలాంటి సీనే సెట్ చేసిన బిగ్ బాస్.. చివరకు ప్రేక్షకకులకు షాక్ ఇచ్చాడు. బయటకు వచ్చిన రాహుల్తో.. హౌస్ మేట్స్ కు మార్కులు కూడా వేయించాడు. ఎందుకంటే ఇది ఫేక్ ఎలిమినేషన్ అని కంటెస్టెంట్లకు ఎక్కడా అనుమానం రాకుడదని. తీరా అంతా అయ్యాక.. ఇది ఫేక్ ఎలిమినేషన్ అంటూ ప్రకటించేసరికి రాహుల్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యచకితులయ్యారు.

సీక్రెట్ రూమ్ లో రాహుల్..
ఇది ఫేక్ ఎలిమినేషన్ అంటూ బాంబు పేల్చిన నాగ్.. ఇది బిగ్ బాస్ ఆడించిన ఆట అంటూ రాహుల్తో చెప్పుకొచ్చాడు. బిగ్బాస్ తదుపరి ాదేశాలు వచ్చేవరకు సీక్రెట్ రూమ్లో ఉండాలని తెలిపాడు. సీక్రెట్ రూమ్ లోకి వెళ్లిన రాహుల్.. హాయిగా విశ్రాంతి తీసుకున్నట్టు కనిపిస్తోంది. అక్కడ ఉన్న లైట్ వెలిగితే.. మైక్ ధరించి మెల్లిగా మాట్లాడాలని, తనకు ఏమైనా అవసరమున్నా కూడా ఇలాగే మాట్లాడాలని తెలిపాడు.

నేడు హౌస్లోకి ెంట్రీ ివ్వనున్న రాహుల్..
తన స్టైల్‌లో ర్యాపో పాడుకుంటూ ఎంట్రీ ఇస్తున్నట్టు తాజాగా ప్రోమోను విడుదల చేశారు. ఇక రాహుల్ మళ్లీ ఎంట్రీ ఇస్తున్నాడని తెలియడంతో పున్ను ఎగిరి గంతేసింది. వరుణ్ కూడా ఆనందంలో మునిగి తేలిపోయాడు. రాహుల్ తిరిగి రావడంతో మిగతా హౌస్ మేట్స్ రియాక్షన్ ఎంటి? మరి ఒక్కరోజు సీక్రెట్ రూమ్లో తన అనుభవాల గురించి తన స్నేహితులతో పంచుకున్నాడా? నేటి నామినేషన్ ప్రక్రియ సంగతేంటి? అన్నవి తెలియాలంటే నేటి ఏపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











