twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ లొల్లిని ఢిల్లీ వరకు తీసుకెళ్లిన శ్వేతారెడ్డి, గాయిత్రి గుప్తా

    |

    బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఇప్పటికే ఈ షోపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వీరు... తాజాగా ఆ ఎఫ్ఐఆర్ కాఫీలను పట్టుకుని ఢిల్లీ చేరారు. జాతీయ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి విచారణ జరిపిస్తామని కమీషన్ సభ్యులు హామీ ఇచ్చారని వారు మీడియాకు వెల్లడించారు.

    కాగా... శ్వేతారెడ్డి, గాయిత్రి గుప్తా చేసిన ఫిర్యాదుపై బిగ్ బాస్ కోఆర్డినేషన్ టీమ్ కూడా హైకోర్టును ఆశ్రయించింది. బంజారాహిల్స్, రాయదుర్గం పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

    Bigg Boss 3 Telugu reality show controversy: Swetha Reddy, Gayathri Gupta asks help National Commission For Women

    నాగార్జున హోస్ట్‌గా ప్రారంభం కాబోయే బిగ్ బాస్ షోకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి, నటి గాయిత్రి గుప్తా ఫిర్యాదులకు తోడు... ఈ రియాలిటీ షో నిలిపి వేయాలని కోరుతూ తెలంగాణ హై కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. తెలుగు దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ పిల్ వేశారు.

    కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిల్‌లో నాగార్జునతో పాటు మరో 10 మందిని ప్రతివాదులుగా చేర్చడం చర్చనీయాంశం అయింది. అయితే ఈ వివాదాలతో సంబంధం లేకుండా జులై 21 నుంచి ఈ షో ప్రారంభం కాబోతోందని అంటున్నారు.

    English summary
    Bigg Boss 3 Telugu reality show controversy, Swetha Reddy, Gayathri Gupta asks help National Commission For Women.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X