బిగ్‌బాస్ ఎలిమినేషన్.. బాబా జోస్యమే ఫలించిందా.. ఆమె ఊహించిందే నిజమైందా?

బిగ్‌బాస్ షో చివరి అంకానికి చేరుకుంది. నిన్నటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లందరికీ చివరగా ఓ అవకాశాన్ని ఇచ్చాడు. తమ మనసులో మాటలను, బిగ్‌బాస్ జర్నీ గురించి, తాము ఎదుర్కొన్న పరిస్థితులు ఇలా అన్నింటి గురించి మనుసు విప్పుకుని మాట్లాడుకోండి అంటూ ఉదయం మూడు గంటలకే నిద్రలేపాడు బిగ్‌బాస్.

సేవ్ అయిన బాబా..

సేవ్ అయిన బాబా..

ఈ క్రమంలో అందరూ తమ జర్నీల గురించి చెప్పుకొచ్చారు. చివరగా ఫలితాలు కూడా వచ్చేయాని, ఆడియెన్స్ తమ తీర్పు కూడా చెప్పేశారని, బాబా భాస్కర్ సేవ్ అయ్యాడని ప్రకటించాడు. దీంతో బాబా భాస్కర్ ఆనందంలో తేలిపోయాడు. అతనికి టికెట్ టు ఫినాలే షీల్డ్‌ను ఇచ్చాడు. దాన్ని చూసి మురిసిపోయాడు.

 ఎలిమినేషన్‌పై ఆరా..

ఎలిమినేషన్‌పై ఆరా..

ఈ వారం ఎవరు ఉంటారు? ఎవరు పోతారు అనే దానిపై ఇంటి సభ్యులందరూ చర్చించుకున్నారు. బాబా రాహుల్ మాట్లాడుకుంటూ.. అలీ, శివజ్యోతి, బాబా వెళ్లే అవకాశం ఉందని రాహుల్ తన అభిప్రాయాన్ని చెప్పుకురాగా.. బాబా కూడా అవుననే సమాధానం చెప్పాడు. అయితే అలీ, శివజ్యోతికి మాత్రం ఎక్కువ చాన్స్ ఉందని, అలీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని రాహుల్ చెప్పుకొచ్చాడు.

బాబా, శివజ్యోతి చర్చలు..

బాబా, శివజ్యోతి చర్చలు..

నామినేషన్ విషయమై శివజ్యోతి బాబాతో చర్చిస్తూ... ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారు అని అడిగింది. తనకు ఏదైనా ఓకే అంటూ సమాధానం చెప్పగా.. అలీ, తాను వెళ్లాకే మీరు వెళ్తారని శివజ్యోతి చెప్పుకొచ్చింది. తామిద్దరమే డేంజర్ జోన్‌లో ఉందన్న విషయం పసిగట్టింది.

టాప్ ఫైనల్ వారే...

టాప్ ఫైనల్ వారే...

ఇలా మాట్లాడుకుంటూనే శివజ్యోతి అడిగిన ప్రశ్నకు గానూ రాహుల్, శ్రీముఖి, వరుణ్, అలీ ఎవరు టాప్‌లోకి వెళ్లినా తనకు పర్లేదు అంటూ బాబా చెప్పుకొస్తుండగా.. మరి నేను అంటూ శివజ్యోతి ప్రశ్నించింది. అసలు నువ్వు లెక్కలోనే లేవు అంటూ సెటైర్ వేశాడు.

ఎలిమినేట్ అయిన శివజ్యోతి

ఎలిమినేట్ అయిన శివజ్యోతి

హౌస్‌లో మొదటి రెండు మూడు వారాల్లోనే ఎలిమినేట్ అయిపోతుందని అందరూ భావించినా.. చాప కింద నీరులా వస్తూ పద్నాలుగో వారం వరకు షోలో కొనసాగింది.టాప్ ఫైనల్ అయ్యేందుకు అన్ని అర్హతలున్నా.. కాలం కలిసి రాలేదు. టాప్ 5కి చేరకుండానే ఇంటి బాట పట్టినట్టు తెలుస్తోంది. శివజ్యోతి ఎలిమినేట్ అయిందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించే వరకు ఎదురు చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X