అలీ రెజాకి ఓటు వేయండంటూ చిన్నారుల ర్యాలీ.. వైరల్ అవుతోన్న వీడియో

బిగ్‌బాస్ మూడో సీజన్ ముగిసేందుకు సమయం దగ్గర పడుతోంది. ఈ ఆదివారమే బిగ్‌బాస్ విన్నర్‌ను ప్రకటించబోతోన్నారు. ఇప్పటికే టాప్ 5కి చేరుకున్న కంటెస్టెంట్ల తరుపున వారి అభిమానులు ర్యాలీలు, ప్రచారాలు చేపట్టగా.. ఓటింగ్‌లో అందరూ దూసుకువెళ్తున్నారు. ఇప్పటి వరకు వినిపిస్తున్న టాక్ ప్రకారం.. రాహుల్, శ్రీముఖిల మధ్యే పోలింగ్ వార్ జరగుతోందని తెలుస్తోంది.

 బిగ్‌బాస్ ఫైనల్‌కు స్పెషల్ గెస్ట్..

బిగ్‌బాస్ ఫైనల్‌కు స్పెషల్ గెస్ట్..


గత సీజన్ ఫైనల్ ఎపిసోడ్‌కు విక్టరీ వెంకటేష్ అతిథిగా విచ్చేసి.. అందర్నీ ఎంటర్టైన్ చేశాడు. తన చేతుల మీదుగానే కౌశల్‌ను విన్నర్‌గా ప్రకటించి.. టైటిల్‌ను అందజేశాడు. మరి ఈ సారి చివరి ఎపిసోడ్‌కు మెగా ప్లాన్ వేసినట్టు కనిపిస్తోంది బిగ్‌బాస్ బృందం. మెగాస్టార్ చిరంజీవిని స్పెషల్ గెస్ట్‌గా విచ్చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కనివినీ ఎరుగని రీతిలో ఆటపాటల కార్యక్రమం కూడా ఉండబోతోందని టాక్. ఈమేరకు ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ స్టేజ్‌పై చిందులు వేయనున్నట్లు తెలుస్తోంది.

 ఓటింగ్‌లో దూసుకుపోతోన్న రాహుల్, శ్రీముఖి

ఓటింగ్‌లో దూసుకుపోతోన్న రాహుల్, శ్రీముఖి

టాప్5లో రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజా ఉండగా.. ఓటింగ్‌లో మాత్రం ఓ ఇద్దరి మధ్యే ప్రధానంగా పోటీ నడుస్తోందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ ఇద్దరికే ఎక్కువగా ఓట్లు వచ్చినట్లు టాక్. అయితే మిగతా వారు కూడా పుంజుకునే అవకాశం లేకపోలేదు. అలీ రెజా, బాబా భాస్కర్, వరుణ్‌కు కూడా భారీగానే ఓట్లు పోలవుతున్నట్లు తెలుస్తోంది.

అలీ రెజాకు మద్దతుగా చిన్న పిల్లల ర్యాలీ

అలీ రెజాకు మద్దతుగా చిన్న పిల్లల ర్యాలీ

అలీ రెజాకు ఓట్లు వేయండంటూ చిన్న పిల్లలు చేసిన ర్యాలీ ప్రస్తుతం వైరల్‌గా మారింది. చివరకు ఈ వీడియో అలీ రెజా పీఆర్ టీమ్ దగ్గరకు చేరింది. ఇంతకంటే ఎక్కువ ఇంకేమీ అడగం.. మీ అందరి ఓట్లతో అలీ రెజా ఓటింగ్‌లో దూసుకుపోవాలని కోరుకుంటున్నామంటూ వీడియోను షేర్ చేశారు.

రీఎంట్రీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు గెలిచిన చరిత్ర లేదు..

బిగ్‌బాస్ హౌస్‌లో రీఎంట్రీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు టైటిల్ గెలిచినట్టు చరిత్రలో లేదు. ప్రేక్షకుల తిరస్కరణకు గురైన అలీ రెజాను మళ్లీ ఎలాంటి ఓటింగ్ పెట్టకుండానే రీ ఎంట్రీలో తీసుకొచ్చారు. దీంతో అలీపై కాస్త నెగెటివిటీ పెరిగింది. మరి అదంతా మరిచిపోయి ప్రేక్షకులు అలీని విన్నర్‌గా నిలిచేలా చేస్తారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X