విన్నర్ ఒక్కరే.. అంటూ వీడియోతో ముందుకు వచ్చిన శివజ్యోతి

Recommended Video

విన్నర్ ఒక్కరే.. అంటూ వీడియోతో ముందుకు వచ్చిన శివజ్యోతి

బిగ్‌బాస్ చివరి అంకానికి చేరుకుంది. పద్నాలుగో వారంలో శివజ్యోతి, బాబా భాస్కర్, అలీ, శ్రీముఖి, వరుణ్ సందేశ్‌లు నామినేషన్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. రాహుల్ నేరుగా ఫైనల్‌కు చేరుకోవడంతో వీరంతా నామినేషన్‌లోకి వచ్చి పడ్డారు. అయితే టాప్5లో ఉండాలన్న తన కోరిక నెరవేరకుండానే వెనుదిరిగింది శివజ్యోతి. ఆదివారం ఇంటి బయటి నుంచి వచ్చిన శివజ్యోతి.. బిగ్‌బాస్ హౌస్‌మేట్స్, కుటుంబ సభ్యులతో బాగా ఎంజాయ్ చేసింది.

హౌస్‌లో తన గ్రాఫ్‌ను పెంచుకుంటూ..

హౌస్‌లో తన గ్రాఫ్‌ను పెంచుకుంటూ..

మొదట్లో అందరి కంటే సైలెంట్‌గా ఉంటూ ఎవ్వరితోనూ ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా తనపనేదో తాను చేసుకుంటూ పోతూ వచ్చింది. రోజులు గడుస్తున్న కొద్దీ.. ఎలిమినేషన్‌లో ఒక్కొక్కరు వెళ్తుండటంతో శివజ్యోతి గ్రాఫ్ పెరగుతూ వచ్చింది. టాస్క్‌లో ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుంటూ చివరి వరకు పోరాడింది.

స్నేహితులు ఒక్కొక్కరుగా వెళ్తడంతో..

స్నేహితులు ఒక్కొక్కరుగా వెళ్తడంతో..

శివజ్యోతికి క్లోజ్ అయిన హౌస్‌మేట్స్ ఒక్కొక్కరుగా ఎలిమినేట్ కావడంతో కుంగిపోయింది. రోహిణి తన వల్లే నామినేట్ కావడంతో.. ఎలిమినేషన్ విషయం ప్రకటించాక భోరున విలపించింది. అషూ వెళ్లేటప్పుడు, అలీ రెజా ఎలిమినేట్ అయినప్పుడు, రవి బయటకు వచ్చేటప్పుడు బాధపడినా.. తన ఆటను మాత్రం కొనసాగించింది.

ఏడుస్తూ చికాకు పుట్టించిన శివజ్యోతి..

ఏడుస్తూ చికాకు పుట్టించిన శివజ్యోతి..

ప్రతీ చిన్న విషయానికి ఏడుస్తూ చూసే ప్రేక్షకులకు వెగటు పుట్టేలా చేసింది. ఇంతకు ముందు శివజ్యోతి అంటే ఉండే ఫీలింగ్‌ను బిగ్‌బాస్ షో పూర్తిగా మార్చి వేసింది. ఆమె ఏడుపులపై నాగార్జున సైతం సెటైర్లు వేస్తూ ఉండేవాడు. సోషల్ మీడియాలో అయితే ఆమె ఏడుపులపై వచ్చే మీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 టాప్5లో చేరకుండానే..

టాప్5లో చేరకుండానే..

బ్యాటరీని రీచార్జ్ చేసుకోలేక హౌస్‌మేట్స్ నామినేషన్‌లోకి వచ్చారు. అలీ, బాబా ఆడిన ఆట వల్ల అందరి ఫేటే మారిపోయింది. దీంతో రాహుల్ సునాయసంగా టికెట్ టు ఫినాలే దక్కించుకున్నాడు. మిగతా వారంతా నామినేషన్‌లోకి వచ్చారు. దీంతో శివజ్యోతి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. టాప్ 5లో ఉండాలనుకునే తన కల నెరవేరకుండానే తిరుగు పయనం కట్టింది.

దీపావళి సెలబ్రేషన్స్.. పబ్‌లో గంతులు

దీపావళి సెలబ్రేషన్స్.. పబ్‌లో గంతులు

బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన అనంతరం.. కుటుంబ సభ్యులను, బిగ్‌బాస్ కంటెస్టెంట్లను కలుసుకున్న శివజ్యోతి వారితో కలిసి సరదాగా గడిపింది. అషూ, హిమజ, రోహిణిలతో కలిసి దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకోగా.. అందరూ కలిసి పబ్‌లో తెగ ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది.

వీడియోతో అభిమానుల వద్దకు

అన్ని పనులు పూర్తి చేసుకున్న శివజ్యోతి.. తనకు సపోర్ట్ చేసిన అభిమానులకు ధన్యవాదాలు చెప్పేందుకు ఓ వీడియోతో ముందుకు వచ్చింది. ఆలస్యమైనందుకు అందరికీ క్షమాపణలు చెబుతూ.. తనను అంత దూరం తీసుకు వచ్చేందుకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలను తెలిపింది. విన్నర్ కాలేకపోయినందుకు నేనేమీ బాధపడను.. మీరు కూడా బాధపడకండి.. విన్నర్ ఒక్కరే కదా.. అయినా నన్ను ప్రేమించేవాళ్లు కూడా చాలా మందే ఉన్నారు.. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అంటూ కోరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X