అలీకి బిగ్ షాక్.. టికెట్ ఫినాలే నుంచి అవుట్.. బిగ్‌బాస్ ఫైనల్లో రాహుల్
Recommended Video
పద్నాలుగో వారంలో బిగ్‌బాస్.. తన హౌస్‌మేట్స్‌కు ఓ మంచి అవకాశాన్ని ఇచ్చాడు. నేరుగా ఫైనల్‌కు చేరుకునేందుకు ఓ మార్గాన్ని సూచించాడు. ఈ వారం నామినేషన్ ప్రక్రియకు బదులుగా టికెట్ టు ఫైనాల్ అని టాస్క్‌ను చేపట్టాడు. ఈ టాస్క్‌లో మొదట పార్ట్ కాస్త ప్రశాంతంగానే జరిగినా రెండో పార్ట్ మాత్రం హింసాత్మకంగా మారింది.

బిగ్ షాక్ ఇచ్చిన బిగ్‌బాస్
ఒకే మట్టిలో అలీ, బాబా ఇద్దరూ పూల మొక్కలను నాటాలి. అయితే చివరి వరకు ఎవరి మొక్కలు మట్టిలో నాటి ఉంటాయో వారికి రీచార్జ్ చేసుకునే అవకాశం వస్తుందని తెలిపాడు. అయితే ఈ టాస్క్ పదే పదే హింస చోటుచేసుకుంటూ ఉండటంతో బిగ్‌బాస్ ఓ పెద్ద బాంబ్ వేశాడు. ఈ టాస్క్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపాడు.

ఫైనల్ రేస్ నుంచి అవుట్..
ఎన్నిసార్లు చెప్పినా అలీ.. హింసాత్మకంగా టాస్క్ ఆడటంతో అలీని ఫైనల్ రేసు నుంచి తప్పించినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. దీంతో అలీకి పెద్ద షాక్ తగిలింది. దీంతో అలీ నామినేషన్‌లో వచ్చేశాడు. ఇదే విషయాన్ని బాబాతో శ్రీముఖి చెపుకొచ్చింది. టాస్క్ హింసాత్మకంగా మారుతోందని చెప్పాలని అనుకున్నాను కానీ అంతలోనే బిగ్‌బాస్ చెప్పేశాడు.

రాహుల్‌కు గాలి దేవుడి సహాయం..
డామినోస్‌ను వరుస క్రమంలో అమర్చాలని, చివరి వరకు ఎవరి డామినోస్ ఎక్కువగా నిల్చి ఉంటాయో వారే విజేతలుగా నిలుస్తారని తెలిపాడు. అయితే గాలి దేవుడు మాత్రం రాహుల్‌కు మద్దతు తెలిపినట్టు కనిపించింది. చివరకు శ్రీముఖి ఈ టాస్క్‌లో ఓడిపోయింది. తనకు అదృష్టం అనేది లేదని బాబాతో చెప్పుకొంది.

పిరమిడ్ అంటే బాక్స్‌ను నిర్మించిన శివజ్యోతి..
క్యూబ్స్‌తో పిరమిడ్ అంటే బాక్స్‌ను నిర్మించిందన్న కారణంతో టాస్క్‌లో శివజ్యోతి ఓడిపోయిందని, శ్రీముఖి గెలిచినట్టు బిగ్‌బాస్ ప్రకటించాడు. దీంతో రాహుల్‌కు ఫైనల్ టికెట్ లభించిందని, మిగిలిన వారంతా నామినేషన్‌లోకి వచ్చినట్లు తెలిపారు. రాహుల్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి.. ఫైనల్‌కు టికెట్ ఇచ్చాడు. ఫైనల్‌కు చేరుకోవడంతో రాహుల్ ఫుల్ ఖుషీ అవుతున్నాడు.

రాహుల్ గురువు అలీ...
ఇక ఈ ఆనందాన్ని అలీ, వరుణ్‌లతో రాహుల్ పంచుకున్నాడు. అలీనే తన గురువంటూ ప్రకటించేశాడు. ఫైనల్ ఎపిసోడ్ కోసం ఇప్పటి నుంచే వర్కౌట్లు చేద్దామని అలీతో చెప్పుకొచ్చాడు. తాను ఓడిపోయినందుకే రాహుల్‌కు ఫైనల్ టికెట్ వచ్చిందని, అందుకే వచ్చి థ్యాంక్స్ చెప్పినట్లు అలీ వరుణ్‌తో చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











