బ్రేకింగ్ : శ్రీముఖికి షాక్.. బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ .. సోషల్ మీడియాలో వైరల్

బిగ్‌బాస్ మూడో సీజన్‌కు చరమ గీతం పాడాల్సిన సమయం వచ్చేంది. టైటిల్ పోరులో నిలిచిన రాహుల్, శ్రీముఖి, వరుణ్, బాబా భాస్కర్, అలీ రెజాల తరుపున ఉదృతంగా ప్రచారం జరిగింది. ఫినాలె ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్‌ను శనివారం మధ్యాహ్నాం నుంచి ప్రారంభమైంది. ఇక ప్రతీసారి వారం లీకులు జరిగినట్టే ఈ వారం కూడా ఫలితం ఏంటన్నది ముందే లీకైపోయింది. కాకపోతే ఇంతవరకు ఎవరు ఎలిమినేట్ అయ్యారన్న విషయం లీకయ్యేది.. ఇప్పుడు ఎవరు గెలిచారన్న విషయం లీకైంది.

మొదటి వారం నుంచి ఇదే తంతు..

మొదటి వారం నుంచి ఇదే తంతు..

బిగ్‌బాస్ సెట్‌ను అన్నపూర్ణ స్టూడియోలో నిర్మించడంతో. . రహస్యంగా ఉంచాల్సిన ప్రతీ విషయం లీకవుతూనే ఉంది. మొదటి వారంలో మొదలైన ఈ లీకులు.. చివరకు ఎంతో రహస్యంగా ఉంచాల్సిన విజేత విషయంలో కూడా అదే జరిగింది. ఆదివారం ఎపిసోడ్ వరకు ఆగాల్సిన పని లేకుండా శనివారం సాయంత్రమే తెలిసిపోయింది.

 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా లీకులమయమే..

వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా లీకులమయమే..

వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో షోను మరో లెవెల్‌కు తీసుకెళ్లాల్సిన బిగ్‌బాస్ బ‌ృందం ఆ విషయంలోనే చేతులెత్తేసింది. తమన్నా, శిల్పా చక్రవర్తిలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోయే విషయం కూడా ముందుగానే లీకైపోయింది. అంతేకాకుండా రాహుల్ ఫేక్ ఎలిమినేషన్, అలీ రీ ఎంట్రీ ఇలా ప్రతీది లీకవుతూనే వచ్చింది. తాజాగా సీజన్ 3 విన్నర్ ఎవరన్నది కూడా లీకైపోయింది.

రాహుల్ సీజన్ 3 విన్నర్..

రాహుల్ సీజన్ 3 విన్నర్..

చిచ్చా.. హైదరాబాద్ పోరడు.. రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ సీజన్ 3 విన్నర్‌గా నిలిచాడని వైరల్ అవుతోంది. చివరి వరకు ఉత్కంఠగా నిలిచిన పోరులో శ్రీముఖిని పడగొట్టి రాహుల్ విజేతగా నిలిచాడని చిచ్చా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఓటింగ్‌లో హోరాహోరీగా పోటీ పడిన శ్రీముఖి ఫ్యాన్స్ తీవ్ర నిరాశే ఎదురైందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ముక్కుసూటిగా ఉండటం వల్లే అంటూ..

ముక్కుసూటిగా ఉండటం వల్లే అంటూ..

రాహుల్ తన నిజాయితీతో, ముక్కుసూటి తనంతో ఎంతో మంది మనసులను గెలుచుకుని వారి అభిమానంతో పాటు, ఓట్లను సంపాదించుకుని విజేతగా నిలిచాడు. ఎప్పుడూ కూడా తాను గేమ్ ఆడటం లేదు అని ఎంతో నిక్కచ్చిగా చెబుతూ అందరితోనూ మంచిగా ఉండేందుకు ప్రయత్నించాడు. అందర్నీ ఎంటర్టైన్ చేసుకుంటూ సరదాగా గడిపేవాడు. మిగతా వారిలా స్ట్రాటజీలంటూ మైండ్ గేమ్ ఆడకుండా ప్రశాంతంగా ఉండేవాడు. ఇవే ఇతని విజయానికి కారణాలయ్యాయి.

శ్రీముఖికి షాక్..

శ్రీముఖికి షాక్..

మొదట్నుంచీ సీజన్ 3 విన్నర్ శ్రీముఖే అని చాలా మంది భావించినా.. తన ప్రవర్తనతో అందరికీ దూరమైంది. తనకు ఎమోషన్స్ , రిలేషన్స్ అవసరం లేదని.. ఆటే ముఖ్యమని చెప్పిన శ్రీముఖి ఓటమి పాలైందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎప్పుడూ ఏదో ఆలోచనలతో, ఏదో ఒకటి చేద్దామని, ఎత్తులు పైఎత్తులు అంటూ ఆలోచిస్తూ ఉన్న శ్రీముఖికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టైంది. సోషల్ మీడియాలో లీకులు సర్వసాధారణమే అయినప్పటికీ ..విజేత ఎవరన్నది బిగ్‌బాస్ బ‌ృందం అధికారికంగా ప్రకటించే వరకు ఆగాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X