For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిచ్చు పెట్టిన ప్రోమో.. పునర్నవిని ఆడుకున్న రాహుల్ ఫ్యాన్స్.. వద్దంటూ విన్నర్ విన్నపం

  |

  రాహుల్ సిప్లిగంజ్-పునర్నవి భూపాలం ఈ పేర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరిచయం అక్కర్లేని ఈ జంట.. బిగ్‌బాస్ షోలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. వీరిద్దరి కెమెస్ట్రీతో బిగ్‌బాస్ షోను అందంగా మలిచేశారు. వీరి గొడవలు, అలకలు, ప్రేమలు, జోకులు ఎంతగా ఫేమస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. హౌస్‌లో ఉన్నంత సేపు ఎలా ఉన్నారో.. బయటకు వచ్చాక కూడా అలానే ఉన్నారు. అదే స్నేహబంధాన్ని కొనసాగిస్తూ హల్‌చల్ చేస్తున్నారు.

  ఆ నలుగురి బంధం..

  ఆ నలుగురి బంధం..

  హౌస్‌లో ప్రవేశించిన దగ్గరి నుంచి ఒక్కటిగా ఏర్పడ్డారు వితికా, వరుణ్, రాహుల్, పునర్నవి. మొదటి నుంచి ఒక గ్యాంగ్‌గా.. కష్టసుఖాల్లో తోడున్నారు. ఒకరికొకరు గొడవలు పెట్టుకున్నా..మరుక్షణమే మరిచిపోయి ఎప్పటిలాగే కలిసిపోయారు. ఒకరిపై మరొకరు ఫైర్ అయినా, దూరం పెరిగినా మళ్లీ కలిసి పోవడం వారి స్నేహబంధానికి నిదర్శనంగా మారింది. వీరి స్నేహ బంధానికి బిగ్‌బాస్ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు.

  జంటగా కేకే పుట్టించిన పున్ను రాహుల్..

  జంటగా కేకే పుట్టించిన పున్ను రాహుల్..

  ఆ నలుగురిలో వరుణ్-వితికా భార్యభర్తలు కాగా.. రాహుల్, పునర్నవిల బంధం సైతం కొన్ని చోట్ల అలాంటి అనుమానాలకే తావిచ్చింది. వారిద్దరు వ్యక్తిగత విషయాలను పంచుకోవడం, నాగార్జున సైతం వారి బంధం గురించి పదే పదే ప్రశ్నించడం, వారు కూడా తప్పించుకునే సమాధానాలు చెప్పడంతో అందరూ వారిద్దరిపై ఓ కన్నేయడం మొదలుపెట్టారు. బిగ్‌బాస్ హౌస్‌లో వీరి కెమెస్ట్రీకి, జంటకు భారీ ఫాలోయింగ్ ఏర్పడటంతో షో క్రేజీగా మారింది.

  కేవలం స్నేహితులమే..

  కేవలం స్నేహితులమే..

  ఎందరు ఎన్నిరకాలుగా ప్రశ్నించినా, ఎంత మంది వారి రహస్య సంబంధం గురించి ప్రశ్నలు సంధించినా తాము కేవలం మంచి స్నేహితులమేనని చెప్పి తప్పించుకుంటారు. వారు ఎంత వాదించినా.. సోషల్ మీడియాల్ కామెంట్లు మాత్రం ఆగడం లేదు. వారిద్దరు పెళ్లి చేసుకుంటారని, చేసుకుంటే బాగుంటుందని, వారి జంట బాగుందనే కామెంట్లు హల్‌చల్ చేస్తుంటాయి.

  చిచ్చు పెట్టిన ప్రోమో..

  చిచ్చు పెట్టిన ప్రోమో..

  తాజాగా ఓ మీడియా చానెళ్లలో ప్రసారం అయిన ప్రోమో వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. నా వల్ల, శ్రీముఖి వల్ల టైటిల్ గెలిచివా? అవకాశా వాదివా.. అంటూ రాహుల్‌ను పునర్నవిని ప్రశ్నించినట్టుగా ఉన్న ఆ ప్రోమోను వీక్షించిన రాహుల్ ఫ్యాన్స్ పునర్నవిని ఆడేసుకున్నారు. తమ చిచ్చాను కించపరిచిందంటూ రాహుల్ ఫ్యాన్స్ పునర్నవిపై రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా సందేశాలు పంపిస్తూ.. అసభ్యకరంగా మెసెజ్‌లు పెడుతున్నారని పునర్నవి వాపోయిందట. ఇదే విషయాన్ని రాహుల్ వద్ద ప్రస్థావించిందట.

  #CineBox : Allu Arjun Is taking Huge Remuneration For Trivikram Srinivas's 'Ala Vaikuntapuramlo'?
  వద్దని రాహుల్ విన్నపం..

  వద్దని రాహుల్ విన్నపం..

  దీంతో ఇద్దరూ కలిసి లైవ్‌లోని వచ్చి ఈ గొడవకు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. పునర్నవిని ఇష్టమొచ్చినట్టు తిట్టిన తన చిచ్చాలకు రాహుల్ ఓ విన్నపం చేశాడు. తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని, ఆ ఇంటర్వ్యూలో ఇద్దరం కలిసి పాల్గొన్నామని, ఎప్పటిలాగే అక్కడ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నామని, వారి టీఆర్పీ కోసం ప్రోమోను అలా కట్ చేశారని, దాన్ని పట్టుకుని అందరూ పునర్నవి తిట్టడం సరికాదని, ఆమెను టార్గెట్ చేయకండని తన చిచ్చాలను కోరాడు. వేరే వారి ఫ్యాన్స్ కూడా ఈ అవకాశాన్ని వాడుకుంటున్నారని, అలా చేయవద్దంటూ సూచించాడు.

  English summary
  Bigg Boss 3 Telugu Rahul Sipligunj Fans Fires On Punarnavi. In Recent Interview She And rahul Participated. That Promo Goe sViral On Social Media. So Rahul Fans Abusing Punarnavi. And They Duo Came Live On Gave Clarification.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more