twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్వరలోనే పున్నుతో కలిసి లైవ్‌లో వస్తా.. ఫీవర్‌తో బాధపడుతున్నా.. రాహుల్ కామెంట్స్

    |

    బిగ్‌బాస్ సీజన్3 విన్నర్‌గా నిలిచిన రాహుల్ మొదటిసారిగా లైవ్‌లోకి వచ్చాడు. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు. విన్నర్‌గా నిలిచినందుకు అందరూ కంగ్రాట్స్ చెప్పసాగారు. నెటిజన్లు చూపిస్తున్న ప్రేమకు ఫుల్ ఖుషీ అయిపోయాడు. బిగ్‌బాస్ విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్‌కు సోషల్ మీడియాలో ఎంతటి క్రేజ్ ఏర్పడిందో అందరికీ తెలిసిందే. హౌస్ నుంచి బయటకు వచ్చిన రాహుల్ ఇంతవరకు ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వకపోయే సరికి లైవ్‌లోనే ప్రశ్నల వర్షాన్ని కురిపించారు.

    బాగా సపోర్ట్ చేసిన నోయెల్

    బాగా సపోర్ట్ చేసిన నోయెల్

    రాహుల్‌కు మొదటి నుంచి సింగర్ నోయెల్ ఎంతగా సపోర్ట్ చేశారో అందరం చూశాం. బయట అతనిపై ఎంతగా నెగటివ్ ట్రోలింగ్ జరిగినా వెనక్కి తగ్గకుండా రాహుల్ కోసం నిల్చున్నాడు. మధ్యలో పవన్ కళ్యాణ్ పేరును వాడుకుంటూ కొందరు నోయెల్‌ను ఆడుకున్నా.. భయపడకుండా వారికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. అంతలా తన స్నేహితుడి కోసం నిలబడ్డ నోయెల్‌కు రాహుల్ థ్యాంక్స్ చెప్పాడు.

    దర్శకుడు తరుణ్ భాస్కర్, విశ్వక్‌సేన్ కూడా..

    దర్శకుడు తరుణ్ భాస్కర్, విశ్వక్‌సేన్ కూడా..

    బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో బయటి నుంచి తనకు చాలా మంది సపోర్ట్ చేశారని, నోయెల్, హీరో విశ్వక్‌సేన్, దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా మద్దతిచ్చారని పేర్కొన్నాడు. వారందరికే కాదు తనకు సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్స్ అని చెప్పుకొచ్చాడు.

     పున్నుతో కలిసి త్వరలోనే లైవ్ లోకి వస్తా..

    పున్నుతో కలిసి త్వరలోనే లైవ్ లోకి వస్తా..

    నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. పున్నుతో కలిసి త్వరలోనే లైవ్‌లోకి వస్తానని తెలిపాడు. వరుణ్ చాలా మంచివాడని, టాస్క్‌లో చిన్న చిన్న గొడవలు జరుగుతాయని, మీరు చూసేది ఒక గంట మాత్రమే మేము అక్కడ 24 గంటలుంటాము.. వరుణ్ చాలా మంచివాడని తెలిపాడు. ఆ ముగ్గురు లేకపోతే తాను ఇంత దూరం వచ్చే వాడిని కాదు.. టాస్క్‌లో సహాయం చేసేవారని, పున్ను అయితే తిట్టి మరీ ఆడేలా చేసేదని చెప్పుకొచ్చాడు.

     ఫీవర్‌ వచ్చినట్లు ఉంది..

    ఫీవర్‌ వచ్చినట్లు ఉంది..

    హౌస్‌లోకి వచ్చిన వెంటనే.. ఈ ప్రపంచంలోకి రావడానికి కాస్త సమయం పట్టిందని, కొంచెం ఫీవర్ వచ్చినట్లు ఉందని అందుకే నిన్న, మొన్నా లైవ్‌లోకి రాలేదని తెలిపాడు. ఇప్పుడు కూడా అలాగే ఉందని, అక్కడ 24 గంటలు ఏసీలో ఉండటం.. ప్రస్తుతం బయటి వాతావరణం.. ఇలా అన్నీ కలిసిపోయాయని తెలిపాడు. మళ్లీ కాసేపయ్యాక నోయెల్‌తో కలిసి లైవ్‌లోకి వస్తానని చెప్పి వెళ్లిపోయాడు.

    అందరికీ థ్యాంక్స్ చెప్పిన రాహుల్..

    అందరికీ థ్యాంక్స్ చెప్పిన రాహుల్..

    లైవ్‌లోకి వచ్చిన రాహుల్‌కు అందరూ కంగ్రాట్స్ చెబుతూ తోపు తోపు అంటూ కామెంట్లు పెట్టసాగారు. తనకు ఓట్లు వేసిన మీరంతా తోపు అంటూ ఫ్యాన్స్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. తానైతో గెలుస్తానని అసలు అనుకోలేదని, ఓట్లు వేసిన ప్రతీ ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నానని అన్నాడు. నెటిజన్ల కోరిక మేరకు పాట పాడి వినిపించాడు.

    English summary
    Bigg Boss 3 Telugu Rahul Sipligunj On Live In Social Media. He Thanked Every One Whom Voted For Him And Supporting In His Victory.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X