అలీకి క్లాస్ పీకిన భార్య... శ్రీముఖి గాలి తీసిన బాబా భాస్కర్ భార్య
పదమూడో వారంలో కంటెస్టెంట్లకు ఫ్యామిలీ టచ్ ఇస్తోన్న క్రమంలో మంగళవారం నాటి ఎపిసోడ్‌లో వితికా సోదరి ఎంట్రీ ఇవ్వగా.. బుధవారం నాటి ఎపిసోడ్‌లో మిగతా హౌస్‌మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ ఇచ్చారు. అలీ భార్య మసుమా ఎంట్రీ ఇవ్వగా.. వారంతా కళ్లు మూసుకుని ఉండే టాస్క్‌లో నిమగ్నమై ఉన్నారు. దీంతో వచ్చింది ఎవరో తెలీక శివజ్యోతి మసుమా చెంప మీద కొట్టింది. రాహుల్ జట్టు పట్టి లాగాడు.

అలీకి గడ్డి పెట్టిన భార్య...
హౌస్‌లోకి ఎందుకు వచ్చావ్.. ఊరికే శివజ్యోతితో మాట్లాడు కుంటూ ఉండటం కాదు టాస్క్‌లు సరిగ్గా ఆడు అంటూ సలహాలు ఇచ్చింది. మొదట్లో ఉన్న అలీ కావాలని అంటున్నారు.. అప్పుడే నీకు అందరు ఓటు వేస్తారు. నాక్కూడా అప్పటి అలీనే కావాలని తెలిపింది. రిలేషన్ షిప్‌లు కావాలంటే బయటకు వెళ్లాక పెట్టుకోవచ్చు ముందు ఆట ఆడంటూ గడ్డి పెట్టింది. ఇక హౌస్‌లో ఉన్న వారందరినీ పలకిరిచింది. ఎక్కువగా ఏడ్వద్దని శివజ్యోతికి సూచించింది.

ఫైనల్ మనదేనన్న గంగూలి..
మూడో అతిథిగా శివజ్యోతి భర్త గంగూలి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే టాస్క్‌లో ఉండటం చేత ఎటూ కదలకూడదు, మాట్లాడకుండా ఉండాలనే కండీషన్ వల్ల.. శివజ్యోతి ఏడుస్తూనే ఉంది. రిలీజ్ అని చెప్పిన తరువాత కోర్ట్ యార్డ్‌లోకి తీసుకెళ్లి తన భర్తతో శివజ్యోతి ముచ్చటించింది. బయటి సంగతులను అడిగి తెలుసుకుంటుండగా.. ఫైనల్ మనదేనన్నధీమాను వ్యక్తపరిచాడు. టాస్క్‌లో దెబ్బ తాకింది ఎట్లుంది అని అడిగినవ అని శివజ్యోతి ప్రశ్నించగా.. ఫోన్ చేసి కనుక్కున్నాను అని చెప్పాడు. అందరితో మంచిగానే ఉంటున్నావ్..అలానే ఉండు.. ఏడుపును తగ్గించుకో అని సూచించాడు.

ఎనర్జీ వచ్చిందన్న బాబా భాస్కర్
నాలుగో అతిథిగా బాబా భాస్కర్ ఫ్యామిలీ ఎంట్రీ ఇచ్చింది. అయితే మొదటగా పిల్లల్ని మాత్రమే పంపించిన బిగ్ బాస్.. కొద్ది సేపటి తరువాత ఆయన భార్యను కూడా హౌస్‌లోకి పంపించాడు. బయట ఏం జరుగుతుందని అడిగి తెలుసుకున్నాడు. ఎందుక ఏడుస్తుంటావ్, టాస్క్‌లు బాగానే ఆడుతున్నావని చెప్పుకొచ్చింది. టైటిల్ గెలిచి రండి.. ఆ అర్హత మీకే ఉందని వెళ్తూ వెళ్తూ చెప్పింది. చివర్లో గేట్‌ను తోసి మరీ చివరి సారిగా.. బాబా భాస్కర్ తన కుటుంబ సభ్యులను కలిశాడు.

రాహుల్‌తో ఆడుకున్న బిగ్‌బాస్...
బాత్రూమ్ ఏరియాలో పాట పాడుకుంటూ ఉన్న రాహుల్‌తో బిగ్‌బాస్ ఆడుకున్నాడు. ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్‌లో పాటలు పాడమని ఆర్డర్ వేశాడు. దీంతో పాటలు త్వరత్వరగా పాడలేకపోయాడు రాహుల్. అలీ, శివజ్యోతి రాహుల్ పాడిన పాటలకు స్టెప్పులు వేశారు. బాబా భాస్కర్ భార్య శ్రీముఖి గాలి తీసేసింది. ఊరికే గరిట తిప్పుతూ కనిపిస్తూ ఉంటుంది. వంటేమైనా చేస్తుందా? అసలు వీళ్లకు వంట వచ్చా అని అడిగింది. ఓన్లీ గరిటే తిప్పుతుందట అంటూ అందరూ శ్రీముఖిని ఏడ్పించసాగారు.


Click it and Unblock the Notifications











