పాపం కోరిక తీరకుండానే ఎలిమినేట్ అయ్యాడట.. బిగ్‌బాస్ ఇంట్లో మళ్లీ వరద.. నెటిజన్ల సెటైర్!

Recommended Video

Bigg Boss Telugu 3 : Ravi Krishna May Eliminate This Week

బిగ్ బాస్ షో అనేది ఎమోషన్లతో ఆడే ఆట. మనమంటే నచ్చని వారు, మనల్నే తిట్టుకునే వారు, ప్రేమించేవారు ఇలా అందరూ ఒకే ఇంట్లోనే ఉంటారు. అప్పుడే తింటుకుంటారు. మరుక్షణమే కలిసిపోతారు. అయితే ప్రతీవారం నామినేషన్స్, ఎలిమినేషన్స్ జరగుతూనే ఉంటాయి. ఎవరోకరు వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ వారంలో హౌస్లోంచి బయటకు వెళ్లేందుకు బాబా భాస్కర్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, రవికష్ణ నామినేట్ అయిన సంగతి తెలిసిందే.

ఎలిమినేట్ కాబోయేది

ఎలిమినేట్ కాబోయేది

అయితే నామినేషన్ అయిన ప్రక్రియ అయిన మరుక్షణమే.. ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరన్నది అందరికీ తెలిసిపోయే ఉంటుంది. ఎందుకంటే ఈ వారం నామినేషన్ లిస్ట్లోకి వచ్చింది టాప్ అండ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. అందులో కొంచెం వెనకబడి ఉన్నది ఎవరో చూసే ప్రేక్షకులందరికి తెలుసు. ప్రేక్షకుల ఊహకు తగ్గట్టే ఈ సారి మంచోడు అనే ట్యాగ్ ఉన్న వ్యక్తి ఎలిమినేట్ అయిన వార్త లీకైంది.

అతి మంచోడు అనే ట్యాగ్..

అతి మంచోడు అనే ట్యాగ్..

వివాదాల జోలికి పోకుండా.. హౌస్లో ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా సేఫ్ గేమ్ ఆడే రవిక`ష్ణకు మంచోడు అనే ట్యాగ్ పడింది. కొంత మంది ఇంటిసభ్యులు అతి మంచోడనే ముద్ర కూడా వేసేశారు. అయితే తమన్నా వ్యవహారంలో రవి చూపించిన సహనానికి మాత్రం నిజంగానే హీరో అయ్యాడు. ఎంతగా హింసించినా, కించపరిచినా.. సంయమనం పాటించాడు. మంచి పేరు సంపాదించాడు.

కోరిక తీరకుండానే..

కోరిక తీరకుండానే..

కెప్టెన్ కావాలనే కోరిక తీరకుండానే ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. అయితే నిన్నటి టాస్క్లో.. కెప్టెన్ కావాలని శతవిథాల ప్రయత్నించాడు. అతిని స్నేహితుడు అలీ రెజా కూడా సాయశక్తులా ట్రై చేశాడు. వితికా చేసిన పనితో రవి ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరులా అయింది. కనీసం ఎలిమినేట్ అయ్యే ముందైనా కెప్టెన్ను చేసి పంపిద్దామని అలీ రెజా కోరినా కొంతమంది వినిపించుకోలేదు.

రవి ఎలిమినేట్ కాబోతోన్నాడని తెలుసుకున్న అలీ..

రవి ఎలిమినేట్ కాబోతోన్నాడని తెలుసుకున్న అలీ..

రీఎంట్రీ ఇచ్చిన అలీ.. బయట జరగుతున్న విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఎవరికెంత బలముంది? ఎవరి ఫాలోయింగ్ ఎంతుంది? అనేవి చాలానే తెలుసుకున్నాడు. దీంతో రవి ఎలిమినేట్ కానున్నాడని ముందే పసిగట్టేశాడు. దీంతో వెళ్లేముందైనా కెప్టెన్ చేసి పంపుదామని అందర్నీ కోరాడు. కానీ అది నెరవేరకుండానే రవి ఎలిమినేట్ కానున్నాడని సమాచారం. రవి వెళ్లే సమయంలో శివజ్యతో ఏడుపులతో మరోసారి వరదలు వచ్చే ప్రమాదముందని నెటిజన్లు సెటైర్స్ వేస్తున్నారు. ఇక అలీ ఎలిమినేట్ అయిన విషయాన్ని అధికారికంగా ప్రకటించడమే తరువాయి అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X